Wednesday, November 23, 2022

గాడ్ ఫాదర్ తెలుగు చిత్రం

ఈ సినిమా మాతృక లూసిఫర్ మలయాళం లో ఎందుకు హిట్ అయ్యిందో అది మళ్లీ తెలుగు లో తీయాలి అని ఎందుకు అనుకున్నారో..

స్వామి శరణం. 

కథ,  కథనం సహజం గా అనిపించ లేదు.  చిరంజీవి కొన్ని సీన్లలో బాగా నటించాడు.  అయితే మరికొన్ని సీన్లలో నటన స్తబ్దుగా డల్ గా అనిపించింది. సంభాషణలు పలకడంలో ఎనర్జీ, ఫ్లో తగ్గినట్లు అనిపిస్తుంది. 

విలన్ గ్యాంగ్ సభ్యులు ఒక్కరొక్కరు దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి హీరో కొట్టిన ఒక్క పిడిగుద్దుతో అమాంతం గాల్లోకి లేచిపోయి దభీమని భూమిపై పడిపోవడం లాంటి ఎలివేషన్ సీన్లు హిలేరియస్ గా అనిపిస్తాయి. Such scenes wont come to an end anytime soon in Telugu movies.

Unpopular opinion:

చిరంజీవి గారు ఇక మీద lead roles కంటే impactful cameo roles, lighter vein roles వేస్తే బాగుంటుంది. The stage has come where he should enjoy the role. 

సల్మాన్ ఖాన్ పాత్ర,  చిరంజీవి - సల్మాన్ పాట ఏమాత్రం ఆకట్టుకోదు. Music, lyrics and choreography for this song is very poor. 

Without a proper role, Salman Khan is totally wasted in the movie.

సినిమా లో సత్యదేవ్  అందరికంటే బాగా చేశాడు అనిపించింది. He seems to be a good actor with good screen presence.

అసలు సిఎం అల్లుడు గా ఉన్న సత్యదేవ్ సి ఎం అవడం కోసం చేసే ప్రయత్నాలు, ప్లాన్లు హాస్యాస్పదం గా ఉన్నాయి. చక్కని రాజ మార్గముండగా..  విలన్ లేకపోతే బాగుండదని బలవంతం గా విలన్ పాత్రను దర్శకుడు సృష్టించినట్లు అనిపించింది.

బ్రహ్మం పాత్ర జైలుకు అంత తొందరగా ఎలా వెళ్లిందో, మళ్లీ అంతే వేగంగా బయటికి ఎలా వచ్చిందో అర్థం కాదు. దర్శకుడు జైలు లో కొన్ని సీన్లు తీయాలి కాబట్టి అందరూ కో ఆపరేట్ చేసి ఉంటారు.

ఎమ్మెల్యే లతో నడిపించే సీన్లు కూడా ఏమీ ఆకట్టుకోవు. 

పూరి జగన్ లాప్ టాప్ లో vlogger గా బాగున్నాడు. అయితే జైలోకి వచ్చి బ్రహ్మం ను కలిసే సీన్లో అతని నటన, body language తేలిపోయింది.

బ్రహ్మం చెల్లెలిని ముఖ్యమంత్రిగా ప్రపోజ్ చేస్తూ ఇచ్చిన ముగింపు బాగుంది.

మిగిలిన నటులలో సునీల్ భార్యగా వేసిన అమ్మాయి , అనసూయ వీళ్లిద్దరూ సహజంగా నటించారు. In their limited screen time both leave their mark.

Thaman music is a big let down. Songs and score not good. So called item song is so bad.

అయితే సినిమా బోర్ కొట్టదు. కాలక్షేపం కోసం చూడవచ్చు.

చిరంజీవి సినిమా చూసి ఎన్నో ఏళ్ళు అయ్యింది అన్న ఉద్దేశ్యం తో చూశాను. Without any expectations చూస్తే OK movie.



Sunday, November 20, 2022

కొన్ని combinations - magic చేస్తాయి



రాజమౌళి - కీరవాణి 
మణి రత్నం - రహమాన్ 
సుకుమార్ - DSP 

we know that if they collaborate, magic is created. Output వేరే లెవెల్ లో ఉంటుంది. 

ఇలాంటి జోడీ ఒకటి మలయాళ చిత్ర పరిశ్రమలో ఉంది --   

లాల్ జోస్  - విద్యా సాగర్. 

వీరి కలయికలో వచ్చిన చిత్రాలు ప్రజాదరణతో పాటు సంగీతపరంగా కూడా విజయం సాధించాయి. నీలతామర, మీస మాధవన్, డైమండ్ నెక్లెస్ ఇత్యాది చిత్రాలలో విద్యాసాగర్ సూపర్ హిట్స్ ఇచ్చాడు. 

మళయాళ చిత్రాల పేర్లు కొన్ని tongue twisters లాగా ఉంటాయి.
 
ఉదా.Pullipulikalum Aattinkuttiyum - Hey. it is quite difficult to pronounce..🐢🙊. 

ఈ చిత్రం లోని పాటపై కొన్నేళ్ల క్రితం ఒక పోస్ట్ వ్రాశాను.

ఇటీవల Solamante Theneechakal అనే చిత్రం కోసం LJ - VS కలిసి పనిచేశారు.

vidya sagar is a unique composer. He has composed some great melodies in Malayalam and Tamil movies. He is rated highly but rather under utilised. It can be said  that he is one if the finest intellectual classy music directors. 

తనకు కేరళ లో అధిక సంఖ్యలో అభిమానులు ఉన్నారు.

కొన్నేళ్లుగా విద్యాసాగర్ చిత్రాల సంఖ్య తగ్గింది. నదిలో కొత్త నీరు పారడం సహజం. 

This  is sort of comeback movie for both lal Jose and Vidya.

ఈ కొత్త చిత్రం లో పాటలు ఎలా ఉన్నాయో విందాము. 

1) విరల్ తొడట్టే - విద్యా సాగర్ సంగీతం ముప్పై ఏళ్లుగా evolve అవుతూ రావడం గమనించాను. finesse, subtlety, smoothening పెరుగుతూ వచ్చింది. Now he has reached the next level of composing which very few other composers have achieved. His music feels like an abstract painting now. This song corroborates it. 


Instant coffee రుచి కొన్ని పాటలకు ఉంటుంది. ఈ చిత్రం లో పాటలు filter coffee లాగా అనిపిస్తాయి.

పాడుకొనే కంటే వినడానికి బాగుంటాయి ఈ తరహా పాటలు. 


ఏదో లోకం లోకి ప్రయాణం చేసినట్లు అనిపిస్తుంది పాట వింటుంటే .గాయకుడు నకుల్ అభయంకర్ బాగా పాడాడు.
 -
2) ఆనందమో - another beautiful soft melody.  

ఈ పాటలు pastels లేత రంగులతో గీసిన చిత్రాలు. Orchestrization లో ఒక sublime touch కనిపిస్తుంది.

3) పంజారక్కో - a song composed in retro style of 50-60s. Uses  instruments like clarinet, Spanish Guitar etc. జాణవులే ( ఆదిత్య 369 ), నా సిరిచా దీబావళి (నాయకన్) పాటల కోవలో సాగుతుంది. అయితే విద్యాసాగర్ మార్కు సంగతులు పాటలో వినవచ్చు. 

He is still capable of creating good music if elements conspire and inspire him. 


Tuesday, November 15, 2022

సూపర్ స్టార్ కృష్ణ గారు 🙏🙏🙏

రామారావు గారు, నాగేశ్వర రావు గారి తరువాత తరం లో  ( 70s-80s)  కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు గార్లు  సమకాలీన కథానాయకులు, పెద్ద హీరోలుగా వెలుగొందారు. 

The last big hero of this trio, Superstar Krishna Garu passed away today. 

Krishna Garu is a doyen of Telugu film industry.

To act as a lead hero in  more than 300 movies is  phenomenal.

He introduced cinemascope, 70mm, cowboy, James bond genre movies in Telugu movies.

కృష్ణగారు మంచి అందగాడు, పసిమి చాయ, నిండైన  వాచకం కలిగిన మంచి నటుడు. అంతకుమించి మంచి మనసు ఉన్న మనిషి గా పేరు తెచ్చుకున్నారు. Though he had limitations in terms of range of roles he could assay, he had a tremendous screen presence. He has good command over Telugu language. A very dignified person. He was a born hero.

కృష్ణ - విజయ నిర్మల గారు 60-70 ల లో దాదాపు 48 చిత్రాలలో నటించారు.

కృష్ణ - శ్రీదేవి, కృష్ణ - జయప్రద గార్ల కాంబినేషన్ అంటే ప్రేక్షకులు చాలా ఇష్టపడేవారు.

As a teenager, I used to be Krishna Garu fan. After NTR, krishana garu used to enjoy mass following.

కృష్ణ గారి చిత్రాలు ఎన్నో చూశాను. వాటిలో నాకు బాగా నచ్చిన మూడు చిత్రాలు 

1) అల్లూరి సీతారామరాజు -1974 iconic movie. No other actor can replicate Krishna garu performance. Magnum opus movie. Probably the best of his career. ఆయనకు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వవలసిన చిత్రం. He owned the role and gave life to the movie.

2) కృష్ణావతారం -  (1982) బాపు తీసిన చిత్రం. ఈ చిత్రం లో కృష్ణ విలక్షణంగా ఒక రౌడీ పాత్రలో కనిపిస్తాడు. I feel that this  was one of the best performances of Krishna garu.

3) కృష్ణార్జునులు - (1982) ఈ చిత్రం లో కృష్ణ శోభన్ బాబు కలిసి నటించారు. This was a well written role by the director Dasari. The conflict between two heros was well presented. Krishna mesmerized with his natural acting and dialogues in this movie.

కృష్ణ గారు మంచి టైమింగ్ ఉన్న నటుడు అని చెప్పలేము. అయితే free flowing roles  combination scenes ఇస్తే అద్భుతంగా నటించేవారు. అలాగే dances were not his cup of tea. There used to be some stiffness while he danced. Nevertheless viewers enjoyed his dances.

అందరూ హీరోలకు అభిమానులు ఉంటారు. అయితే  కృష్ణ గారి అభిమానులు ప్రత్యేకం. ఎందుకంటే ఎంతో మంది కృష్ణ గారిని స్వంత కుటుంబ సభ్యుడుగా భావిస్తారు. ఆయన కూడా వారిని అంతలా ప్రేమించేవారు.

తనయుడు మహేశ్ బాబు తనను మించిన పెద్ద స్టార్ అవటం కృష్ణ గారికి ఎంతో సంతృప్తిని కలిగించి ఉంటుంది.

రిటైర్ అయిన తరువాత హాయిగా ఆనందంగా జీవనం సాగిస్తున్నారు. ఇంతలో విజయనిర్మల గారు, సతీమణి ఇందిరమ్మ గారు, పెద్ద కుమారుడు రమేశ్ బాబు దూరం కావడం కృష్ణ గారికి తీవ్రమైన బాధ కలిగించింది. 

రాజకీయ నాయకులు, నటులు, అభిమానులు, సామాన్య ప్రజలు అందరికీ ఆత్మీయ వ్యక్తి, అభిమాన నటుడు శ్రీ కృష్ణ గారికి నమస్సుమాంజలి. A True legend. వారికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ప్రకటిస్తే సముచితంగా ఉంటుంది.🙏



Wednesday, November 9, 2022

వెండికొండ పై విధుబింబం - ధర్మావతి

కర్ణాటక సంగీతం లోని రాగాలపై , మెలోడీ పాటలపై ఉన్న అభిమానం తో 2007 లో బ్లాగులలో ప్రవేశించినప్పటి నుంచి అడపా దడపా సంగీత రాగాలను ప్రస్తావిస్తూ కొన్ని పోస్టులు వ్రాస్తూ వచ్చాను. కర్ణాటక సంగీతం తో కొద్దిపాటి పరిచయం , శ్రవణ, సంచిత జ్ఞానమే తప్ప విశేష పరిజ్ఞానం ఏమీ లేదు. తేనెటీగ మకరందాన్ని పువ్వుల నుంచి సేకరించినట్లు public domain లోని వివిధ మూలాలనుంచి సమాచారం సేకరించి పోస్ట్ లు వ్రాయడం జరుగుతుంది. 

నాకు తెలిసి 2006-7 లలో వ్రాసే బ్లాగర్లు ఇప్పుడు అంతగా వ్రాయడం లేదు. Maybe they moved on to greener pastures. Or simply got bored. 

ఒక మంచి పాటను వెంటనే గుర్తించగలిగే దృష్టి కొంతవరకు ఉంది. 

ప్రతి భారతీయుడికి మాతృ భాషతో పాటు, సంస్కృత సాహిత్యం, శాస్త్రీయ సంగీతం, రామాయణ భాగవతాలు, ఉపనిషత్తులు, భగవద్గీత తో కొద్దిపాటి పరిచయమైనా ఉండాలి అనిపిస్తుంది.  To enrich our lives. 

పుష్కరకాలం క్రిందట ధర్మావతి రాగం లోని పాటలపై ఒక పోస్టు వ్రాశాను. 

మరొకసారి పుష్కర స్నానం చేస్తే పుణ్యం వస్తుంది.

మేళకర్త రాగాలు 72. అవి సంపూర్ణ రాగాలు. అందులో 36 రాగాలు  శుద్ధ మధ్యమం కలిగి ఉంటాయి. ( శంకరాభరణం, చారుకేశి, గౌరి మనోహరి, హరికాంభోజి, కీరవాణి ఇత్యాది రాగాలు)

36 ప్రతిమధ్యమం తో కూడినవి. ( కల్యాణి, చక్రవాకం, ధర్మావతి,వాచస్పతి, సింహేంద్ర మధ్యమం ఇత్యాది రాగాలు).

వెంకట మఖి అనే ఒక సంగీత శాస్త్రవేత్త, పండితుడు (1600-1650 కాలం) కర్ణాటక సంగీతం లోని రాగాలను శాస్త్రీయంగా విభజించి 72 మేళకర్త రాగాలను స్థిరపరచాడు. ఆ పద్ధతి ఇప్పటికీ కొనసాగుతున్నది. 

ఆ రాగాలకు సంఖ్యక్రమం కటపయాది పద్ధతిలో ఏర్పాటు చేశాడు. కటపయాది పద్ధతి గురించిన వివరణ ఈ వీడియోలో చక్కగా ఉన్నది.

జాజి, సంపెంగ, విరజాజి, పారిజాతం, గులాబి, చేమంతి.. వివిధ రకాల పూలు ప్రత్యేకమైన స్వాభావిక సుగంధం కలిగి ఉన్నట్లు, వివిధ రాగాలు వాటి. ప్రత్యేక స్వభావం, స్వరూపం, అస్తిత్వం కలిగి ఉన్నాయి. 

రాగాలు అన్నీ గొప్పవే. అయితే ఆ రాగాలు ఉపయోగించి మధుర గీతాలను సృజించిన వారు స్వరకర్తలు , వాగ్గేయకారులు. 

We are fortunate that we have huge body of outstanding and everlasting compositions created by vaggeyakaras.

Dharmavaati is the prati madhyama equivalent of Gouri Manohari ragam.

ధర్మావతి రాగం లో చక్కగా స్వరపరచిన మరి కొన్ని గీతాలు...

1) చంద్రప్రభ వాహనమున చక్కనయ్య కనరో 

ఈ గీతం శ్రీనివాసుని బ్రహ్మోత్సవాల కోసం ప్రత్యేకంగా వ్రాసి స్వరపరచ బడిన గీతం అనుకుంటాను. ఈ పాట చాలా బాగుంది. పాడిన వారు టిప్పు ,హరిణి. రచయిత, సంగీత దర్శకుడు ఎవరో తెలియలేదు.  This is a beautiful composition with very good lyrics. 

చరణం లో సాహిత్యం ఎంతో బాగుంది.

------------

చింతామణి మించిన సౌదామిని కాంతుల వెలిగేటి దేవుడు వేదవేద్యుడు 

వదనము విధుబింబమై మధురోహల మూలమై మదిమదిలో కొలువుతీరి మన మొక్కులు తీర్చుచు

చంద్రప్రభ వాహనమున చక్కనయ్య కనరో ఉపేంద్రుడై ఊరేగే ప్రియమాధవుడిదిగో 

------------

2) కోపం వస్తే మండుటెండ మనసు మాత్రం వెండికొండ  వాన మబ్బు లాంటి వాటం నీదయా ( తారక రాముడు - 1997- కోటి - సీతారామ శాస్త్రి - బాలు - చిత్ర )

చక్కని పాట. పాట పల్లవి  ఆకట్టుకుంటుంది. కోటి సంగీతం చాలా బాగుంది. సౌందర్య, శ్రీకాంత్ జోడీ బాగుంది. 

ఈ రాగం లో నా all time favourite పాట

మన్మథ లీల చిత్రం లోని హలో మై డియర్ రాంగ్ నంబర్ - ( 1976 - బాలు, ఎల్ ఆర్ ఈశ్వరి, ఎం.ఎస్. విశ్వనాథన్, ఆత్రేయ).బాలు, ఎల్. ఆర్. ఈశ్వరి గారు అద్భుతం గా పాడారు. Beautiful tune. 

అందెలరవమిది పదములదా (స్వర్ణ కమలం) ధర్మావతి రాగంలో ప్రాచుర్యం పొందిన పాట.

శ్రీ పూర్ణిమ కృష్ణ ఈమని - వేణుగానం - భజన సేయ రాదా ( మైసూరు వాసుదేవాచార్య కృతి ) . చెవులకి ఇంపుగా ఉంది.

ఆనంద భైరవి చిత్రం లో చైత్రము కుసుమాంజలి అనే అద్భుతమైన పాట ఉంది. ఈ పాటలో రమేశ్ నాయుడు గారు అమృత వర్షిణి, ధర్మావతి / రంజని రాగాలను చక్కగా ఉపయోగించాడు. వేటూరి సాహిత్యం, బాలు గానం అత్యుత్తమం గా ఉన్నాయి.

చైత్రము కుసుమాంజలి 

పంచమ స్వరమున ప్రౌఢ కోకిలలు

పలికే మరందాల అమృత వర్షిణీ.


వేసవిలో అగ్నిపత్రాలు రాసే

విరహిణి నిట్టూర్పులా కొంత సాగి

జలద నినాదాల పలుకు మృదంగాల

వార్షుక జలగంగలా తేలిఆడే 

నర్తనకీ, కీర్తనకీ, నాట్య కళాభారతికీ 

చైత్రము కుసుమాంజలి 


శయ్యలలో కొత్త వయ్యారమొలికే

శరదృతుకావేరి లా తీగ సాగి

హిమజల పాతాల, సుమశర బాణాల

మరునికి మర్యాదలే చేసి చేసి చలి ఋతువే, 

సరిగమలౌ నాద సుధా మధువనికీ

చైత్రము కుసుమాంజలి 

ఎంత గొప్ప సాహిత్యం. వేటూరి గారు🙏












Saturday, November 5, 2022

సింధుభైరవి - నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి

కాలం తెలిసి ఆగిపోవడం తెలియకుండా  పరుగులు తీయడం ఒకేసారి జరిగితే ?

మనసు బరువెక్కడం తేలికపడటం రెండూ ఏకకాలం లో జరిగితే ?

హృదయం మంచు ముద్దలా ఘనీభవించి అంతలోనే కరిగిపోతే ?

సింధు భైరవి రాగానికి ఈ శక్తి ఉంది. There is some mystic ethereal transcendental quality to this ragam. 

ఆకాశం లాగా ఉందో లేదో తెలియనట్టు ఉంటుంది. ఘటం లో ఆకాశం , ఆకాశం లో ఘటం ఏకకాలం లో ఉన్నట్లు.

ప్రముఖ హిందూస్తానీ సంగీత విదుషీమణి శ్రీమతి అశ్విని భిడే గారి గానం ఇందుకు ఒక నిదర్శనం. మహా గాయకురాలు కీ. శే. కిశోరి అమోంకర్ , అశ్విని భిడే గార్ల గానం అనుభవైక వేద్యం.

హిందుస్తానీ సంగీతం లో ఈ రాగం భైరవిగా చెబుతారు. హిందూస్తానీ సంగీతం కచేరీ లలో భైరవి రాగం కచేరీ ముగింపులో పాడటం సంప్రదాయం గా ఉంది.

This raaga lends itself to many variations and embellishments. 

ముద్దబంతి పూవులో మూగకళ్ళ ఊసులో ఎనక జనమ బాసలు ఎందరికి తెలుసులే. 

పాటలో ఉన్న immortal words ' నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి'. సింధు భైరవి రాగానికి కూడా అన్వయిస్తాయి అనిపిస్తుంది.

అలాగే కనులు తెరచినా నీవాయే నే కనులు మూసినా నీవాయే (పింగళి) - ఈ మాటలు కూడా సింధు భైరవికి సరిపోతాయి 

అలతి పదాలలో అనల్పమైన అర్థాలను చెప్పడం ఆత్రేయ లాగా ఎవరూ చేయలేరేమో.

'ఈ జీవన తరంగాలలో ' పాట  ఆత్రేయ  వ్రాసిన విధానం అనితర సాధ్యం.  brevity of words + gravity of meaning. (ఈ పాట సింధు భైరవి లో లేదు ) ఈ పాట లోని భావాలు మనసుపై చెరగని ముద్ర వేస్తాయి. 

He has this uncanny ability to convey profound meaning in  simple words. ఆత్రేయ గారు. 

సింధు భైరవి రాగం ఆధారం గా చేసుకొని స్వరపరచిన రెండు మంచి  పాటలు

1) వలయోసై (ఇళయరాజా - ఎస్పీ బాలు - లతా మంగేష్కర్). This is a song forever. All-time classic. Legends come together to deliver a masterpiece.

2) మిలే సుర్ మేరా తుమ్హారా - (iconic song on Doordarshan which presented a kaleidoscopic vision of the Indian languages music and cultures through renowned artistes).

ఎన్నో మంచి గీతాలు సింధు భైరవి రాగం లో ఉన్నాయి. అయితే ప్రధాన వాగ్గేయకారుల కృతులు  ఈ రాగం లో  లేవు.

ఈ రాగం pathos కు బాగా సూటవుతుంది. అయితే ఒక కామెడీ పాటకు కూడా ఈ రాగం ఉపయోగించడం  జీవిత చక్రం చిత్రం లో వినవచ్చు. This is one of my all-time favourite songs.

సువ్వీ సువ్వీ చూడే ఓలమ్మీ (జీవిత చక్రం - శంకర్ జై కిషన్ - సుశీలమ్మ -బాలు ).

ఈ కట్టెను కట్టెలు కాల్చక మానవు

ఆ కన్నీళ్లకు చితి మంటలారవు.

- unbelievable and unforgettable lyrics by athreya. They haunt us and gnaw at the heart.