Saturday, June 19, 2010

సింధుభైరవి+ బాలు గారు + విశ్వరూప విన్యాసం

బాలు గారి గొంతులో ఉరకలెత్తిన ఒక పాట. ఎమ్మెస్వీ సంగీతం. సింధుభైరవిలో వరద గోదారి లాంటి బాణీ -బాలు  ప్రాణం పోశాడు. కమల్ dance steps comical గా అనిపిస్తాయి.  
-- విన్నతరువాత ఎదలో నిశ్శబ్ద జలపాతం.

సింధుభైరవి pathos బాగా పలికిస్తుంది. ఎన్నో నదులను కలుపుకునే సముద్రం లాంటి లోతైన రాగం.

నీ పేరు తలచినా చాలు. ఈ పాటవిన్నతరువాత ఒక అరగంట సేపు ’ఏవిటిది? ఏదో తెలియనిదీ? ఎప్పుడూ జరగనిది ఏవిటిది’ అన్న భావం చాలాసార్లు నాకు కలిగింది. నిజంగా నిజం.

’మామ’ కు ఇష్టమైన రాగమని ఎక్కడో చదివాను.

శ్రీరంగం గోపాలరత్నం గారి గొంతులో ఈ అన్నమయ్య సంస్కృత పదం సకలం హే సఖి--ముఖ్యంగా ’చారు కపోల స్థల కరాంచిత విచారం హే సఖి జానామి’

ఈ పదచిత్రం వింటే అలా చక్కటి చెక్కిలిపై చేయి చేర్చి శ్రీనివాసుని కోసం ఆలోచిస్తున్న అలమేలుమంగ రూపం స్పురిస్తుంది. జయదేవుని శైలి ఈ అన్నమయ్యపదంలో కనిపిస్తున్నది.

సింధుభైరవి విన్నంతసేపు మనస్సు గడ్డ కట్టిందో కరిగిపోయిందో ఇట్టె అర్థంకాదు.

5 comments:

  1. నీ పేరు తలచినా చాలు నాకిష్టమైన పాటల్లో ఒకటి! "ఏమి మురళి అది ఏమి రవళిరా.."అన్న తర్వాత కొనసాగింపు సుశీల గారి గొంతులో ఎనో శ్రావ్యంగా పలుకుతుంది. ఇలాంటి పాటలు వింటూ ఉంటే ప్రాణాలు కరగడం కాదు, మరణమైనా మధురంగానే తోస్తుంది.

    అలాగే ఎమ్మెస్వీ కూర్చిన పాటలంటే ప్రాణం నాకు! ఎవరికీ తెలీని ఒక ప్రాణ స్వభావాన్ని పాటల్లో పొదగడం ఆయనకే సాధ్యమవుతుందేమో మరి! అలాంటి రాగాలను ఎంచుకుంటారు.

    రెండూ ఏ మాత్రం పోలిక లేని వీలక్షణమైన పాటలు ఎన్నుకున్నారు. నీ పేరు తలచినా వింటూ ఉంటే అమర్ ప్రేమ్ సినిమా లోని కిషోర్ అద్భుతమైన పాట "చింగారీ కోయీ భడ్ కే" గుర్తొచ్చింది తమాషాగా!

    హిందోళం గురించి కూడా మీరొకసారి రాస్తారని చూడొచ్చా ! ముఖ్యంగా.."కలనైనా నీ తలపే" ఎంత బావుంటుంది!

    ReplyDelete
  2. సుజాత గారు! మీరన్నది నిజం. చింగారీ కోయీ పాట సింధుభైరవి లోనే ఉంది.
    చాలా మంచి పాట. తప్పక హిందోళ రాగం తో ఒక టపా రాస్తాను.

    ReplyDelete
  3. మూడు భాషల పాటలూ సింధుభైరవిలో వీనులవిందు చేశాయి. థాంక్యూ కిరణ్ గారూ !

    మొదటిది మీరన్నట్టు బాలు గళంలో ఉప్పొంగిన వరద గోదారి. రెండో పాట సుశీల స్వర మహిమతో ‘శతకోటి యమునా తరంగాలు’మదిలో పొంగిన మాధుర్యం. ‘పాట వినగ’ తర్వాత ‘ప్రాణాలు’అని పలికినచోట నిజంగా ఎంత అందం, ఎంత తీయదనం!

    ReplyDelete
  4. సకలం హే సఖి అద్భుతంగా వుంది. నేణు ఇంతకు ముందెప్పుడూ వినలేదు! చాలా గొప్ప పాటని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.
    శారద

    ReplyDelete
  5. వేణు గారు, శారద గారు: నెనర్లు.

    ReplyDelete