Wednesday, November 9, 2022

వెండికొండ పై విధుబింబం - ధర్మావతి

కర్ణాటక సంగీతం లోని రాగాలపై , మెలోడీ పాటలపై ఉన్న అభిమానం తో 2007 లో బ్లాగులలో ప్రవేశించినప్పటి నుంచి అడపా దడపా సంగీత రాగాలను ప్రస్తావిస్తూ కొన్ని పోస్టులు వ్రాస్తూ వచ్చాను. కర్ణాటక సంగీతం తో కొద్దిపాటి పరిచయం , శ్రవణ, సంచిత జ్ఞానమే తప్ప విశేష పరిజ్ఞానం ఏమీ లేదు. తేనెటీగ మకరందాన్ని పువ్వుల నుంచి సేకరించినట్లు public domain లోని వివిధ మూలాలనుంచి సమాచారం సేకరించి పోస్ట్ లు వ్రాయడం జరుగుతుంది. 

నాకు తెలిసి 2006-7 లలో వ్రాసే బ్లాగర్లు ఇప్పుడు అంతగా వ్రాయడం లేదు. Maybe they moved on to greener pastures. Or simply got bored. 

ఒక మంచి పాటను వెంటనే గుర్తించగలిగే దృష్టి కొంతవరకు ఉంది. 

ప్రతి భారతీయుడికి మాతృ భాషతో పాటు, సంస్కృత సాహిత్యం, శాస్త్రీయ సంగీతం, రామాయణ భాగవతాలు, ఉపనిషత్తులు, భగవద్గీత తో కొద్దిపాటి పరిచయమైనా ఉండాలి అనిపిస్తుంది.  To enrich our lives. 

పుష్కరకాలం క్రిందట ధర్మావతి రాగం లోని పాటలపై ఒక పోస్టు వ్రాశాను. 

మరొకసారి పుష్కర స్నానం చేస్తే పుణ్యం వస్తుంది.

మేళకర్త రాగాలు 72. అవి సంపూర్ణ రాగాలు. అందులో 36 రాగాలు  శుద్ధ మధ్యమం కలిగి ఉంటాయి. ( శంకరాభరణం, చారుకేశి, గౌరి మనోహరి, హరికాంభోజి, కీరవాణి ఇత్యాది రాగాలు)

36 ప్రతిమధ్యమం తో కూడినవి. ( కల్యాణి, చక్రవాకం, ధర్మావతి,వాచస్పతి, సింహేంద్ర మధ్యమం ఇత్యాది రాగాలు).

వెంకట మఖి అనే ఒక సంగీత శాస్త్రవేత్త, పండితుడు (1600-1650 కాలం) కర్ణాటక సంగీతం లోని రాగాలను శాస్త్రీయంగా విభజించి 72 మేళకర్త రాగాలను స్థిరపరచాడు. ఆ పద్ధతి ఇప్పటికీ కొనసాగుతున్నది. 

ఆ రాగాలకు సంఖ్యక్రమం కటపయాది పద్ధతిలో ఏర్పాటు చేశాడు. కటపయాది పద్ధతి గురించిన వివరణ ఈ వీడియోలో చక్కగా ఉన్నది.

జాజి, సంపెంగ, విరజాజి, పారిజాతం, గులాబి, చేమంతి.. వివిధ రకాల పూలు ప్రత్యేకమైన స్వాభావిక సుగంధం కలిగి ఉన్నట్లు, వివిధ రాగాలు వాటి. ప్రత్యేక స్వభావం, స్వరూపం, అస్తిత్వం కలిగి ఉన్నాయి. 

రాగాలు అన్నీ గొప్పవే. అయితే ఆ రాగాలు ఉపయోగించి మధుర గీతాలను సృజించిన వారు స్వరకర్తలు , వాగ్గేయకారులు. 

We are fortunate that we have huge body of outstanding and everlasting compositions created by vaggeyakaras.

Dharmavaati is the prati madhyama equivalent of Gouri Manohari ragam.

ధర్మావతి రాగం లో చక్కగా స్వరపరచిన మరి కొన్ని గీతాలు...

1) చంద్రప్రభ వాహనమున చక్కనయ్య కనరో 

ఈ గీతం శ్రీనివాసుని బ్రహ్మోత్సవాల కోసం ప్రత్యేకంగా వ్రాసి స్వరపరచ బడిన గీతం అనుకుంటాను. ఈ పాట చాలా బాగుంది. పాడిన వారు టిప్పు ,హరిణి. రచయిత, సంగీత దర్శకుడు ఎవరో తెలియలేదు.  This is a beautiful composition with very good lyrics. 

చరణం లో సాహిత్యం ఎంతో బాగుంది.

------------

చింతామణి మించిన సౌదామిని కాంతుల వెలిగేటి దేవుడు వేదవేద్యుడు 

వదనము విధుబింబమై మధురోహల మూలమై మదిమదిలో కొలువుతీరి మన మొక్కులు తీర్చుచు

చంద్రప్రభ వాహనమున చక్కనయ్య కనరో ఉపేంద్రుడై ఊరేగే ప్రియమాధవుడిదిగో 

------------

2) కోపం వస్తే మండుటెండ మనసు మాత్రం వెండికొండ  వాన మబ్బు లాంటి వాటం నీదయా ( తారక రాముడు - 1997- కోటి - సీతారామ శాస్త్రి - బాలు - చిత్ర )

చక్కని పాట. పాట పల్లవి  ఆకట్టుకుంటుంది. కోటి సంగీతం చాలా బాగుంది. సౌందర్య, శ్రీకాంత్ జోడీ బాగుంది. 

ఈ రాగం లో నా all time favourite పాట

మన్మథ లీల చిత్రం లోని హలో మై డియర్ రాంగ్ నంబర్ - ( 1976 - బాలు, ఎల్ ఆర్ ఈశ్వరి, ఎం.ఎస్. విశ్వనాథన్, ఆత్రేయ).బాలు, ఎల్. ఆర్. ఈశ్వరి గారు అద్భుతం గా పాడారు. Beautiful tune. 

అందెలరవమిది పదములదా (స్వర్ణ కమలం) ధర్మావతి రాగంలో ప్రాచుర్యం పొందిన పాట.

శ్రీ పూర్ణిమ కృష్ణ ఈమని - వేణుగానం - భజన సేయ రాదా ( మైసూరు వాసుదేవాచార్య కృతి ) . చెవులకి ఇంపుగా ఉంది.

ఆనంద భైరవి చిత్రం లో చైత్రము కుసుమాంజలి అనే అద్భుతమైన పాట ఉంది. ఈ పాటలో రమేశ్ నాయుడు గారు అమృత వర్షిణి, ధర్మావతి / రంజని రాగాలను చక్కగా ఉపయోగించాడు. వేటూరి సాహిత్యం, బాలు గానం అత్యుత్తమం గా ఉన్నాయి.

చైత్రము కుసుమాంజలి 

పంచమ స్వరమున ప్రౌఢ కోకిలలు

పలికే మరందాల అమృత వర్షిణీ.


వేసవిలో అగ్నిపత్రాలు రాసే

విరహిణి నిట్టూర్పులా కొంత సాగి

జలద నినాదాల పలుకు మృదంగాల

వార్షుక జలగంగలా తేలిఆడే 

నర్తనకీ, కీర్తనకీ, నాట్య కళాభారతికీ 

చైత్రము కుసుమాంజలి 


శయ్యలలో కొత్త వయ్యారమొలికే

శరదృతుకావేరి లా తీగ సాగి

హిమజల పాతాల, సుమశర బాణాల

మరునికి మర్యాదలే చేసి చేసి చలి ఋతువే, 

సరిగమలౌ నాద సుధా మధువనికీ

చైత్రము కుసుమాంజలి 

ఎంత గొప్ప సాహిత్యం. వేటూరి గారు🙏












Saturday, November 5, 2022

సింధుభైరవి - నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి

కాలం తెలిసి ఆగిపోవడం తెలియకుండా  పరుగులు తీయడం ఒకేసారి జరిగితే ?

మనసు బరువెక్కడం తేలికపడటం రెండూ ఏకకాలం లో జరిగితే ?

హృదయం మంచు ముద్దలా ఘనీభవించి అంతలోనే కరిగిపోతే ?

సింధు భైరవి రాగానికి ఈ శక్తి ఉంది. There is some mystic ethereal transcendental quality to this ragam. 

ఆకాశం లాగా ఉందో లేదో తెలియనట్టు ఉంటుంది. ఘటం లో ఆకాశం , ఆకాశం లో ఘటం ఏకకాలం లో ఉన్నట్లు.

ప్రముఖ హిందూస్తానీ సంగీత విదుషీమణి శ్రీమతి అశ్విని భిడే గారి గానం ఇందుకు ఒక నిదర్శనం. మహా గాయకురాలు కీ. శే. కిశోరి అమోంకర్ , అశ్విని భిడే గార్ల గానం అనుభవైక వేద్యం.

హిందుస్తానీ సంగీతం లో ఈ రాగం భైరవిగా చెబుతారు. హిందూస్తానీ సంగీతం కచేరీ లలో భైరవి రాగం కచేరీ ముగింపులో పాడటం సంప్రదాయం గా ఉంది.

This raaga lends itself to many variations and embellishments. 

ముద్దబంతి పూవులో మూగకళ్ళ ఊసులో ఎనక జనమ బాసలు ఎందరికి తెలుసులే. 

పాటలో ఉన్న immortal words ' నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి'. సింధు భైరవి రాగానికి కూడా అన్వయిస్తాయి అనిపిస్తుంది.

అలాగే కనులు తెరచినా నీవాయే నే కనులు మూసినా నీవాయే (పింగళి) - ఈ మాటలు కూడా సింధు భైరవికి సరిపోతాయి 

అలతి పదాలలో అనల్పమైన అర్థాలను చెప్పడం ఆత్రేయ లాగా ఎవరూ చేయలేరేమో.

'ఈ జీవన తరంగాలలో ' పాట  ఆత్రేయ  వ్రాసిన విధానం అనితర సాధ్యం.  brevity of words + gravity of meaning. (ఈ పాట సింధు భైరవి లో లేదు ) ఈ పాట లోని భావాలు మనసుపై చెరగని ముద్ర వేస్తాయి. 

He has this uncanny ability to convey profound meaning in  simple words. ఆత్రేయ గారు. 

సింధు భైరవి రాగం ఆధారం గా చేసుకొని స్వరపరచిన రెండు మంచి  పాటలు

1) వలయోసై (ఇళయరాజా - ఎస్పీ బాలు - లతా మంగేష్కర్). This is a song forever. All-time classic. Legends come together to deliver a masterpiece.

2) మిలే సుర్ మేరా తుమ్హారా - (iconic song on Doordarshan which presented a kaleidoscopic vision of the Indian languages music and cultures through renowned artistes).

ఎన్నో మంచి గీతాలు సింధు భైరవి రాగం లో ఉన్నాయి. అయితే ప్రధాన వాగ్గేయకారుల కృతులు  ఈ రాగం లో  లేవు.

ఈ రాగం pathos కు బాగా సూటవుతుంది. అయితే ఒక కామెడీ పాటకు కూడా ఈ రాగం ఉపయోగించడం  జీవిత చక్రం చిత్రం లో వినవచ్చు. This is one of my all-time favourite songs.

సువ్వీ సువ్వీ చూడే ఓలమ్మీ (జీవిత చక్రం - శంకర్ జై కిషన్ - సుశీలమ్మ -బాలు ).

ఈ కట్టెను కట్టెలు కాల్చక మానవు

ఆ కన్నీళ్లకు చితి మంటలారవు.

- unbelievable and unforgettable lyrics by athreya. They haunt us and gnaw at the heart. 









Sunday, October 30, 2022

సంగీత దర్శకుడు చక్రవర్తి - nostalgia నుంచి massteria దాకా



సంగీత దర్శకుడు చక్రవర్తి. - Yes. He composed music for close to 1000 movies. Astonishing feat indeed.

His tunes had an instant appeal for common man. He was well aware of his limitations and played to his strengths. 

ఆయన స్వరపరచిన పాటలు 

తొలి నాళ్లలో - Class గా మొదలై

మలి దశలో -  Mass గా మారాయి.

He was very popular and prolific in the 80s. ఆ కాలంలో అతను కొన్ని వందల చిత్రాలకు సంగీతం ఇచ్చాడు. చక్రవర్తి, వేటూరి కలిసి కొన్ని వందల పాటల తో తెలుగు అభిమానులను ఒక ఊపు ఊపారు.

చక్రవర్తి ఇచ్చే మాస్ బాణీ లకు, వేటూరి మసాలా లిరిక్స్ జత కలిస్తే, ఆ పాటలకు  హీరో హీరోయిన్లు స్టెప్పులు వేస్తే  అభిమానులు ఊగిపోయేవారు. డ్రైవర్ రాముడు, యమగోల లాంటి కొన్ని సినిమాలలో  కొన్ని పాటల పల్లవులు విని వేటూరిని నిలదీసిఫై చేయాలి అనిపిస్తుంది. అయితే అనేక గొప్ప గీతాలు కూడా వ్రాశాడు కనుక అదంతే అనుకోవాలి. 

Quite early in career as composer శారద చిత్రం లో మంచి సంగీతం ఇచ్చాడు. వ్రేపల్లె వేచెను, శారదా నను చేరగా పాటలు evergreen hits. బాబు చిత్రం లో పాటలు కూడా బాగుంటాయి. 

మల్లెపూవు (1978) చిత్రం లో చక్కని సంగీతం అందించాడు. ముఖ్యంగా చిన్నమాట ఒక చిన్నమాట పాట అద్భుతం. (వేటూరి, సుశీలమ్మ) . 

మల్లెపూవు చిత్రం లో ఓహో లలితా నా ప్రేమ కవితా అన్న పాట విలక్షణంగా ఉంటుంది. వేటూరి విశ్వరూపం చూపాడు. ముఖ్యంగా చరణాలలో పాట బాణీ నడక చాలా బాగుంటుంది. ధర్మావతి రాగాన్ని స్పృశిస్తూ సాగుతుంది. All-time classic song.

చక్రవర్తిని mass movies hijack చేశాక మెలోడీ పాటలకు కేవి మహదేవన్, సత్యం, రమేశ్ నాయుడు, రాజన్ నాగేంద్ర, ఇళయరాజా ఉండేవారు. అలాగే కే. విశ్వనాథ్ గారి చిత్రాలలోని సంగీతం వీనుల విందుగా ఉండేది. 

1981 లో ప్రేమాభిషేకం చిత్రం లో చక్రవర్తి జనరంజకమైన చక్కని పాటలు ఇచ్చాడు. ఈ చిత్రం లో అన్ని పాటలు super duper hits. క్రమేపీ ఆయన సంగీతం commercial, mass, crude గా మారిపోయింది. 

నిర్మాతలు, ప్రేక్షకులు, దర్శకులు, రచయితలు, నటులు, అప్పట్లో వచ్చిన కమర్షియల్ చిత్రాలు - ఇవన్నీ కూడా కారణం కావచ్చు.

అయితేనేమి. ఆయన 70లలో కొన్ని గొప్ప పాటలు స్వరపరిచారు. వాటిలో నాకు బాగా ఇష్టమైన కొన్ని పాటలు.

1) కుశలమా నీకు కుశలమేనా - 1975 (బలిపీఠం- దేవులపల్లి - బాలు -సుశీల ) -a beautiful song forever. Great orchestration, soulful lyrics and singing. A true masterpiece. Interludes are so beautiful in this song. Probably the best song of Chakravarthy garu.

2) ప్రతి అందం జంటకోసం కలవరించి పోతుంది (ఊర్వశి చిత్రం - 1974 - సినారె. - బాలు - వాణీ జయరాం).- ఈ పాటలో second interlude is so beautiful and captivating. సంజీవ్ కుమార్ గారు శారద గారు .a classy song. Lip sync is good in the song.

3) గుండెలోన ఒకమాటుంది -(1976-రాజా - సుశీలమ్మ - బాలు - ఆత్రేయ ).- beautiful song. Particularly notable is సుశీలమ్మ గారు rendition.

4) నీకు నాకు పెళ్ళంట - (జ్యోతి - 1976 - సుశీలమ్మ - బాలు - ఆత్రేయ ) -  lyrics, music, singing, picturization - 👌👌

చరణం చివర్లో వచ్చే ఆలాపన 👌👌

5) చీకటి వెలుగుల కౌగిటిలో -  ( చీకటి వెలుగులు 1975 - బాలు - సుశీలమ్మ - దేవులపల్లి కృష్ణశాస్త్రి) - తెలుగుదనానికి కేరాఫ్ అడ్రస్ లాగా అనిపించే పాట. స్వచ్ఛమైన ప్రేమను ఉదాత్తంగా చిత్రీకరించిన పాట. All time classic. దర్శకుడి అభిరుచి 👌

6) చిన్నమాట ఒక చిన్న మాట  - ( మల్లెపూవు, 1978, వేటూరి, సుశీలమ్మ) - a lovely song. సుశీలమ్మ గానం,లక్ష్మి నటన 👌👌

(7) కెరటానికి ఆరాటం తీరం చేరాలని - (జీవన తీరాలు 1977 , సినారె, బాలు, సుశీల ) - మంచి సాహిత్యం, మృదువైన సంగీతం, హాయి గా ఉన్న గానం 👌👌

ప్రాణం ఖరీదు, ( ఎలియల్లో ఎలియల్లో ఎందాకా ) పదహారేళ్ళ వయసు ( పంటచేలో పాలకంకి నవ్వింది ) చిత్రాలలోని పాటల్లో అసలు చక్రవర్తి కనిపిస్తాడు. తరువాతి కాలంలో  ఆయనకు అలాంటి natural, rustic songs compose చేసే అవకాశం రాలేదు అనిపిస్తుంది.

రాజ్ కోటి, కీరవాణి చక్రవర్తి గారి దగ్గర సహాయకులుగా ఉండి మంచి శిక్షణ పొందారు.

చంటబ్బాయ్ చిత్రం లో ఉత్తరాన లేవంది ధ్రువ నక్షత్రం పాట లో vintage చక్రవర్తి వినపడతాడు. A lovely song beautifully picturised by jandhyala. ఈ పాట చిత్రీకరణ చూసి దర్శకులు ఎంతో నేర్చుకోవచ్చు. 

అత్యధిక చిత్రాలకు సంగీతం ఇచ్చిన వారిలో ఇళయరాజా, ఎం. ఎస్. విశ్వనాథన్, చక్రవర్తి గార్ల రికార్డు పదిలంగా ఉంటుంది. 

🙏










Thursday, October 27, 2022

సింహేంద్ర మధ్యమం - కొన్ని సంగీత కబుర్లు

ప్రతిమధ్యమ మేళకర్త రాగాలలో  ఒక ప్రముఖమైన రాగం సింహేంద్ర మధ్యమం. లేదా సింహేంద్ర మధ్యం.

శుద్ధ మధ్యమం కలిగి ఉన్న కీరవాణి రాగానికి దగ్గరగా ఉంటుంది. 

ఒక పోలిక.

ప్రకృతి లో ఇప్పటి దాకా 118 మూలకాలు గుర్తించబడ్డాయి. ప్రతి మూలకానికి స్వాభావిక, ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. అయితే అన్ని మూలకాలు అతి సూక్ష్మ స్థాయి లో ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అనే పరమాణువులు కలిగి ఉంటాయి అని చదువుకున్నాము. 

అలాగే కర్ణాటక సంగీతం లో 72 మేళకర్త రాగాలు ఉండగా అన్నింటికీ సప్త స్వరాలు లేక వాటి variants తో కలిసి 12 లేదా 16 స్వరాలు building blocks గా ఉన్నాయి.

ప్రతి రాగమూ విశిష్ట లక్షణాలు, ప్రత్యేక అస్తిత్వం కలిగి ఉన్నది. 

That was a  wild comparison to visualise how different arrangement of the same building blocks results in formation of distinct entities.

శాస్త్రీయ రాగాలకు సినిమా పాటలు bench mark కాదు కానీ తేలికగా గుర్తించడానికి అనువుగా ఉంటాయి.

సింహేంద్ర మధ్యమం రాగం లో ఇళయరాజా కొన్ని మంచి పాటలు బాణీ కట్టాడు.

(1) The iconic song  ఆనందరాగం  అమిత ప్రాచుర్యం పొందింది. 

( పన్నీర్ పుష్పంగళ్ 1981 - ఉమా రమణన్). Breathtaking music which runs like a wild stream. 

(2) రాజ్ కోటి - బావ బావమరిది చిత్రం లో బాణీ కట్టిన  పాట ఉత్తరాన నీలి మబ్బుల లేఖలో కీరవాణి రాగం తో పాటు --సింహేంద్ర మధ్యమం రాగాన్ని స్పృశిస్తూ సాగుతుంది. A beautiful song. పాట పల్లవి బాగుంది. అయితే చరణాలు typical veturi పద్ధతిలో ఉన్నాయి. వేటూరికి పాలు, వెన్న, జున్ను, మీగడ ఈ పదార్థాలు అంటే మక్కువ. అందుకే ఆయన పాటల్లో వాటి ప్రయోగం ఎక్కువ.

ఈ పాట బాణీ చాలా హాయిగా మధురంగా ఉంది. పాట వింటున్నప్పుడు అందులో ఏ పదాలు వస్తున్నాయో అసలు చూపు సారించలేము. మంచి బాణీ గల పాట లోని సాహిత్యం విడిగా చదువు కోవాలి. Words get drowned in melody of the tune.

అన్ని కళల పరమార్థమొక్కటే. అందరినీ రంజింపజేయుటే అని వేటూరి ఒక పాటలో వ్రాశాడు.

(3) గోపుర వాసలిలే అనే చిత్రం లోని ఈ పాట కూడా బాగుంటుంది. (ఇళయరాజా - ఎస్. జానకి)

సంప్రదాయ సంగీతం లో త్యాగరాజ స్వామి కృతి నీదు చరణములే గతి యని నెర నమ్మిన వాడను

( బాలమురళి మృదు గాత్రంలో 1958)

తమిళ సంగీత దర్శకులు అసకృత్తుగా ఈ రాగంలో పాటలు స్వరపరిచారు. అయితే తెలుగు స్వరకర్తలు అరుదుగా ఉపయోగించారు అనిపిస్తుంది.

సంప్రదాయ రాగాలను అనువుగా ఉపయోగించి పాటలు స్వరపరిచే అలవాటు క్రమేపీ తగ్గిపోతున్నది. మేని తోనే ఆగిపోయే పాట మనసు చేరుకోలేదు. మనసును దాటి ఆత్మను అందుకునే నాదం శాస్త్రీయ సంగీతం లోనే సాధ్యం.









 

Sunday, October 23, 2022

కాంతార చిత్రం లో ప్రస్తావించిన కొన్ని ముఖ్య విషయాలు

కన్నడ చిత్రం కాంతార ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఈ చిత్రం ద్వారా రచయిత దర్శకుడు నటుడు అయిన రిషభ్ శెట్టి భారత దేశంలో Native cultures, pagan traditions ఎదుర్కొంటున్న సమస్యలను  నిజాయితీగా చూపించే ప్రయత్నం చేశాడు.

It is good movie. Honest, raw, rustic, unapologetic in its premise and presentation. 

Shetty has done a good job in weaving a commercial story that shows respect to native tradition, with forest deities at its core.

అన్యమత వలస పాలనలో దాడికి గురి అయిన హైందవ భారతీయ సంస్కృతి ,మన పండుగలు, మన ఆలయాలు, గ్రామీణ, వనవాసులు , గ్రామీణ ఉత్సవ సంప్రదాయాలు, కట్టు బాట్లు, సంప్రదాయ కళలు, సాహిత్యం ...

స్వాతంత్య్రం అనంతరం సమున్నతి, అభ్యదయం పొందలేక secularism పంజరం లో బందీగా మిగిలాయి. 

In general, మన మీడియా, సినిమా, పాఠ్య పుస్తకాలు మహోన్నతమైన మన సనాతన ధర్మం పట్ల నకారత్మక, తిరస్కార ధోరణి తో వ్యవహరిస్తున్నాయి అన్నది  కఠోర వాస్తవం.

ముఖ్యంగా ప్రకృతి శక్తులు, గ్రామ దేవతలు, వనదేవతలు, వారితో అవినాభావ సంబంధం, అనుబంధం, భక్తి కలిగి ఉన్న ప్రజలు... 

పై విషయాలపై అవగాహనాలేమి, తిరస్కార భావంతో అహంకార పూరితంగా వ్యవహరించే, అధికార వ్యవస్థలలోని కొందరు వ్యక్తులు.

దేవతల, ప్రకృతి శక్తుల అనుగ్రహం  ఆగ్రహం అర్థం చేసుకోలేని అహంకార పూరిత, స్వార్థ పరులకు ఈ చిత్రం ఒక  సమాధానం చెబుతుంది.

Government institutions, certain faiths and officials often function with holier than thou attitude . They think that it is their right to reform  native people whereas many a time it is such instituitions, officials and faiths  which need reform.

వందల ఏళ్లుగా ఎవరికీ ఏ సమస్యా లేకుండా టపాకాయలు పేల్చి చిన్నా పెద్దా ఆనందంగా హిందువులు జరుపుకునే  పండుగలపై ఆంక్షలు పెట్టడం.- The movie subtly raises such issues.

There is an important lesson in the movie.

The way the adament forest official eventually understands the significance of native traditions and respects them shows the writer- director's vision.

దేవతల ఆగ్రహం, అనుగ్రహం ఆ దేవతలతో, ప్రకృతి శక్తులతో మమేకమైన ప్రజలకు తెలుస్తుంది. మట్టితో, అడవితో,  జంతువులతో స్థానికులకు ఉన్న మమకారం, అనుబంధం,  so called refined, educated , intellectuals, officials, అర్థం చేసుకోవాలి అన్న సందేశం ఉంది.

విశ్వాసం, భక్తి ఉన్నవారికి దేవతల, ప్రకృతి శక్తుల, వన దేవతల రక్షణ, అనుగ్రహం తప్పక ఉంటుంది. 

అలాగే స్వార్థ పూరిత వ్యక్తులు, land lords, అమాయకులకు అన్యాయం చేస్తే దేవతల ఆగ్రహం ఎలా ఉంటుందో .. చిత్రం లోని చివరి 20 నిముషాలు చూస్తే తెలుస్తుంది.

Great performance by Rishabh Shetty in the climactic moments. Audience will feel the presence of the Deity in the Bhuta kola.

The music, photography and acting of lead actors is natural and in keeping with the tenor of the movie.

వరాహరూపం పాట సంగీతం, చిత్రీకరణ విస్మయం కలిగిస్తుంది. అయితే taikkudam bridge అనే musical band వారి నవరసం అనే పాటను పోలిఉంది అని తెలిసింది.  Yes. Varaharoopam is inspired from the navarasam song. They should have given credit to taikkudam bridge.

భూత కోల, పోతురాజులు, గణాచారులు, రంగం, అమ్మోరు, ఆవహించడం ..ఈ సంప్రదాయాలు మన దేశ ప్రజల విభిన్న సంస్కృతిలో అంతర్భాగం. ఈ సంప్రదాయం తరతరాలుగా ఆచరించే కుటుంబాలు, వారిని విశ్వసించే, గౌరవించే ప్రజల మనోభావాలను గౌరవిస్తూ, ఒక మంచి చిత్రాన్ని అందించిన రిషభ్ శెట్టి అభినందనీయుడు. క్షేత్రం, మూల దేవత, క్షేత్ర పాలక దేవతల ప్రాధాన్యం గురించి చెప్పడం బాగుంది.

Within the commercial format, the movie showcased the native tradition with honesty.

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే మరిన్ని చిత్రాలు ఇదే ఒరవడి లో వస్తే బాగుంటుంది.

దేవీ మాహాత్మ్యం పురాణం ఆధారంగా ఒక అద్భుత చిత్రం నిర్మాణం జరిగితే బాగుంటుంది అని నా ప్రగాఢ ఆకాంక్ష.🙏




Tuesday, October 18, 2022

ఏది తెలుపు ఏది నలుపు - కొన్ని ఆలోచనలు

ఓ మహాత్మా….ఓ మహర్షి

ఏది చీకటి ఏది వెలుగు

ఏది జీవితమేది మృత్యువు

ఏది పుణ్యం ఏది పాపం

ఏది నరకం ఏది స్వర్గం

ఏది సత్యం ఏదసత్యం

ఏదనిత్యం ఏది నిత్యం

ఏది ఏకం ఏదనేకం

ఏది కారణమేది కార్యం

ఓ మహాత్మా..ఓ మహర్షి


ఏది తెలుపు ఏది నలుపు

ఏది గానం ఏది మౌనం

ఏది నాది ఏది నీది

ఏది నీతి ఏది నేతి

నిన్న స్వప్నం నేటి సత్యం

నేటి ఖేదం రేపు రాగం

ఒకే కాంతి ఒకే శాంతి

ఓ మహర్షి….ఓ మహాత్మా……శ్రీ శ్రీ


ఈ కవిత లో లోతైన భావం ఉంది.

పెద్ద వేదాంత చర్చ  చేయగల అవకాశం

ఉన్న రచన. 


This short verse is laden with profound meaning.

Some thoughts.

It makes sense to ponder over one's stated position on any issue contentious or otherwise. It is not always easy to to step back and change one's stand though.

Sometimes we may evaluate our past action or words in hindsight which may present us with a different perspective. Maybe we were too close to see things clearly back then. 

Things under water appear clearer after the ripples settle down. 

On  different occasions, our reactions were probably not equal to the matter at hand. 

Either  we 

went overboard / or

were stupefied /

were arrogant/

were late to react /

jumped to conclusions /

looked the other way /

were too timid or selfish to react /

were not so fair but sailing with the mob /

were biased in some way /

acted in a fair and just manner /

did the right thing but were in minority /

were in the right and received support as well...

So many possibilities are there.

Many a time our conditioned minds don't allow us to view things in the right perspective.

Every person is endowed with this capacity in varying degrees to evaluate his / her past actions .

Many times our actions tend to be impulsive even when unnecessary.

పండితులు, పామరులు, మాన్యులు, సామాన్యులు.. Anyone can act in haste on a few occasions. They may or may not repent or repeat later.

On a few occasions we listen to our inner voice. 

It can be said that the frequency of one paying heed to the inner voice is proportional to one's spiritual sadhana. A person who made a fair amount of spiritual progress may not lose balance easily. He /she may quickly regain composure even in a trying situation. Also he may not harbour a lasting ill will or dislike towards anyone per se.

If we introspect our actions in the life gone by, we may recall both unpleasant and happy occasions. We may feel angry, proud, happy or guilty about our past actions.

We should never lose the ability to accept our mistakes, stick to or revise our opinions or thought processes.  Adherence to Dharma is the key. Sadhana will lead us nearer to Dharma. Our inner voice certainly guides us, if we are prepared to listen to it. 

తెలుపు నలుపు లను చూపే కాంతికి ఏ వర్ణం అంటుకోదు. 🙏





Saturday, October 1, 2022

పొన్నియిన్ సెల్వన్-1 చిత్రం - ఒక సమీక్ష



పొన్నియిన్ సెల్వన్ చిత్రం ఎలా ఉంది ? Jury is still out. 

తమిళ వార పత్రిక కల్కి 1941లో ప్రారంభం అయ్యి ఇప్పటికీ కొనసాగుతున్నది. ఈ పత్రిక సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన ' కల్కి ' కృష్ణమూర్తి 1950-54 కాలం లో ' పొన్నియిన్ సెల్వన్ ' అనే ధారావాహిక వ్రాశాడు. అది బహుళ ప్రజాదరణను నోచుకుంది. 1955 సం. లో 2210 పేజీల బృహన్నవల ఐదు సంపుటాలుగా ప్రచురించ బడింది. 

చోళ సామ్రాజ్యపు రాజుల జీవితం ఆధారంగా వ్రాయబడిన ఒక కాల్పనిక గాధ.

ఈ బృహత్కథ ను సినిమా గా తీయాలని ప్రఖ్యాత దర్శకుడు మణి రత్నం చాలా ఏళ్లుగా ప్రయత్నం చేస్తున్నాడు. ఇన్నేళ్ల ప్రయత్నాలు ఫలించి ఇప్పటికి ఈ కథను చిత్ర రూపం లోకి తీసుకు వచ్చాడు. రెండు భాగాలుగా వచ్చిన బాహుబలి గొప్ప విజయం సాధించడం ఒక మార్గం చూపింది.

ఈ చిత్రం రెండు భాగాలుగా తీయాలని నిర్ణయించాడు. మొదటి భాగం నిన్న విడుదల అయ్యింది. 

సినీ దిగ్గజాలు పనిచేసిన Period movie అన్న కుతూహలం కొద్దీ PS-1 తెలుగు అనువాద చిత్రం చూశాను. కొన్ని అభిప్రాయాలు.

సినిమా చూసిన తరువాత కలిగిన అభిప్రాయం. బాగుంది. అయితే కొంత అస్పష్టత ఉంది. మూల కథ, పాత్రలు మనకు తెలియక పోవడం వల్ల కొంత గందరగోళానికి గురి అవుతాము. 

వెంట వెంటనే వచ్చే పాత్రలు వారి backstories ప్రేక్షకులకు అర్థం అయ్యేలా చెప్పడం వారి బాధ, ఆకాంక్ష లను ప్రేక్షకుడు feel అయ్యేలా చేయగలగడం చాలా ముఖ్యం. అది కొంత miss అయ్యాడు మణి రత్నం అనిపించింది. అయితే ప్రముఖ నవల ఆధారం గా తీయడం వలన కథ విషయంలో deviate  అయితే చాలా విమర్శ వస్తుంది. నవలలను సినిమాలు గా adapt చేయడం అంత తేలిక కాదు. Writer's vision and director's vision may not always match. This happened in case of the iconic movie Guide. It was a very well made movie. Still RK Narayan felt that the movie was a poor adaptation of his novel.

Mani wanted to be faithful to the novel.  

కథలోని పాత్రల ఉద్వేగాలను ప్రేక్షకుడు అనుభవించే లాగా చేసే ఒడుపు, పాత్రలతో పాటు travel చేయించే నేర్పు రాజమౌళికి బాగా తెలుసు. 

ఒక interview లో పొన్నియన్ సెల్వన్ ఒక వెబ్ సీరీస్ గా తీయాలని అనుకున్నట్లు కూడా చెప్పాడు రాజమౌళి. అయితే మణి రత్నం ముందుగా ప్రకటించాడు.  రాజమౌళి was right. This elaborate and complex story is more suitable for web series. Still finding producer for a Magnum opus web series may not be easy. 

సినిమా లో విక్రమ్, శరత్ కుమార్, ఐశ్వర్య రాయ్, రహమాన్ వంటి 50-65 ఏళ్ల నటులను యువకుల పాత్రలకు ఎంచుకోవడం అతకలేదు

The actors, though very competent, are too old to play those characters. 

కొన్నేళ్ల క్రితం వచ్చిన గౌతమీ పుత్ర శాతకర్ణి కూడా ఒక మంచి చిత్రం. అయితే balakrishna was too old to play the character of a young warrior king in that movie.

కొన్నేళ్ల క్రితం విజయ్,  మహేశ్ బాబు లతో ఈ చిత్రం తీయాలని మణి రత్నం అనుకున్నాడు అని తెలుస్తోంది.

కార్తీ, జయం రవి వారి పాత్రలకు బాగా సూటయ్యారు. Both did really well. Another notable performer is veteran actor Jayaram as Vaishnava Brahmin who played the part with authenticity. కార్తీ జయరామ్ మధ్య వచ్చే సన్నివేశాలు అలరిస్తాయి.

విక్రమ్ అపరిచితుడు mode లో చెప్పే monologues , his screams to express anguish don't really strike a chord with viewers.

చిత్రం లో అక్కడక్కడ వచ్చే short conversations లో మణి రత్నం ముద్ర కనిపిస్తుంది.

చిత్రం చివర్లో వచ్చే ఓడ మీద యుద్ధం దృశ్యాలు అంత గొప్పగా లేవు. ప్రథమ భాగం ముగింపు  రెండవ భాగం కోసం మరీ ఎదురు చూసేలా లేదు కానీ there is enough interest. 

శివ కేశవులకు మధ్య భేదం లేదని జయరామ్ పరిచయ సన్నివేశం లోనే వచ్చే సీన్ బాగుంది. అలాగే జయరామ్ కు తనికెళ్ళ భరణి గాత్రం బాగుంది. 

Surprise. సంభాషణలు డబ్బింగ్ వాసన అంతగా లేకుండా బాగున్నాయి. ( తనికెళ్ళ భరణి ). పాటల సాహిత్యం బాగా లేదు. అక్కడక్కడ ఇనుప గుగ్గిళ్ళ వంటి పదాలు ఉన్నాయి. 

పాటల చిత్రీకరణ అంతగా ఆకట్టుకోదు. మహేశ్వర్ ఘాట్ కట్టడాల వద్ద  లో కృష్ణుడు కంసుడు theme తో చిత్రీకరించిన పాటలో concept  modern dance లాగా అనిపిస్తుంది. 

సంగీతం. Overall an underwhelming score. నేపథ్య సంగీతం  అక్కడక్కడ బాగుంది.  కార్తీ మీద చిత్రీకరించిన రహమాన్ పాడిన ' పొన్ని నది  పాట stands out for beat and music. Other songs are not so good.  Music feels out of sync with the theme and period of the movie.

Photography - Good but not great.

Sets - Some good. Some look tacky.

చిత్రం చూడవచ్చు. PS-1 is a movie  worth seeing  on big theatre screen.

బాహుబలి తో పోలిక అవసరం లేదు. The scope and aim of both the movies are quite different.

అయితే రాజమౌళి ఈ చిత్రం తీసి ఉంటే ఎలా ఉండేది అని అనుకుంటే ? Yes.  It is an interesting proposition.