Thursday, February 18, 2010

బాలమురళి + ఇళయరాజా + రీతిగౌళ = ఒక మంచి పాట

ఈ అపురూపమైన పాట  బాలమురళీ, ఇళయరాజా ఇంకా కొన్ని పాటలకోసం కలిసి పనిచేసిఉంటే ఎంతబాగా ఉండేదో అనిపిస్తుంది. అసలు బాలమురళి గొంతును సినీపరిశ్రమ సరిగా వినియోగించుకోలేదు. అదొక తీరని వెలితి. ఒక విషయం ..
గొప్పగాయకులకు పాట (మధ్యలో వచ్చే సంగతులు కూడా) టేకాఫ్ ఎలా చేయాలి లాండింగ్ ఎక్కడచేయాలి అన్న విషయంమీద గట్టి పట్టు ఉంటుంది. నేను విన్నంతలో బాలమురళి, ఘంటసాల గారలకు ఈ విషయం లో సంపూర్ణ ఆధిపత్యం ఉంది.

ఈ రీతిగౌళ లోనే ఏదో లాగేసుకునే మాయ ఉంది (ఇదే విధంగా చాలా రాగాలవిషయంలో నాకు అనిపిస్తుంది). ఇప్పటికి ఇదిసత్యం. ఇదే సత్యం.

 ఇంతమంచి పాటలను కొత్తతరంవారు కూడా వినాలని నాకోరిక. ఏపాట అయినా సంగీతాన్ని, సాహిత్యాన్ని విడివిడిగానే ఆస్వాదించడం బాగుంటుంది. . టీనేజీలో వింటూ పెరిగిన తమిళ్/కన్నడ  పాటలు శాశ్వతంగా మనస్సులో తిష్ట వేశాయి. 

 :ఇదే  రాగంలో శేషశైలావాస గీతం, రామాకనవేమిరా పాట అందరికీ సుపరిచితమే.

5 comments:

  1. బాగుంది. మీరది రీతిగౌళ అని చెప్పి ఉండకపోతే నాకు స్ఫురించేది కాదు :) కర్నాటక సంగీతంలో రీతిగౌళలో సర్వసాధారణంగా వినిపించే ఒక ప్రత్యేకమైన గమకపు మెలిక ఇందులో వినబడక పోవడం వల్ల అనుకున్నాను.
    మహాగాయకుల గురించి మీరు చెప్పింది నిజం.
    సినిమాలు బాలమురళీని సరిగా ఉపయోగించుకోలేక పోవడం గురించి - దానికి కొంత ఆయన వ్యక్తిగత తిక్కలు కూడా కారణమని నా అనుమానం.
    ఈ పాట మాత్రం గొప్పగా ఉంది. పంచుకున్నందుకు నెనర్లు.

    ReplyDelete
  2. పాట బావుందండీ. థాంక్యూ! ఇది ఏ సినిమాలోదో, ఏ సంవత్సరం వచ్చిందో- ఆ వివరాలు కూడా ఇవ్వాల్సింది.
    ఇళయరాజా- బాలమురళి కాంబినేషన్లో ఇంకా ఏమైనా పాటలు వచ్చాయా?
    విశ్వనాథన్- బాలమురళి సమ్మేళనంతో వచ్చిన ‘గుప్పెడు మనసు’ పాట ‘మౌనమె నీ భాష ఓ మూగ మనసా’ ఎంత ఆదరణ పొందిందో కదా!

    ReplyDelete
  3. కొత్తపాళీ గారు, స్పందించినందుకు థాంక్స్.
    వేణు గారు, మీ వ్యాఖ్యకు నెనరులు. ఈ పాట ’కవి క్కుయిల్’ సినిమాలోది. 1977. ఇళయరాజా- బాలమురళి కాంబినేషన్లో వేరే పాటలు నేను విన్నంతలో లేవు.

    ReplyDelete
  4. పాట చాలా బావుందండీ! రీతి గౌళలో ఈ మధ్య వచ్చిన ఒక మంచి పాట అనంతపురం సినిమాలో "కొంటె చూపుతో...నీ కొంటె చూపుతో" !

    బాలమురళి ని సినిమా పరిశ్రమ వినియోగించుకోకపోవడం మన మంచికే లెండి! లేకపోతే ఆయన పరిశ్రమకే పరిమితమై ఉంటే శాస్త్రీయ సంగీతం మీద కాన్సంట్రేట్ చేయగలిగే వారు కాదేమో!

    ఆయన పాడిన పాటల్లో నాకు "వసంత గాలికి" " నీవు నేను వలచితిమి" పాటలు బావుంటాయి.

    ReplyDelete
  5. సుజాతగారు . మీ స్పందనకు ధన్యవాదాలు. అవును ’కొంటె చూపుతో...నీ కొంటె చూపుతో’ పాట బాగుంది. మంచి మెలోడీ.

    ReplyDelete