Saturday, July 11, 2026

విఖ్యాత గాయని ఎస్ జానకి గారు అస్తమయం



మహా గాయకురాలు, సహజ  మధుర సినీ నేపథ్య గాయని ఎస్ జానకి గారు నిన్న  11-7-2026 సాయంత్రం మైసూరు నగరంలో ప్రశాంతంగా 88 సంవత్సరాల జీవిత యాత్ర ముగించారు.  ఆమె కొన్నేళ్లుగా మైసూరులో నివసిస్తున్నారు అని తెలుస్తుంది.

One of the all time greats. Legend in the true sense. 

దక్షిణ భారత దేశంలో అతి గొప్ప సినీ నేపథ్య గాయనిగా  సుశీల గారు జానకి గారు సుస్థిర స్థానం పొందారు. We are fortunate to be born in the era of these legends. వారు ఇరువురు తెలుగింటి మహిళలు అన్నది తెలుగు వారికి ప్రత్యేకమైన ఆనందం కలిగిస్తుంది.

ఆమె 1957 వ సంవత్సరంలో తొలి పాట పాడారు. 60 -70 లలో సుశీలగారు peaks లో ఉన్నారు. తెలుగు తమిళం లో విశేషించి సుశీల గారు ఎక్కువగా పాడారు. Slowly  Janaki garu came into her own. మలయాళ, కన్నడ సినీ రంగాలలో ఆమె విశేష ఆదరణ పొందారు. 

76 సం.లో ఇళయరాజా అన్నక్కిళి చిత్రం మొదలుకుని ఆమె నేపథ్య గాయనిగా విజృంభించారు. కన్నడ రంగం లో  సంగీత దర్శకులు  రాజన్ నాగేంద్ర, ఎం. రంగారావు, తమిళంలో ఇళయరాజా, MSV సంగీతం లో ఆమె ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు. 80 లలో ఆమె నెంబర్ వన్ గాయనిగా రాణించారు. 

ముఖ్యంగా ఎస్ జానకి - ఎస్. పి బాలు కలయికలో ఎన్నో మధుర యుగళ గీతాలు వచ్చాయి. Especially the duet songs in their combination under the baton of of Rajan Nagendra and Ilayaraja are considered as evergreen classics. Pure gold.

I always believe that great singers elevate even an average song. Whereas average singers spoil even a great composition.

SPB - SJ కలిసి పాడిన మలరే మౌనమా, కీరవాణి, హొస బాలిగే...  ఇలాంటి పాటలు timeless classics గా నిలిచిపోయాయి.

70-80 ల సినీ సంగీతపు స్వర్ణయుగం లో సుశీల, జానకి, బాలు, జేసుదాసు, వాణీ జయరాం, జయచంద్రన్ గార్లు అతి ముఖ్యమైన పాత్ర పోషించారు 

జానకి గారు మలయాళ సినీ పరిశ్రమలో జేసుదాసు, జయచంద్రన్ గార్లతో కలిసి కొన్ని వందల మధుర గీతాలు పాడారు. కేరళ రాష్ట్రంలో జానకి గారిని అభిమానులు ఆరాధిస్తారు.

పగలే వెన్నెల, ఈ పగలు రేయిగా, జయమీవే జగదీశ్వరి, నడిరేయి ఏ జాములో, నీ లీల పాడెద దేవా, సిరిమల్లె పూవల్లే నవ్వు...

శంకరాభరణం, సప్తపది, ఆనంద భైరవి, సాగర సంగమం, స్వాతిముత్యం, అన్వేషణ, సితార, ఆలాపన, నీరాజనం, శ్రీ సాయి మహిమ, ఆత్మ బంధువు, ఆరాధన ... ఈ చిత్రాలలో జానకి గారు పాడిన గీతాలు అజరామరం. తన గాత్రంలో సహజంగా వినిపించే శృతి, మాధుర్యం  ఆమెకు దేవుడిచ్చిన వరం.

As an individual also she comes across as a very likeable person. Very affable and down to earth in nature.

ఆమెకు తెలుగు వారికి మించిన అభిమానులు మలయాళ, కన్నడ, తమిళ రంగాలలో  ఉన్నారు. 

నా అంచనా ప్రకారం ఆమె దాదాపు 8000  సినిమా+ ఇతర పాటలు పాడి ఉంటారు. Some sources report a higher number though. 

శాస్త్రీయ సంగీతం విశేషంగా అధ్యయనం చేయక పోయినా జానకి గారు క్లిష్టమైన లలిత శాస్త్రీయ గీతాలు పాడిన తీరు అద్భుతం. కున్నకూడి వైద్యనాథన్ వంటి విద్వాంసులు కూడా ఆమె ప్రతిభను ప్రశంసించారు. 

I doubt whether we can ever see the singers of such calibre in future. 

Though I am a die hard fan of Susheela garu, I have immense respect and liking for S Janaki garu also. 

నీరాజనం చిత్రం లోని ఈ గీతం ' ఘల్లు ఘల్లున గుండె ఝల్లన' నాకు ఎంతో ఇష్టం. I think Janaki garu was outstanding in this song. 

జానకి గారి పాటలు కలకాలం నిలిచి ఉంటాయి.

🙏🙏🙏



Sunday, July 5, 2026

ఒక మధుర ప్రేమ గీతం - Joy of Love


🎷🪉🎻 మధురమైన ప్రేమ గీతాలు ఎప్పుడైనా వింటూ ఉంటే మనసు refresh అవుతుంది. 

అలాంటి ఒక మంచి పాట ఇటీవలే విన్నాను. 

Late 70s, 1980ల కాలం లో కన్నడ  సినిమా పాటలు బాగా వినేవాడిని. 90 s తరువాత చాలా తక్కువగా విన్నాను.

యువరత్న అనే కన్నడ చిత్రం (2021)  లోని యుగళ గీతం  నీ నాదెనా (తమన్ సంగీతం, అర్మాన్ మాలిక్, శ్రేయ ఘోషల్ గానం) 

A soothing melody  beautiful to listen and see. Well composed by Thaman and sung well. Shreya Ghoshal is probably the best singer of this generation. 

Beautiful Lovers singing in a setting of Falling maple leaves, frozen lakes, on a mediaeval yacht, dancing in snowflake showers. 
 
పచ్చిక బయళ్ళలో, వెండి మబ్బులలో, మంచు జల్లులలో, పండు వెన్నెలలో మధుర ప్రేమ గీతాలు పాడుకుంటారు.

........💕💑💕

Love is the Force which Sustains the Universe, the creation. 

Or is it the universal life force which engenders love between the two genders ?

The force operates on many fronts, on  different species but finds the finest expression among human beings.

Lovers experience the Joy of Love with a fond hope for Joy of Life.

........🫶💞

Late పునీత్ రాజ్ కుమార్ (1975-2021). కన్నడ కంఠీరవ కీ. శే. డా. రాజ్ కుమార్ గారి చిన్న కుమారుడు. కన్నడ చిత్ర రంగం లో పవర్ స్టార్ గా అశేష మైన యువ అభిమానులు కలిగిన ప్రతిభ కల నటుడు. అప్పు అని అభిమానులు పిలుచుకుంటారు. స్ఫురద్రూపి. అద్భుతమైన డాన్సర్. బాలనటుడు గా అనేక చిత్రాలలో నటించాడు. భక్త ప్రహ్లాద కన్నడ చిత్రం లో హిరణ్య కశిపుని పాత్రలో డా. రాజ్ కుమార్ ప్రహ్లాదుడి పాత్రలో పునీత్ నటించారు. ఇతని అన్న గారైన శివ రాజ్ కుమార్ కన్నడ సినీ రంగంలో సూపర్ స్టార్ గా కొనసాగుతున్నాడు.

పునీత్ 46 సంవత్సరాల చిన్న వయసులోనే 2021 సంవత్సరంలో గుండె పోటుతో మరణించాడు. కన్నడ సినీ అభిమానులకు ఈ విషాద సంఘటన ఎంతో  బాధ కలిగించింది.

Difficult to believe that Puneeth passed away at a young age. 

He was very popular not only as an actor but also as a good human being with Dharmic nature.

He lives on in the memory of fans and admirers. Superstars never fade. Stay right up there in the sky.⭐





Friday, June 5, 2026

మామిడి పండ్ల సీజన్ - మధురం మధురం

🥭🥭🥭🥭

"వన్నెగలరు పసుపు వర్ణాల పండు,
కమ్మనైన వాసనల ఈ పండు,
తియ్యనైన తియ్యటి రసమిచ్చు పండు,
మామిడి పండు మన జాతీయ పండు!" (From Google)

🥭🥭🥭

మామిడి పండ్లు అయినా మల్లె పూలు అయినా ఎండా కాలంలోనే సహజంగా సీజనల్ గా దొరుకుతాయి. 

ఎన్నో దశాబ్దాలుగా మామిడి పండ్లు తింటూనే ఉన్నాము. ఈ ఏడాది కొంచెం ఎక్కువగానే తింటున్నాము.

కృష్ణ, గుంటూరు, ప్రకాశం,  గోదావరి జిల్లాలలో  మంచి పండ్లు, అనేక రకాలు దొరుకుతాయి. రాయలసీమ ప్రాంతంలో బంగినపల్లి ఎక్కువగా ఇష్టపడతారు. నేను అనంతపురం లో నివసించినప్పుడు బంగినపల్లి తప్ప మరొక రకం తెలియదు.

హైదరా బాదులో కూడా మంచి పండ్లు బాగానే లభిస్తున్నాయి. 

🥭🥭🥭

బంగిన పల్లి రకం - king of mangoes. అయితే మే 15 తరువాతే కొనడం మంచిది. అంతకుముందు రుచి చూస్తే పైకి పచ్చగా లోపల చప్పగా లేక పుల్లగా ఉంటాయి. 

బంగిన పల్లి రకం లో ఉలవ పాడు వి నంబర్ వన్ పండ్లు. మరే ఇతర పండు దీనికి సాటి రాదు అని ఘంటా పథం గా చెప్పవచ్చు.

🥭🥭🥭

హైదరాబాదులో మే మొదటి వారం నుంచి దశేరి రకం దొరుకుతాయి.చాలా బాగుంటాయి. పైకి ఆకుపచ్చ లేదా లేత పసుపు రంగు లో చిన్నవిగా కోలగా ఉంటాయి. 

అయితే ఉత్తర ప్రదేశ్  పంజాబ్ రాష్ట్రాల్లో జులై ఆగస్టు నెలలలో పెద్ద దశేరీ పండ్లు వస్తాయి. చాలా బాగుంటాయి.

🥭🥭🥭

చెరుకు రసాలు రకం హైబాద్ లో ఇటీవల బాగా వస్తున్నాయి. Evergreen variety with minimum guarantee. చెరుకు పానకం లాగా  చాలా బాగుంటాయి. 

🥭🥭🥭

ఈ సారి కేసర్ రకం పండ్లు కూడా బాగా వచ్చాయి అవి కూడా చాలా బాగున్నాయి.

🥭🥭🥭

ఇక పెద్ద రసాలు, చిన్న రసాలు, నూజివీడు రసాలు మంచి క్వాలిటీ దొరికితే అద్భుతంగా ఉంటాయి. అయితే ఒక్కోసారి పుల్లగా ఉంటాయి

🥭🥭🥭

కొత్తపల్లి కొబ్బరి రకం ఇక్కడ అంతగా దొరకదు ఖరీదు కూడా ఎక్కువ. చాలా బాగుంటుంది. ఇది రెండువిధాలుగా  ఉపయోగపడుతుంది. ఆవకాయకు నంబర్ వన్ రకం.  పీచు పులుపు బాగా ఉంటుంది . పండుగా మారితే కూడా  చాలా మధురంగా ఉంటుంది.

🥭🥭🥭

ఇమామ్ పసంద్ రకం పీచు అనేది ఉండదు బాగా పండితే ఐస్ క్రీమ్ లాగా నోటిలో కరిగిపోతుంది. బాగుంటుంది.

ఉత్తర భారతం రకాలు కేసరి,  langara , మల్లికా, కర్ణాటక వారి బాదామి కూడా బాగానే ఉంటాయి.

ఈ సారి పంచదార కలశ రకం కూడా రుచి చూసాను.

🥭🥭🥭

మహారాష్ట్ర వాళ్ళు Alphonso రకం మామిడిపండ్లకే రారాజు అంటారు. చాలా ఖరీదైన రకం. నేను ముంబాయి వెళ్ళినప్పుడు ఒక పెట్టే కొన్నాను. రుచి  నాకు అంత గొప్పగా అనిపించలేదు. అయితే export quality పండ్లు చాలా బాగుంటాయి అని విన్నాను.

🥭🥭🥭

మా ఇంటి ముందు ఒక మామిడి చెట్టు ఉంది. అది ఏమి రకము అర్థం కాదు. ఏటా కాయలు బాగానే కాస్తుంది. పులుపు ఉండదు. అయితే పండితే మాత్రం ఒక మోస్తరు రుచి ఉంటుంది. నీలం పండు అయి ఉండవచ్చు. 

సీజన్ అయిపోతుండగా కలెక్టర్ కాయలు లేదా తోతాపురి వస్తుంటాయి. ముక్కలు చేసుకుని ఉప్పు కారం వేసుకుని తింటే బాగానే ఉంటాయి. కొంతమంది వీటితో  బెల్లం అవకాయ చేస్తారు అని తెలుస్తుంది. జ్యూస్ లకు, తాండ్ర చెయ్యటానికి కూడా ఉపయోగిస్తారు.

ఇప్పుడు బంగినపల్లి రూ. 50 -70 , రసాలు -  70-80 అలా దొరుకుతున్నాయి. అయితే సీజన్ మొత్తానికి ఆవకాయ, మాగాయ,  మామిడి పళ్ళ ఖర్చు వేల రూపాయలు అవుతోంది.

ఎన్ని  రకాల పండ్లు ఏడాది పొడుగునా దొరికినా మామిడి పండ్ల సీజన్ కోసం అందరూ ఎదురు చూస్తారు. వేసవి లో  నెయ్యి వేసుకుని ఆవకాయ అన్నం , మామిడికాయ పప్పు,  పెరుగు అన్నంలో లేదా విడిగా మామిడి పండు తినడం కంటే ఇంకేమి కావాలి. 

 🥭🥭🥭🥭

Sunday, May 10, 2026

అది నుంచి అంతం దాకా

ప్రశ్న - సృష్టి క్రమాన్ని నీకు అర్థమైన రీతి లో వివరింపుము. 

సమాధానం --

ప్రతి బుద్ధి జీవికి తన అవగాహన లేదా సామర్థ్యం మేరకు సృష్టి పైన లేదా సృష్టి కర్త పైన ఒక అభిప్రాయం లేదా నమ్మకం ఉంటుంది. అది కాలం గడిచే కొద్దీ జీవిత అనుభవాల వల్ల లేదా ఇతరత్రా సాధనల వల్లనో fine-tune అవుతుంది లేదా మారుతూ ఉంటుంది. మరణించే సమయానికి ఏ మేరకు పరిపక్వత వచ్చిందో అది కొనసాగింపుగా తదుపరి జన్మ వస్తుంది. పై లోకాలకు పురోగమనం లేదా క్రిందిలోకాలకు అది తిరోగమనం కూడా కావచ్చు. సనాతన ధర్మం లో జన్మించిన వారికి సాధారణంగా ఇలాంటి విశ్వాసం ఉంటుంది.

ఇవన్నీ నా స్వంత ప్రతిపాదనలు కావు. నా తెలివికి ఇంతవరకు అర్థమైన విషయాలు అంటే సరిపోతుంది. జీవితం ముగిసే నాటికి ఈ అభిప్రాయాల్లో మార్పులు రావచ్చు. 

---

ఒక వ్యక్తి లేదా సమూహం లేదా దేశం దగ్గర అపారమైన లేక ఎంతో కొంత వనరులు, శక్తి ఉన్నాయి అనుకుంటే అవి ఊరకే ఉండలేవు. తమ తమ శక్త్యనుసారం మంచో చెడో ఏదో ఒక పని చేయడం ప్రారంభిస్తాయి. సహజం గానే ఇతర వ్యక్తి, సమూహం లేదా దేశం పైన ఆ ప్రభావం ఉంటుంది. అయితే వీటి శక్తి ఎంత ఉన్నా చివరికి పరిమితం, స్వార్థ పూరితంగా ఉంటుంది. ప్రపంచంలో ఇది ప్రతి జీవికి అనుభవంలో ఉన్న విషయమే.


భూమిపై ఉన్న అల్ప శక్తులే ఇంత ప్రభావం చూపుతుంటే...

నిజానికి సృష్టికి పూర్వం ఏమి జరిగింది.

అన్నిటి కన్నా పెద్దదైన అపరిమితం అనంతం అయిన బృహత్ శక్తి - అంటే బ్రహ్మ చైతన్యం మరి ఊరకే ఉంటుందా ? 

ఆ చైతన్యం లో ఒక కదలిక వచ్చింది.

చిత్ర విచిత్రాలుగా శాఖోప శాఖలుగా, కోటానుకోట్లుగా అనంత విశ్వాన్ని అందులో పంచభూతాలను ఆదిగా, నక్షత్ర గ్రహ తతులను, ఒకానొక భూమి అనే గ్రహంలో 84 లక్షల రకాల జీవ రాశులను సృష్టి చేసింది. లేదా అద్వైత భాషలో తానే అలా విభిన్న రూపాలలో పరిఛ్చిన్నమై కనిపించింది అని అనుకుందాము. అనంత విశ్వం లో జీవరాసులు ఉన్న ఇలాంటి గ్రహాలు ఎన్ని సృష్టి జరిగాయో అందులో జీవులు ఎలా ప్రవర్తిస్తున్నారు మనకు తెలియదు.


సృష్టికర్త చేసిన అలాంటి ఒకానొక విశ్వం లో ఇసుక రేణువు వంటి భూమిపైన జన్మించిన మానవుడికి విశ్వ చైతన్య శక్తి అతి సూక్ష్మ స్థాయి లో కట్ట బెట్టింది. 


అక్కడ మొదలు అయింది. ఇక చైతన్య శక్తి ఎంతో కొంత స్థాయిలో ఉన్న జీవరాసులు ఇక బిజీ గా మారిపోయాయి. వాటిలో బుద్ధి అనే faculty అదనంగా ఇవ్వడంతో ఇక మానవుడు విశేషంగా పనులు మొదలు పెట్టాడు. 


మానవుడు అనాదికాలం నుంచి ఇప్పటిదాకా నిర్విరామంగా ఏవో పనులు చేస్తూనే ఉన్నాడు. భూమి మీద లేదా అందిన మేరకు విశ్వంలో ఉన్న వనరులు ఎన్ని విధాలుగా ఉపయోగించుకోవాలో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఎంతైనా ఆ తానులో ముక్కే కనుక చాలా విషయాలలో ఎంతో కొంత విజయం సాధించాడు. తోటి జీవ రాశులను ఉపయోగించు కున్నాడు, హింస పెట్టాడు, ప్రేమగా చూసుకున్నాడు, ఉదాసీనంగా ఉన్నాడు. కుటుంబ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాడు. 


భౌతిక ప్రపంచంలో జీవ యాత్ర సాగిస్తూనే మనోమయ ప్రపంచం కూడా సృష్టి చేసుకున్నాడు. 


ఎంత చేస్తున్నా ఏదో అసంతృప్తి. ఇంకా ఏదో చెయ్యాలి అనే తపన. 


ఉదర పోషణార్థం ఉద్యోగంతో పాటు

కళలు, క్రీడలు, దేవుడు (ళ్ళు), ఆరాధనా పద్ధతులు, సాహిత్యం, సంగీతం, సమాజ సేవ...ఇలా అసంఖ్యాకమైన కార్య కలాపాలలో నిమగ్నమై ఉంటాడు. తన వారు అనుకుంటే ఎంతో కొంత మంచి చేస్తాడు. పరాయి వాడు అంటే బాధించేందుకు వెనుకాడడు.


విశ్వ చైతన్య శక్తి దృష్టిలో మానవుడి వంటి సూక్ష్మ జీవులు అజ్ఞానంతో చేసే పనులు చూసి ' ఇచ్చిన అమూల్యమైన శక్తి ని సద్వినియోగం చేసుకోండిరా ' అని అంతర్వాణి రూపం లో సృష్టి కర్త చెబుతుంటాడు. వినీ విన్నట్టుగా మనిషి తన పని తాను చేస్తుంటాడు. పరిస్థితి చేయి జారినప్పుడు, దుష్ట స్వభావులు పెరిగినప్పుడు - సృష్టి కర్త తానే స్వయం గా అవతరించి వస్తాడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తాడు.  కొన్ని సందర్భాలలో సద్గురువులను పంపిస్తాడు. అప్పుడు జనం కొంత కాలం బాగుంటారు. తరువాత మళ్ళీ అదే అజ్ఞానం లో మునిగి తేలుతుంటారు.


కర్మలను అనుసరించి మానవుడు క్రింది లేదా పై లోకాలకు ప్రయాణం చేస్తుంటాడు. క్షీణే పుణ్యే మళ్ళీ భూమి మీదకు వచ్చి పడతాడు. 


యుగాలు గడిచిపోయాయి. మనిషి ఆలోచనలలో ప్రవర్తనలో పెద్దగా మార్పు రావడం లేదు. ఎవరో కొంతమంది బహూనామ్ జన్మనామ్ అంతే - తమ సాధనల ఫలితంగా ఈ సృష్టిచక్రం వ్యవహారం అర్థం చేసికొని మోక్షం పొందుతారు. తక్కిన వారు అవిద్యాసుఖాన్ని అజ్ఞానమే ఆనందంగా అనుభవిస్తుంటారు. 

చూసి చూసి సృష్టి కర్తకు చివరకు విసుగు వస్తుంది. 

ఇంక చాలు అనిపిస్తుంది. ' మీరు మారర్రా ' అని సృష్టి మొత్తాన్ని తనలో లయం చేసుకుంటాడు. 

ఒక్కసారి ఆయన తన నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం లోకి వెళ్ళిపోతాడు.

కొయ్య బొమ్మలు మాయమై పోయి కొయ్య మిగిలిపోతుంది.

మరలా ఆయనకు లేదా ఆ అఖండ చైతన్య శక్తికి సంకల్పం కలిగి దలిక వచ్చే వరకు తురీయ స్థితి లో ఉంటాడు.(ఉంటుంది)








Saturday, March 21, 2026

చారుకేశి రాగం లో రెండు మధుర గీతాలు

 రెండు మంచి పాటలు విందాము.

1) సెందూర పాండిక్కొరు - (సెందూర పాండి చిత్రం 1993 - సంగీతం దేవా - SPB చిత్ర.)

పాట సూపర్ గా ఉంది. శాస్త్రీయ రాగం ఆధారంగా మంచి melody + rhythm ఉంది. దేవా సంగీతం + SPB చిత్ర గానం + విజయకాంత్ గౌతమి నృత్యాలు + చిత్రీకరణ అన్నీ చక్కగా కుదిరాయి. Violins and Flute bits are very impressive.


2) మయంగినేన్ సొల్ల తయంగినేన్ -( నానే రాజా నానే మంతిరి 1985 - ఇళయరాజా - p సుశీల జయచంద్రన్ )

కెప్టెన్ విజయకాంత్ రాధిక జీవిత ఈ పాటలో నటించారు.

మంచి పాట. సుశీల జయచంద్రన్ గారు కలిసి పాడిన పాటలు అన్నీ సూపర్ హిట్లు . 

ఇదే పాట బాణీ అనేక సంవత్సరాల తరువాత తెలుగులో ప్రతిదినం నీ దర్శనం అన్న పాటలో వినిపించింది.

అప్పుడప్పుడు ఇలాంటి మంచి పాటలు వినడం బాగుంటుంది కదా. 




Saturday, February 14, 2026

గౌరి మనోహరి రాగం ఆధారంగా ఒక మధుర గీతం


ఒక్కసారి పాత ఫోటో ఆల్బమ్ బయటికి తీసి తుడిచి అందులోని ఫోటోలు చూస్తే కలిగే అనుభూతి బాగుంటుంది.

అలాగే కొన్ని classic పాటలు గుర్తు చేసుకుని చాలా రోజుల తరువాత వింటే కలిగే ఆనందం కూడా బాగుంటుంది.

నేను బాగా అభిమానించే రాగం గౌరిమనోహరి. ఈ రాగం లో కొన్ని మంచి సినీ గీతాలు ఉన్నాయి. 

ఈ అంశం పైన నేను గతంలో (2010)  వ్రాసిన బ్లాగ్ పోస్టు ఇది.

ఈ రాగం ఆధారంగా ఉన్న కొన్ని తెలుగు పాటలు.

--------

కన్నుల దాగిన అనురాగం - రంగుల రాట్నం

వెన్నెల్లో గోదారి అందం - సితార

ఒక వైపు ఉర్రూతలూపు కవనాలు  చరణం - శిలలపై శిల్పాలు చెక్కినారు పాటలో - మంచి మనసులు

నీ జిలుగు పైట నీడ లోన - పూల రంగడు

పరువపు వలపుల సంగీతం, ఎవరో రావాలి పాటలు కూడా చాలా బాగుంటాయి.

--------

గౌరి  మనోహరి రాగం లో మరొక మధురగీతం (తమిళం) ఉంది.

కణ్ణా వరువాయా మీరా కేట్కిరాళ్ - మనదిల్ ఉరుది వేండుమ్ -  1987 ఇళయరాజా, జేసుదాసు, చిత్ర. - కె బాలచందర్.

Beautiful song. సంగీతం, గాయకులు, పాట చిత్రీకరణ, నటులు, సాహిత్యం,దర్శకత్వం, ఛాయాగ్రహణం,  అన్నీ చక్కగా కుదిరాయి.  జేసుదాస్, చిత్ర గారు అద్భుతంగా పాడారు. సుహాసిని, శ్రీధర్ అభినయం నాట్యం, చిత్రీకరించిన ప్రదేశం ఒక మంచి అనుభూతిని కలిగిస్తాయి. శ్రీధర్ గారు శాస్త్రీయ నృత్య కళాకారుడు కావడం వల్ల ఈ పాటకు మరింత అందం చేకూరింది. విశ్వనాథ్ గారి శైలిలో ఉన్న చిత్రీకరణ చాలా బాగుంది.

స్వర్ణకారుడు బంగారం ఉపయోగించి అందమైన ఆభరణం చేసినట్టు గౌరిమనోహరి రాగం ఆధారంగా ఇళయరాజా ఒక అద్భుతమైన గీతం అందించాడు. ఆయన సంగీతం ఇచ్చిన అత్యుత్తమ గీతాలలో ఈ పాట నిలిచి ఉంటుంది. (Picture courtesy to the respective owners)


Tuesday, January 13, 2026

కీరవాణి lyrics + ఇళయరాజా సంగీతం - ఒక మధుర గీతం

గత ఏడాది షష్టి పూర్తి అనే సినిమాకు ఇళయరాజా సంగీతం అందించాడు. అందులో ,ఏదో ఏ జన్మ లోదో ఈ పరిచయం ' అనే పాట బాగుంది. We could see glimpses of vintage Ilayaraja in this song. 

సంగీత దర్శకుడు కీరవాణి ఈ పాటకు సాహిత్యం అందించాడు. ఈ పాటలో కొన్ని పదాలు మంచి భావుకత కలిగి ఉన్నాయి.

-----

తెరలు తెరలుగా తెరుచుకున్న తూరుపు ద్వారం

పొరలు పొరలుగా కరుగుతున్న నిశి భారం

------

అనన్య భట్ అనే గాయని ఈ పాట బాగా పాడింది.

కళ్యాణ వసంతం రాగం ఛాయలో ఈ గీతం ఉన్నట్టు అనిపిస్తుంది.