Tuesday, March 22, 2022

తత్త్వవిదానంద సరస్వతి స్వామి స్ఫూర్తి- ఒక లఘు కవిత

 





    ప్రస్తుత కాలంలో శంకర అద్వైత సిద్ధాంత  ప్రవచన కర్తలలో శ్రీ తత్త్వవిదానంద సరస్వతి స్వామి గారు అగ్రగణ్యులు. వారి ప్రసంగాలు, రచనలు మిక్కిలిగా అందుబాటులో ఉన్నాయి.


స్వామి సంప్రదాయ కుటుంబం లో జన్మించారు. బాల్యంలో వేద విద్యను సంస్కృత భాషను అభ్యసించి తదుపరి ఆధునిక విద్య నేర్చుకున్నారు. రసాయన శాస్త్రం లో Ph. D పొంది ప్రభుత్వ ఉద్యోగం చేశారు. వేదవిద్య ఆధారంగా సంస్కృతంలో మరల Ph. D అందుకున్నారు. 


అయితే ఆత్మ ప్రబోధానుసారం ఆర్ష విద్యా సంస్థ స్థాపకులు స్వామి దయానంద సరస్వతి స్వామి పట్ల ఆకర్షితులై వారి శిష్యులు గా మారి సన్యాసం స్వీకరించారు. 


దాదాపు 30 ఏళ్లుగా శంకర అద్వైత బోధలు తమ ప్రసంగాలు, రచనల రూపం లో నిరంతరంగా కొనసాగిస్తున్నారు. తెలుగు ఆంగ్ల భాషలలో ప్రసంగిస్తారు.  వారి బోధనలు సూటిగా సరళంగా , సహేతుకంగా, శాస్త్రీయ దృక్పథం తో సాగుతాయి. మూఢ మిథ్యా చారాలు, ఆడంబరం, ఆర్భాటాలకు దూరంగా ఉంటారు. ప్రచారానికి దూరంగా ఉంటారు.      ప్రతి సంవత్సరం కొన్ని నెలల పాటు  అమెరికాలో ఉండి ఉపదేశం ఇస్తారు.

వారి బోధనలు, రచనల ప్రధాన ఉద్దేశ్యం అద్వైత  వేదాంత దర్శనం. అయితే వ్యావహారిక జీవితానికి అద్వైత మార్గానికి వారు చక్కని సమన్వయం చూపుతారు. వారి ప్రవచనం విన్నవారిపై తప్పక ప్రభావం చూపుతాయి అనడం లో సందేహం లేదు. Swamiji is a perfect blend of sanatana Dharma and modern thought process. 


స్వామి గారి ప్రవచనాలు రచనలు ప్రస్థాన త్రయం, శంకర భాష్యం, ఉపనిషత్తులు, ప్రకరణ గ్రంథాలు. .. సరళమైన శైలిలో ఉపదేశిస్తాయి. 


పంచీకరణం ప్రకరణ గ్రంథం పై స్వామి ఆంగ్లం లో ఇచ్చిన ప్రవచనాలు ఇక్కడ ఉన్నాయి. ఎంతో విలువైన ఉపదేశాలు.

స్వామి ప్రవచనాల స్ఫూర్తి తో ఒక లఘు రచన వ్రాశాను. అది సాక్షి పత్రిక ఆదివారం అనుబంధంలో 21-3-2022 తేదీ వచ్చింది.



భక్తి , జ్ఞానం రెండు కూడా ఆధ్యాత్మిక మార్గంలో పురోగతికి ముఖ్య సాధనాలు అని ఆచార్యులు చూపిన మార్గం శిరోధార్యం.స్వామి బోధనలు సనాతనం, సనూతనం.