Friday, October 21, 2011

సన్నజాజుల భాషేంటొ రౌడీకి కూడా తెలుస్తుంది

మంచి రహదారిమీద ప్రశాంత వాతావరణంలో ఒక మృదు ప్రేమగీతం వింటూ కారులో ప్రయాణిస్తూ ఉంటే ఎలాగ ఉంటుంది. ( మధ్యలో రాస్తా రోకోలు,వంటా వార్పూ లేకుండా ఉంటే)

ఒక్కోసారి పిచ్చి పిచ్చి సినిమాలలో కూడా మంచిపాటలు ఉంటాయి.

సందీప్ చౌతా.techno music ఇవ్వటంలో ఇతను సిద్ధ హస్తుడు. మాటలు అర్థం కాకుండా జాగ్రత్త పడుతూ digital సంగీతంతో చంపేస్తుంటాడు. pop, hip hop శైలికి సరిపోతాడు. ఇతను పొలిటికల్ రౌడీ అనే మోహన్ బాబు చిత్రంలో ఒక చక్కటి యుగళగీతం సమకూర్చాడు.lovely song.

కళ్ళు తెరిచి చూశా నీవు నాముందే. కళ్ళు మూసుకున్నా నీవు నాలోనే. the song sank along with the film. నాకు బాగా నచ్చింది. పాట బాణి, పాడిన తీరు (సోను, నికిత నిగమ్) సాహిత్యం (సుద్దాల) చక్కగా కుదిరాయి. పాటలో కొన్ని మెచ్చు తునకలు.

సన్నజాజుల భాషేంటొ

చేతిగీతలా చేరావే జాతకాలనే మార్చావే.

నేను రాముణ్ణి అవునో కానో మరి. నీవు నాసీతవైతే చాలే చెలి. (సగటు మగవాడి కోరిక ఇదేనేమో.)
(ఈ చిత్రంలో మోహన్ బాబు ధరించిన పాత్రకు ఈ వాక్యం చక్కగా కుదిరింది).

they aint singing songs anymore. crooning is passing off as singing. అయితే సోను నిగమ్, శంకర్ మహదేవన్ are exceptions. గాయని లు మట్టుకు పదాలు గొణిగినట్టుగా పాడేస్తున్నారు. మీరు పాడింది వినేవాళ్ళకు అర్థం కాకపోతే ఏమిటి ఉపయోగం. ఏంచేస్తాం. అదంతే.

దేవిశ్రీ ప్రసాద్, తమన్ వీరిరువురి పాటలు కేవలం beat కోసం వినాలి. their repertoire is very limited. 2 to 3 tunes. వాటినే మార్చి మార్చి ఇస్తుంటారు. మాటలు అర్థమయ్యే ప్రసక్తే లేదు. పాటలు చూసి ఆనందిద్దామంటే ఎడిటింగ్ ముక్కలు ముక్కలు చేసి ముందుకు వెనక్కు లాగి కళ్ళు బైర్లు కమ్ముతాయి. పాపం కష్టపడి చేసిన dance లు కంటిలో registier అయ్యేలోపు పదిముక్కలు చేసి చూపిస్తున్నారు. మొత్తానికి కొత్తపాటలు వినలేని చూడలేని పరిస్థితి ఉంది. ఎందుకు ఏమిటి ఎలా అని అడగటం కంటే అదంతే అనుకోవటం ఉత్తమం.

0 comments:

Post a Comment