Sunday, February 9, 2020

'వలజి' గిబిగి లో ఆనాటి కలలు దాగే




కాలంతో కలిసి చేసే ప్రయాణం గమ్మత్తుగా ఉంటుంది. ఎక్కడికి వెళుతున్నా మో తెలియకుండా, అసలు మనం ప్రయాణం చేస్తున్న విషయమే ఎరుకలేకుండా సాగిపోతూ ఉంటుంది.

నక్షత్ర తతులు తలపై విస్తరించడం తెలుస్తూ ఉంటుంది.

 శరీరం లో ఒక్కో భాగం పనితీరు మందగించి ఒక్కో రకం మాత్ర మన అమ్ముల పొదిలో చేరడం జరుగుతుంది.

చిన్నవాళ్ళు చేసే తప్పులు, వాళ్ళ ఆవేశాలు గమనించి కోపం బదులు అర్థం చేసుకుని
సర్దుకుపోతూ సలహాలిస్తూ గడిపేయడం అలవాటవుతుంది.

చిన్న చిన్న విషయాలు అమితానందం ఇవ్వడం , ఒకప్పుడు విని అంతగా పట్టించుకోని పాటల్లో కొత్త అందాలు కనిపిస్తాయి.

అలాంటి నిరుడు కురిసిన పూల జల్లు   లోని ఒక మరు మల్లె-

నారాణి కనులలోనే - ఆనాటి కలలు దాగే.

( ఘంటసాల + ఎస్. రాజేశ్వర రావు+ శ్రీ శ్రీ - చిలక గోరింక)


ఈ పాట ఒక మేలి ముత్యం. వలజి రాగంలో ఎంతో అందంగా స్వరపరిచారు.

ఎస్వీ రంగారావు గారు అంజలీ దేవి గార్ల మీద. ఎంతో ఉదాత్తంగా ఈ యుగళ గీతం చిత్రీకరించారు.

ఈ రోజులలో ఇలాంటి పాట ఊహించగలమా.

రంగారావు గారు వీణ వాయిస్తూ , అంజలీ దేవి గారు చూపిన హావ భావాలు వారెంతటి మహా నటులో చెబుతాయి.

పాటలో వీణా నాదం ఆద్యంతం వీనులవిందు గా వినిపిస్తుంది. వీణ పాటలు తెలుగు వారి సంపద.

"వసంతగాలికి వలపులు రేగగా"

కదిలే కాలం కాసేపు ఆగిపోతే బాగుంటుంది అనిపిస్తుంది.



6 comments:

  1. welcome back sir.Really missing your posts.Please try to post frequently.Your posts are so good it brings different dimensions to songs

    ReplyDelete
  2. ఇలా ఎలా అసలు, నేను కూడా నిన్ననే ఈ పాట విన్నాను. నా వలజి వ్యాసంలో ఈ పాట తప్పించుకుంది. మీరు పట్టుకొచ్చారు....మళ్ళీ మీ టపా పలకరించడం వలజి రాగం విన్నంత ఆనందం కూడా!

    ReplyDelete
  3. https://twitter.com/SriramKvs/status/1226805620491206657?s=20

    have you listened to this one? :)

    ReplyDelete
    Replies
    1. Thank you Sriram Garu. మీ వలజి పోస్టు మరచిపోలేదు. This is a sweet recap of your wonderful post.

      రాజేశ్ వైద్య వీణ పాట ఇప్పుడే విన్నాను. చాలా బాగుంది. అతను చిట్టి బాబు గారి దగ్గర తొలినాళ్లలో నేర్చుకున్నాడు అని విన్నాను.

      మీరు సంగీత భరితమైన పోస్టు మళ్లీ వ్రాస్తే బాగుంటుంది.

      Delete
    2. చిట్టిబాబు గారి శిష్యులా...ఈ మధ్య ట్విట్టర్లో మంచి పాటలు వాయించి పెడుతున్నారు ఈయన.
      నా వ్యాసం గుర్తుపెట్టుకున్నందుకు చాల సంతోషం. మళ్ళీ పోస్టులు రాయడానికి ప్రయత్నిస్తాను...వినడమే తక్కువైపోయింది ఈమధ్య :(

      Delete
  4. Thank you Sasi Garu. I will try to post frequently.

    ReplyDelete