Tuesday, July 26, 2011

ముగ్గురన్నలూ. please retire అవ్వండి.

మనవాళ్ళు చెత్తగా చిత్తుగా ఓడిపోయారు lords test లో. దీనికి ప్రధానకారణం defeatist attitude మాత్రమే.
ఇంగ్లాండ్ చక్కగా ఆడటం, మనలో positive mindset లేకపోవటం, సహజమైన ఆట ఆడకపోవటం, అతిగా ఆడటం ఇతర కారణాలు.


సచిన్: god of indian cricket. ఇప్పుడు కేవలం ఉత్సవవిగ్రహం మాత్రమే. దయచేసి 100 వ సెంచరీ పూర్తిచేసి తప్పుకో భయ్యా. ఎంతో ability ఉంచుకొని కూడా అంత దరిద్రంగా జిడ్డు ఆట ఆడటమెందుకు. ఒకప్పుడు వెన్నపూసలో వేలు పెట్టినట్టుగా ఉండిన నీ ఆట ఈ రోజు వెన్నుపూసపైన కాలు పెట్టినట్టుగా ఉంటోంది (పుత్తడిబొమ్మ- జంధ్యాల). అయితే ఒక్క విషయం. సచిన్ all time great క్రీడాకారుడు అనేది నిండు నిజం. he is well past the sell by date అనేది ఇంకా నిజం.


ద్రావిడ్: బాబోయ్ ఏం జిడ్డు batting అండీ బాబూ. తను ప్రేక్షకులకోసం ఆడుతున్నాడో తన కోసం ఆడుతున్నాడో అర్థంకాదు. lords లో కొట్టిన century ఏమాత్రం ఆకర్షణీయంగా లేదు. boring game. match draw చేయటం కోసమే ఆడటం ఇతని ప్రత్యేకత.





లక్ష్మణ్: మంచి stroke player అయ్యి ఉండి కూడా పై ఇరువురి ప్రభావం వల్ల అదరగొట్టే లక్ష్మణ్ పూర్తిగా dull లక్ష్మణ్ గా మారిపోయాడు.

positive frame of mind ఉన్న ఆటగాడు ధోనీ ఆటతీరు కూడా దరిద్రంగా మారిపోయింది. stroke players బలవంతంగా defence ఆడితే ఏమీ ఉపయోగం ఉండదు.

మొన్నటికి మొన్న వీళ్ళూ west indies లో మూడో test ను కుళ్ళబొడిచిన తీరు చాలా దారుణం. గెలుపుకోసం కనీస ప్రయత్నం చేయకుండా draw చేసుకోని పై పెచ్చు సంబరాలు చేసుకోవటం ...my god . perplexing.

మీరు ముగ్గురు దయతో తప్పుకుంటే కుర్రవాళ్ళకు అవకాశాలు వస్తాయి. our fellows dont retire gracefully. it is in their genes.

ఓటమికి భయపడేవాడు గెలవటం కష్టం.

అసలు ఎందుకు ఆడుతున్నారు. ప్రేక్షకులను రంజింప జేయటానికా లేక records పెంచుకోటానికా.. ఈ దరిద్రపు ఆట చూసి బాధతో ఈ టపా వ్రాశాను. చాలామట్టుకు క్రికెట్ మీద ఆసక్తి పోయింది. అప్పుడప్పుడు మనవాళ్ళు అదరగొడుతుంటారు. అప్పుడు మళ్ళీ మామూలే.

1 comment:

  1. @"అసలు ఎందుకు ఆడుతున్నారు. ప్రేక్షకులను రంజింప జేయటానికా లేక రికార్డ్స్ పెంచుకోటానికా.."
    మీరడిగిన ఈ ప్రశ్న మీరే చెప్పినట్లు వారి దరిద్రపు ఆట చూసి బాధతో వ్రాసుండొచ్చు.
    కానీ మీరే ఇండైరెక్ట్ గా ఒప్పుకుంటున్నట్లు మనం వాళ్ళనుండి ఓవర్ గా ఎక్ష్పెక్ట్ చెయ్యడం వల్ల వచ్చిన సమస్య ఇది. టెస్ట్ క్రికెట్ ను కూడా వండే, 20-20ల్లాగా ఎంజాయ్ చెయ్యాలనుకోవడం అత్యాశే. టెస్టులాడేటప్పుడు కొన్ని స్ట్రాటజీలుంటాయి, ఉమాలి. మొన్న వెస్టిండీస్ లో గెలిచినా, నిన్న లార్డ్స్ లో ఓడిపోయినా వాటిప్రకారమే. ఇన్‌ఫ్యాక్ట్, టెస్ట్ క్రికెట్ అంటేనే జిడ్డుగా ఆడడం, ఈ విషయం మీకు తెలియదని కాదుగానీ ఫాస్ట్ క్రికెట్ పై పెరుగుతున్న మోజుకు మీ బాధ దర్పణం పడుతోందనిపిస్తుంది:)

    ReplyDelete