నేను అమితంగా అభిమానించే గొప్ప కళాకారులకు ’పద్మ’ బహుమతులు లభించటంతో ఆనందం పట్టలేకపోతున్నాను.
గత సంవత్సరం గానకోకిల ’సుశీల’ గారికి పద్మభూషణ్ లభించటంతో ఎంతోకాలంగా మనసులోఉన్న వెలితి తీరింది. అలాగే జానకి గారికి ఇవ్వాలి. ఆమెకు తమిళనాడు వారే బహుమతివచ్చేలా చూస్తారని నాకు నమ్మకమున్నది.
.
ఈ ఏడాది ఇసైగ్నాని ఇళయరాజాకు పద్మభూషణ్ ప్రకటించారు. చాలా సంతోషం. ఆయన స్థాయికి ఇంకా దాదాసాహెబ్ అవార్డు, భారత రత్న కూడా ఇవ్వాలి
అలాగే అన్నమయ్య పాటకే జీవితం అంకితం చేసిన శోభారాజు గారికి పద్మశ్రీ ఇవ్వటం ఆనందంగా ఉంది. ఇంకా బాలకృష్ణప్రసాద్ గారికి కూడా పద్మశ్రీ ఇవ్వల్సిఉంది.
అయితే ఒక వెలితి నాలో దాగిఉంది. కర్ణాటక సంగీత ప్రపంచానికే మహరాజు అయిన బాలమురళిగారికి భారతరత్న ఇవ్వటం ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. వచ్చే ఏడాది కేంద్రప్రభుత్వం పై మన ముఖ్యమంత్రి ఒత్తిడి తీసుకురావాలి. ఆయన ఆనందంగా నవ్వుతూ ఆరోగ్యంగా ఉండి స్వంతంగా తీసుకోగలిగినప్పుడే భారతరత్న ఇవ్వాలి. పండిట్ భీమ్సేన్ జోశీకి ఇచ్చారు. ఆయనకంటే ఎంతో పైస్థాయికి చెందిన బాలమురళి కి ఇవ్వకపోవటం ఏమాత్రం ఆమోదయోగ్యంకాదు.
ప్ర్జజల రివార్డులే అవార్డులు అన్నమాట నిజమే అయినప్పటికినిన్నీ ఇటువంటి ఉత్తమశ్రేణి కళాకారులను సముచితంగా గౌరవించుకోవటం మనబాధ్యత. సరియైనసమయంలో వారిని సమ్మానించకపోవటం మహాపరాధమే.
anta baavundi kaani bhimsenjoshi kante mbk elaa entO pai sthaayiki chendina vyakti?
ReplyDeleteథాంక్స్ బుడుగు గారు. అంటే ఏమీ లేదు. బాలమురళి గొంతులోని మాధుర్యంగానీ మృదుత్వంగానీ భీమ్ సేన్ జోశీలో లేవు అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. balamurali has absolute mastery over carnatic music.
ReplyDeleteకళాకారులను సముచిత రీతిగా సత్కరించటము ఎంతైనా అవసరము . బాగా వివరించారు .
ReplyDeleteAgree with you on Balamurali - budugoy garu .. Bhimsen is good but Balamurali is the best! :)
ReplyDeleteకొత్తపాళీ గారు,మీ స్పందనకు సంతోషంగాఉంది. ఒక్కసారి నా కొత్త టపాలో రీతిగౌళపాట మీద ఓ చెవి వెయ్యరూ?
ReplyDelete