Friday, July 31, 2020

మనిషి జంతు ప్రవృత్తి నుంచి ఎంతమేరకు ఎదిగాడు

ఆహారం, నిద్ర, భయం, మైథునం -  ఈ విషయాలలో జంతువుల కంటే భిన్నంగా , చెప్పాలంటే విపరీతంగా ప్రవర్తిస్తున్నాడు. 


జంతువు - ఆకలి వేస్తే ఆహారం తీసుకుంటుంది. 

మనిషి - ఆకలి లేకున్నా తింటున్నాడు. రోగాలు కొని తెచ్చుకుంటున్నా డు.

జంతువు - తనకు ప్రకృతి నిర్దేశించిన ఆహారం తీసుకుంటుంది. 

ఆధునిక మనిషి - ప్రకృతి విరుద్ధమైన ఆహారం , మాంసాహారం తీసుకుంటున్నాడు.  ధూమపానం, మద్యం, మాదక ద్రవ్యం తీసుకుంటాడు.

జంతువు - సమయపాలన తో నిద్ర విశ్రాంతి తీసుకుంటుంది.

ఆధునిక మనిషి- ఆహారం,  నిద్రకు నిర్ణీత వేళలు లేవు.

జంతువు - పునరుత్పత్తి కొరకు కలుస్తాయి. 

అదుపు లేని మనిషి - విచ్చలవిడి తనం. శారీరక మానసిక విశృంఖలత్వం.

జంతువు - స్వజాతి జీవులను పీడించదు.

మనిషి - సాటి మనిషి ని ఇతర జీవులను కూడా శారీరిక మానసిక హింస పెడతాడు.

జంతువు ఇతర జీవ రాశులు - ప్రకృతి తో మమేకమై బ్రతుకుతాయి.

మనిషి - ప్రకృతి విధ్వంసం చేస్తాడు.

ఇది ఒక పార్శ్వం అయితే. మనిషి కి ఉన్న తెలివి తో ఒక మాయా ప్రపంచాన్ని సృష్టించు కున్నాడు. అందులో మంచి ఉంది. చెడు ఉంది.

విడి పోవడానికి, విభేదించడానికి వేయి మార్గాలు కనుక్కున్నాడు. కలిసి ఉండటానికి కొన్ని కారణాలు కూడా ఒప్పుకోడు.

మతం పేరిట కోట్ల మూగ ప్రాణులను రక్తమోడెలా చంపి రక్తపుటేరులు పారిస్తున్నాడు. 

మా మతం ఒక్కటే సత్యం. అది అనుసరించని వారు heathens లేక కాఫిర్లు అన్న ముద్ర వేసి వారిని హింసించడం జరుగుతుంది. 

ప్రపంచ ఆధిపత్యానికై ఇస్లామిక, క్రైస్తవ, మార్కిస్తు నిరంకుశ వామపక్ష వాదులు అనే మూడు శక్తులు తీవ్ర ప్రయత్నం జరుగుతోంది.

హిందువులలో వివిధ కులాల మధ్య భేద భావం అనైక్యత పెంచే కార్యక్రమం జరుగుతుంది.

ప్రతి రోజు విపరీతంగా జంతు హింస జీవ హింస జరుగుతుంది. ఇంత క్రూరంగా ఎలా ప్రవర్తిస్తున్నాడు అనేది అర్థం కాదు. అదే మనిషి చాలా సందర్భాలలో మంచితనం, మానవత్వం కూడా చూపుతాడు. 

లౌకిక శాస్త్ర ప్రగతి సాధించాడు. నైతిక ఉన్నతి తగినంత సాధించలేదు అనిపిస్తుంది.

మనిషికి జంతువు కంటే అదనం గా ఇవ్వబడిన తెలివి మేధ వల్ల మంచి జరిగిందా లేక కీడు జరిగిందా. 

Human race is still evolving. సనాతన ధర్మం చూపిన మార్గం లో పయనించిన నాడు తప్పక మనిషి జంతు ప్రవృత్తి ని మించి ఎదుగుతాడు.




ఏమి టప్పా ప్రవచనం కబుర్లు సమాప్తం🐘🐢


2 comments:

  1. కొంత మంది మనుషులు మనుషులుగా ఉండటం లేదు. రాక్షసులుగా మారిపోతున్నారు.

    ReplyDelete
  2. Who said having nonveg is against nature's law?

    ReplyDelete