Monday, September 25, 2023

బేబీ , మాష్టారు చిత్రాలలో - రెండు ప్రేమ గీతాలు

ఇటీవల వచ్చిన చిత్రాల్లో రెండు పాటలు బాగా ఆకట్టుకున్నాయి. మెలోడీ ఉన్న పాటలు ఎక్కడినుంచో పలకరిస్తూనే ఉంటాయి. 


బేబీ అనే సినిమా ఈ మధ్య పెద్ద హిట్ అయ్యింది. అందులో ఓ రెండు ప్రేమ మేఘాలిలా అనే పాట బాగుంది. ( శ్రీరామ చంద్ర గానం - విజయ్ బుల్గానిన్ సంగీతం - అనంత్ శ్రీరామ్ సాహిత్యం)


A pleasant soothing melody. Really appreciate the singer Srirama Chandra and composer vijai. Flawless signing with crystal clear voice and pronunciation. I really liked his singing in the higher octave.


Kids chorus adds pleasantness to the song in another version.


This song may be a defining moment for his singing career.


Vaathi అనే తమిళ్ సినిమా తెలుగులో మాష్టారు అన్న పేరు తో వచ్చింది.


ధనుష్ , సంయుక్త మీనన్ నటీ నటులు.


ఇందులో ఒక పాట చాలా బాగా వచ్చింది. The song was presented in the pre release function beautifully in the own voice of actor Dhanush and singer Shweta Mohan. Music by GV Prakash Kumar. 


Shweta Mohan is a good singer and sang so well. Dhanush also sang really well.


This song sounded better in the live performance as it was rendered in a slower pace.


మంచి పాటలు అప్పుడప్పుడు ఇలా పలకరించి పోవడం బాగుంటుంది.


Quality of orchestra, mixing and recording is very good in both the songs. For such melody songs voice has to be enhanced.  Percussion and music should be minimum,supportive and non invasive. The music directors got it right for both the songs.


దర్శకుడికి మంచి అభిరుచి ఉంటే సినిమాలో కనీసం ఒక చక్కని పాట ఉండే అవకాశం ఉంటుంది.


Lyrics work like mere fillers in such melody songs. The power of the tune and music take centre stage and the words seem to flow automatically. Sailing with the music, we don't really try to understand the lyrics.


Lovers want to travel together for rest of their lives. And beautiful duets strike a chord with lovers and music lovers.





Wednesday, September 20, 2023

యమునా కళ్యాణిలో - హంసవాహనముపై



తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నప్పుడు నేపథ్యంలో మధురమైన భక్తి గీతాలు ఆయా వాహన సేవలకు అనుగుణంగా  వినిపిస్తాయి.

అందులో హంస వాహన సేవపై వచ్చిన ఈ గీతం బాగుంది.


చక్కటి సాహిత్యం సంగీతం. గాయని సంగీత పరంగా చక్కగా పాడింది. Talented singer. Still there is a tinge of harshness in the voice. అలాగే సాహిత్యం ఉచ్చారణ లో మరింత స్పష్టత ఉండాలి అనిపించింది. నాలుగైదు సార్లు శ్రద్ధగా  విన్న తరువాత పాట లిరిక్స్ వ్రాయ గలిగాను.


ఈ బ్రహ్మోత్సవ వాహన సేవ గీతాల album ఎవరు చేశారో తెలియదు కానీ మంచి సాహిత్యం, సంగీతం కుదిరాయి.


-----------

హంస వాహనముపై హరి మీరు చూడరో 

వీణాపాణియై వేయి రాగాలతో


అందరి గుండెలోన అమృతము కురియగా

అతివ సింగారములు అలవోకగ  నొలికించుచు 


భవ్య వేదధామ భవభంజన రామ

గగన మేఘశ్యామ జగన్మోహన సోమ

రవి సోముల జడదాల్చి

రసగానము ఎద దాల్చి


అతివ సింగారములు అలవోకగ  నొలికించుచు - హంస వాహనము పై..


నిగమాగమ సీమ సుగుణ సార్వభౌమ

హంసయాన కామ అసురాధిప భీమ

పాలు నీరు వేర్పరుచు పావన యోగీంద్రుడు

సారపు విజ్ఞానమిడే శారదమూర్తియై


హంస వాహనముపై...


-------------


పాట యమన్ కళ్యాణ్ రాగం ఆధారం గా స్వరపరిచారు. Half the job is done once Kalyani or Yaman Kalyan ragam is chosen to compose a song.


అలవోకగ నొలికించుచు అన్న పదం దగ్గర stamp of యమునా కళ్యాణిని గుర్తించ వచ్చు.


కళ్యాణి రాగానికి ఉన్న శక్తి అది. సరైన రీతిలో సాహిత్యం, సంగీతం, గానం కుదిరితే కళ్యాణి రాగ దేవత ఎదురుగా వచ్చిన భావన కలుగుతుంది.


యమన్ కళ్యాణి రాగంలో ఉన్న అమృత తుల్య గీతాలు కృష్ణా నీ బేగనే బారో, భావయామి గోపాల బాలం, నగవులు నిజమని, హరిదాసులు వెడలే ... గీతాలు. కళ్యాణి రాగం తరగని బంగారు గని వంటిది. అక్షయపాత్ర వంటిది. ఎంత తీసుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది.


తంబురా perfect గా శృతి చేసి మీటితే సప్త స్వరాలు పలుకుతాయి వినిపిస్తాయి అని చెబుతారు. ఆ తంబుర నాదంలోనుంచి వ్యక్తమైన సప్త స్వరాలు రాగాలుగా, గీతాలుగా, వివిధ గాత్రముల, వాయిద్యాల రూపంలో విస్తరిస్తాయి. పరబ్రహ్మ నుంచి చరాచర సృష్టి వ్యక్తమైన తీరుగా.


నాదం శివస్వరూపం, సంగీతం శక్తి స్వరూపం.


వందే పార్వతీ పరమేశ్వరౌ 🙏🙏



 





Tuesday, September 5, 2023

తత్వ బోధ, ఆత్మ బోధ - A few student notes.


అద్వైత వేదాంత అధ్యయనం శ్రవణ, మనన, నిదిధ్యాసన ల సహాయం తో సాగుతుంది. 

It is a long drawn process. Till we internalise the philosophy and live in harmony and beyond. For ordinary people like us who have some interest in vedanta  philosophy, continuous study is required throughout the life.

Perseverance is needed to make progress. 

Shravana -hearing the truth

Manana - contemplating the truth.

Nididhyasana - Internalising, living and breathing the truth. 

Nidi dhyasana is the  comprehension or understanding and realisation of the ultimate Reality after analysis of the meaning of  Vedantic passages.

అద్వైత వేదాంత అధ్యయన అభిలాషులకు ఉపకరించే రెండు ప్రకరణ గ్రంథాలు -

ఆదిశంకరుల తత్వ బోధ, ఆత్మ బోధ

అద్వైత వేదాంత పారిభాషిక పదాల పరిచయానికి, అద్వైత సిద్ధాంత ప్రాథమిక అవగాహనకు ఉపకరించే రచనలు. Both are pure Advaita texts.

అంతర్జాలం లో పై రెండు రచనలపై పుస్తకాలు, ప్రవచనాలు అందుబాటు లో ఉన్నాయి. 

తత్వ బోధ - చిన్మయా మిషన్ వారి ఆంగ్ల PDF పుస్తకం (రచన - స్వరూప చైతన్య ) . - This book contains good introduction and lucid explanation.

https://namarupa.org/wp-content/uploads/2020/07/Tattva-Bodha-1997.pdf

తత్వ బోధ, ఆత్మ బోధ, వివేక చూడామణి.. ఇత్యాది రచనలు అవగాహన చేసుకుంటే - తదుపరి దశ ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మ సూత్రాలు .. అధ్యయనం సుగమం అవుతుంది.

ముందు కొంచెం dry subject లాగా అనిపిస్తుంది. అయితే కొంచెం కృషి చేస్తే ఆసక్తి పెరుగుతూ వస్తుంది.

అద్వైత వేదాంత అధ్యయనంతో పాటు నిత్యానుష్ఠానం, పూజ, జపం, ధ్యానం, కర్మ ,యోగం  కూడా అవశ్యం చేయవలసి ఉంటుంది. జ్ఞాన, భక్తి, కర్మ, ధ్యాన యోగాలు విడి విడిగా ఆచరణ సాధ్యం కాదు. అన్నిటికీ ప్రత్యేక స్థానం, అవసరం ఉంది అని చెబుతారు.

ఆధ్యాత్మిక సాధన ఎంతో కొంత చేసినా ఉపయోగం ఉంటుంది. 

స్వల్పమపి అస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్‌

తత్వ బోధ ఎరుకపరిచే విషయాలు.

సాధనా చతుష్టయం - , నిత్యానిత్య వస్తు  వివేకము, ఇహాముత్ర ఫలభోగ విరాగము, శమాది షట్క సంపత్తి, ముముక్షత్వం

శమాది షట్క సంపత్తి - శమ, దమ, ఉపరతి, తితిక్ష, సమాధాన, శ్రద్ధ

పంచ కోశాలు - అన్నమయ, ప్రాణమయ, మనోమయ, బుద్ధిమయ, ఆనందమయ కోశాలు.

శరీర త్రయం - స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు 

అవస్థా త్రయం - జాగ్రత్, స్వప్న, సుషుప్తి అవస్థలు

జ్ఞానేంద్రియాలు - స్పర్శ,శబ్ద,రూప,రస, గన్ధాలు 

కర్మేంద్రియాలు - వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థలు 

సచ్చిదానంద స్వరూపం

ఆత్మ, మాయ

పంచ భూతాలు - పృథ్వి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము

త్రివిధ ప్రకృతి గుణాలు - సత్వ రజస్తమో గుణాలు.

సృష్టి, పంచీకరణ

జీవుడు, జగత్తు,ఈశ్వరుడు

త్రివిధ కర్మలు - 

బంధం, మోక్షం

-----------------------

ఆత్మ బోధ విశదపరిచే విషయాలు :

ఆత్మ బోధ లో 68 శ్లోకాలు ఉన్నాయి.  A small treatise, profound in import.

కొన్ని శ్లోకాలలో అందమైన అర్థవంతమైన metaphors కనిపిస్తాయి.

The metaphors used seem to be so apt for understanding the concepts proposed.

ఆత్మ బోధ లో కనిపించే కొన్ని ఉపమానాలు .

मेघापायेंऽशुमानिव - అజ్ఞానం దూరమైనప్పుడు ఆత్మ, మేఘాలు తొలగగా సూర్యుడి వలె ప్రకాశిస్తుంది.

दृश्यतेऽभ्रेषु धावत्सु धावन्निव यथा शशी -

కదిలిపోతున్న మేఘాల నడుమ ఉన్న జాబిల్లి తానే పరుగులు తీస్తున్నట్లు అనిపిస్తుంది. అలాగే జ్ఞానేంద్రియాల వ్యవహారం ఆత్మ చేసినట్లు భ్రమ కలుగుతుంది.

शुद्धात्मा नीलवस्त्रादियोगेन स्फटिको यथा -  నీల వర్ణపు వస్త్రముపై ఉంచిన శుద్ధ స్ఫటికం నీలపు రంగు సంతరించుకున్నట్లు శుద్ధ ఆత్మ పైన పంచ కోశాల గుణాలను ఆపాదించడం జరుగుతుంది.

गगने नीलतादिवत् - దేహేంద్రియాలు చేసే కర్మలు ఆత్మకు ఆపాదించడం ఆకాశం  రంగు నీలం అనుకోవడం వంటిది.

कल्प्यन्तेऽम्बुगते चन्द्रे चलनादि यथाम्भसः

- కొలనులోని నీటి కదలికలు చూసి చంద్ర బింబం  చలిస్తున్న భ్రాంతి కలిగినట్లు మనో వ్యాపారాలను నిశ్చల ఆత్మపై ఆరోపించడం జరుగుతుంది.

स्वकण्ठाभरणं यथा भाति - కంఠం పై ధరించిన ఆభరణం లాగా ఆత్మ సిద్ధ వస్తువు. అజ్ఞానం తొలగిన వెంటనే ఆత్మ స్వరూపం వ్యక్తమౌతుంది.

तस्मात्सर्वगतं ब्रह्म क्षीरे सर्पिरिवाखिले - 

పాలల్లో అంతర్గతం గా వెన్న దాగి ఉన్నట్లు ఆత్మ అంతటా వ్యాపించి ఉంటుంది.

ब्रह्म प्रकाशते वह्निप्रतप्तायसपिण्डवत् -

అగ్నితప్తమైన ఇనుప ముద్ద వలె సకల జగత్తును బ్రహ్మ వ్యాపించి ప్రకాశింప జేస్తుంది.

अज्ञानचक्षुर्नेक्षेत भास्वन्तं भानुमन्धवत् -

సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపం జ్ఞాన చక్షువుకు మాత్రమే గోచరిస్తుంది. ఉజ్జ్వలంగా భాసిస్తున్న సూర్యబింబమయినా అంధత్వం ఉన్న కన్నులకు కనిపించదు 

(Based on the writings and speeches on the above topics available in internet.)

ఆత్మ బోధ శ్లోకములు ఆంగ్ల తాత్పర్యం

🙏🙏🙏