(picture credits to the respective owners)
తిరుపతి శ్రీ కోదండ రామ స్వామి బ్రహ్మోత్సవాలు ముత్యపు పందిరి వాహనసేవ SVBC వాహినిలో ప్రత్యక్ష ప్రసారం చూస్తుండగా ' జానకీ జానే ' అన్న ఒక మధుర గీతం జేసుదాసు గళంలో వినిపించింది. ఇంత మంచి గీతం ఇదివరకు వినలేదే అనుకుంటూ అంతర్జాలంలో వివరాలు సేకరించాను.
ఆ గీతం ' ధ్వని ' అనే మళయాళ చిత్రం లోనిది అని తెలిసింది. Serendipity అంటే ఇదేనేమో. ధ్వని చిత్రం యొక్క సంగీత విశేషాలు తెలుసుకుందాము అని చూస్తే . అన్నీ మంచి పాటలే ఉన్నాయి.
సంగీతం : Legendary Hindustsni film music director Naushad Ali composed the songs. అన్ని పాటలు జేసుదాస్ గారు పాడారు. రెండు పాటలు సుశీల గారు పాడారు. అన్ని పాటలు వినసొంపుగా ఉన్నాయి. We are fortunate to be born in the same era of legends like Yesudas, Susheela Garu అని మరొకసారి అనిపించింది.
ఈ చిత్రంలో జయరామ్ , శోభన నాయికా నాయికలు.
జానకీ జానే అన్న గీతం యమన్ కళ్యాణ్ రాగం లో ఉంది. జేసుదాస్ గారు సుశీలగారు ఇద్దరు పాడిన రెండు వెర్షన్లు కూడా అద్భుతంగా ఉన్నాయి. Both the songs are melodious in their golden voices.
ఒక విశేషం ఏమిటంటే ఈ గీతం శ్రీ రామచంద్రుని స్తుతించే ఒక సంస్కృత గీతం. రచన యూసఫ్ ఆలీ కెచేరి, సంగీతం నౌషాద్, గానం జేసుదాసు సుశీల.
A beautiful musical and lyrical collaboration by great artists of three religions.
' అనురాగ లోల ' అనేది మరొక చక్కటి యుగళ గీతం. జేసుదాస్, సుశీలమ్మ గారు అద్భుతంగా పాడారు. ఈ పాట పట్ దీప్ అనే హిందూస్తానీ రాగం ఆధారంగా స్వరపరిచారు. ఈ పట్ దీప్ రాగం కర్నాటక సంగీత రాగం గౌరిమనోహరి రాగానికి చాలా దగ్గరగా ఉంటుంది. దాదాపు అవే స్వరాలు కలిగి ఉంటుంది. పాట చాలా బాగా వచ్చింది. Short and sweet.
ఈ రాగంలో మేఘా ఛాయే ఆధీ రాత్ అన్న ప్రసిద్ధ గీతం ఉంది ( శర్మీలీ చిత్రం)
తక్కిన పాటలు కూడా శాస్త్రీయ రాగాల ఆధారంగా సరళంగా స్వరపరచబడి వినటానికి హాయిగా ఉన్నాయి.
' ధ్వని ' చిత్రం గీతాల juke Box
మళయాళ సాహిత్యం లో సంస్కృత పదాల ప్రభావం తెలుగు కంటే కూడా ఎక్కువ. సినీ గీతాలలో కూడా సంస్కృత పదాలు విరివిగా ఉపయోగిస్తారు.
అనురాగ లోల గాత్రి, నీల రాత్రి, లయ లాస్య కలా కాంతి, ద్యుతి నిన్ముఖారవిందం, ప్రాణ సఖి, రజనీ రాజ ముఖి, హిమ మణిమాల, మంజీర ధ్వని, మంజుల హాసం, మాధవ మాసం , భాసుర కావ్యం, నిర్వృతి.... ఇలా ప్రతి గీతం సంస్కృతపద భూయిష్టం గా సాగుతుంది.
ఇలాంటి మధుర సంగీతం, సాహిత్యం తో కూడిన చిత్రాలు తీయడం దర్శక, నిర్మాతల, ప్రేక్షకుల ఉత్తమ అభిరుచికి అద్దం పడుతుంది.
Lyrics
రామా ....రామా...
జానకీ జానే.. రామా
కదన నిదానం నాహం జానే
మోక్ష కవాటం నాహం జానే
(మళయాళ గాయకులు కవాడం అని పలుకుతారు. ట -డ యో: అభేద: అనుకోవాలి )
జానకీ జానే ...రామా
విషాద కాలే సఖా త్వమేవ
భయాంధకారే ప్రభా త్వమేవ
(Beautiful lyric for the above two lines)
భవాబ్ధి నౌకా త్వమేవ దేవా
భజే భవంతమ్ రమాభిరామా
జానకీ జానే ...రామా
దయా సమేత సుధా నికేత
చిన్మకరంద నత మునిబృంద
ఆగమసార జిత సంసార
భజే భవంతమ్ మనోభిరామా
జానకీ జానే ...రామా
కదన నిదానం నాహం జానే
మోక్ష కవాటం నాహం జానే
జానకీ జానే... రామా
--------
Naushad said he will sign this film if only Susheela sings.That is the value of Susheelamma and she is seen next to Lata. Sad she didnt even get Dadasaheb Phalke award
ReplyDeleteఅవును శశి గారు. సుశీలమ్మ గారికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు లేదా పద్మ విభూషణ్ ఇవ్వాలి.
Deleteఅలాగే 800 చిత్రాలకు సంగీతం సమకూర్చిన లెజెండ్ ఎమ్. ఎస్ విశ్వనాథన్ గారికి పద్మశ్రీ కూడా ఇవ్వలేదు అంటే ఇక ఏమి చెప్పగలం.
అసభ్య నీలి చిత్రాలు తీసే ఏక్తా కపూర్ కు పద్మశ్రీ ఇచ్చారు. - GKK
విషాద కాలే సఖా త్వమేవ
ReplyDeleteభయాంధకారే ప్రభా త్వమేవ
మొత్తం కీర్తన అద్భుతం. నాకు సంగీతం గురించి తెలియదు. చెవికింపుగా సోకితే ఆనందిచడం వరకే, ఇది కూడా ఒకప్పటి మాటే! 'కవి" లో సగం
Thank you sarma sir.🙏
Deleteనేర్చుకోకున్నా అందరికీ అర్థం అయ్యే భాష ఆనందం పంచే భాష మధుర సంగీతం.
రచయిత యూసఫ్ ఆలీ గారు ఇటువంటి మధుర గీతాలు కృష్ణుడి పై కూడా వ్రాశారు అని తెలుస్తుంది. ఆయన కవిగా కేరళ రాష్ట్రంలో ప్రసిద్ధులు. మళయాళం సంస్కృతం లో రచనలు చేశారు. He expired in 2015 sir.