Monday, February 17, 2020

కడలంటె నదికేల కోపం- నీ కోసమే జీవించు 'నది'

సినీ కవులు రాసే ప్రేమ- విరహ గీతాలు భలే ఉంటాయి.

అవి వింటే ప్రియుడు ప్రేయసి కంటే తనపై ఉన్న ప్రేమను ఎక్కువగా ప్రేమిస్తున్నట్టు అనిపిస్తుంది.

ఆ గీతం ఆమె వినడమో చదవడమో జరిగితే మరుక్షణం అతని దరి చేరి ఒడిలో కరగిపోవాలని ఆమెకు అనిపిస్తుంది.

Yes, it strikes a chord in the deepest recesses of listeners' hearts too.

ఈ magic కొన్ని పాటలలో ఉంటుంది.

ఈ విరహ భావాలను తెలపడానికి,
to think aloud lovers' feelings,
భాగేశ్రీ రాగం బాగా నప్పుతుంది.

ఒక అందమైన పాట. One of my all-time favourites.

కడలోడు నదిక్కెన్న కోబమ్. ( SPB - Shankar- Ganesh 1981)-

బాలు గారు ఎంత హాయిగా పాడారు.

Balu sir weaves magic with his Mesmerising rendition.

Great composition by Shankar- Ganesh.

భాగేశ్రీ హిందూస్తానీ రాగం. ఎన్నో మంచి హిందీ సినీ గీతాలు ఇందులో ఉన్నాయి.

ఒక మంచి పాట

జీవన్ సే భరీ తేరీ ఆంఖే (సఫర్ 1970- కిశోర్ కుమార్- కళ్యాణ్ జీ ఆనంద్ జీ).
It is an all time classic with great lyrics and music. కిశోర్ కుమార్ జీవం పోసిన పాట.


The song forever -విరహ గీతాలకు పెన్నిక్క నీ  కోసమే నే జీవించునది
( మాయా బజార్). పాట రెండో చరణం రాగాంతర సంచారం చేసి అందంగా మళ్లీ భాగేశ్రీ లోకి ఒదిగి పోతుంది.

"విరహము కూడా సుఖమే కాదా నిరతము చింతన మధురము కాదా. "

Well the above two lines sums  up the essence of the raga beautifully.
Sunday, February 9, 2020

'వలజి' గిబిగి లో ఆనాటి కలలు దాగే
కాలంతో కలిసి చేసే ప్రయాణం గమ్మత్తుగా ఉంటుంది. ఎక్కడికి వెళుతున్నా మో తెలియకుండా, అసలు మనం ప్రయాణం చేస్తున్న విషయమే ఎరుకలేకుండా సాగిపోతూ ఉంటుంది.

నక్షత్ర తతులు తలపై విస్తరించడం తెలుస్తూ ఉంటుంది.

 శరీరం లో ఒక్కో భాగం పనితీరు మందగించి ఒక్కో రకం మాత్ర మన అమ్ముల పొదిలో చేరడం జరుగుతుంది.

చిన్నవాళ్ళు చేసే తప్పులు, వాళ్ళ ఆవేశాలు గమనించి కోపం బదులు అర్థం చేసుకుని
సర్దుకుపోతూ సలహాలిస్తూ గడిపేయడం అలవాటవుతుంది.

చిన్న చిన్న విషయాలు అమితానందం ఇవ్వడం , ఒకప్పుడు విని అంతగా పట్టించుకోని పాటల్లో కొత్త అందాలు కనిపిస్తాయి.

అలాంటి నిరుడు కురిసిన పూల జల్లు   లోని ఒక మరు మల్లె-

నారాణి కనులలోనే - ఆనాటి కలలు దాగే.

( ఘంటసాల + ఎస్. రాజేశ్వర రావు+ శ్రీ శ్రీ - చిలక గోరింక)


ఈ పాట ఒక మేలి ముత్యం. వలజి రాగంలో ఎంతో అందంగా స్వరపరిచారు.

ఎస్వీ రంగారావు గారు అంజలీ దేవి గార్ల మీద. ఎంతో ఉదాత్తంగా ఈ యుగళ గీతం చిత్రీకరించారు.

ఈ రోజులలో ఇలాంటి పాట ఊహించగలమా.

రంగారావు గారు వీణ వాయిస్తూ , అంజలీ దేవి గారు చూపిన హావ భావాలు వారెంతటి మహా నటులో చెబుతాయి.

పాటలో వీణా నాదం ఆద్యంతం వీనులవిందు గా వినిపిస్తుంది. వీణ పాటలు తెలుగు వారి సంపద.

"వసంతగాలికి వలపులు రేగగా"

కదిలే కాలం కాసేపు ఆగిపోతే బాగుంటుంది అనిపిస్తుంది.