Monday, August 15, 2011

rahamania- ఇప్పుడిటు కనుగొంటి



రెహమాన్ అంటే ఎందుకో ఒక రకమైన prejudiced view ఉండేది నాకు. ఇళయరాజా పాటలు staple diet గా పెరగటం ప్రధానకారణం.

కానీ తనలో ఒక genius ఉన్నాడు అన్నది తెలుస్తూనే ఉన్నా accept చేయలేక పోయే వాడిని. ఇప్పుడిప్పుడే కొంచెం impartial view తో కొత్తగా వినే ప్రయత్నం చేశాను. నా దేవుడా! he has really composed some of the finest interludes. okay. they have been few and far between.

తప్పకుండా తనకు ఒక ode లాంటి మెచ్చుకోలు వ్రాయాలి అనిపించింది. it has been long overdue.

తను స్వరపరచిన commercial పాటలలో nursery rhyme బాణీలతో విసిగిస్తాడు. jerks ఎక్కువగా ఉంటాయి. మాధుర్యం పాలు కూడా తక్కువే. ఒక నిర్దేశిత పద్ధతిలో ఉండవు. ఇవీ రహమాన్ సంగీతంపై నా ఆరోపణలు. (ఇళయరాజా ను వెనక్కి నెట్టేశాడు ఇది బైటికి ఇప్పుడు చెబుతున్న కారణం).

అయితే..orchestrization లో, recording లో తను తెచ్చిన మార్పు ను ఒకే వాక్యంలో చెప్పాలంటే. before రహమాన్ and after రహమాన్ అన్నంతలా భారతీయ సినీ సంగీతాన్ని మార్చివేశాడు.

కండుకొండేన్ కండుకొండేన్ సినిమాలోని ఈ పాట ఒక masterpiece అని చెప్పవచ్చు. ముఖ్యంగా రెండో చరణం ముందరి interlude వింటే రహమాన్ కు oscar ఇవ్వటం సముచితమే అనిపిస్తుంది. ఈ పాటను మంచి quality గల music system లో వింటే ఆ అనుభవం అద్భుతంగా ఉంటుంది. పాట చిత్రీకరణ, photography చాలా బాగున్నాయి. పాట బాణీ ఎలా ఉందంటే. శరదృతువులో నీలాకాశంలో తెల్లని మేఘం స్వేచ్చావిహారం చేసినట్టుగా ఉంటుంది. ఇక gorgeous ఐశ్వర్య రాయ్ ఈ సినిమాలో ఎంత అందంగా ఉందో. it is one of her finest films.


ఇళయరాజా update అవ్వలేకపోయాడు. రహమాన్ సాధించిన world music quality తేలేక పోయాడు. 1995-2000 తరువాత ఇళయరాజా stopped growing as composer. అయితేనేమి the body of great music created by him is phenomenal.


..never mind. నేను ఇళయరాజా కు జీవితకాలపు loyalist గానే ఉంటాను.


objective assessment చేయటమే నా ఉద్దేశ్యం. open mind తో ఆలోచించటమంటే కళ్ళజోడు తుడుచుకుని చూడటమే. నిజం. ఇప్పుడు అలా అనిపిస్తోంది.

ఆంగ్ల పదాలు ఎక్కువైపోయాయి. తప్పలేదు.



2 comments:

  1. రెహమాన్ పై నాక్కూడా prejudice. ఇళయరాజా సంగీతంతో ఇతడి సంగీతాన్ని పోల్చి రుచించక ఏర్పడ్డ అభిప్రాయమది. రుచించకపోడానికి objective గా లేకపోవడం కొంత కారణం కావొచ్చు.

    ఇళయరాజా స్వర మాధుర్యంలో మునకలేసి.. వాటినే తలపోసుకుంటుంటే కలిగే సంతృప్తిని రెహమాన్ పాటలెన్ని వచ్చినా తగ్గించలేకపోయాయి.

    ఇక్కడ మీరిచ్చిన రెహమాన్ పాట శ్రావ్యంగా ఉంది. ఆ ఇంటర్లూడ్ కూడా! ఇళయరాజా- రెహమాన్ లపై నా అభిప్రాయం స్థిరంగానే ఉందింకా! :)

    ReplyDelete
  2. వేణు గారు. నెనర్లు. ఇళయరాజా స్వర మాధుర్యంలో మునకలేసి.. వాటినే తలపోసుకుంటుంటే కలిగే సంతృప్తిని రెహమాన్ పాటలెన్ని వచ్చినా తగ్గించలేకపోయాయి. absolutely.

    ReplyDelete