Wednesday, November 23, 2016

నగుమోము గనలేని మా జాలి తెలియని ఆబాలగోపాలమురళి

ద్విశతాబ్దగాయకుని మహాభినిష్క్రమణం జరిగింది. 86 వసంతాల జీవితం లో 80 ఏళ్ళు సంగీత వేదికను వీడని కళాకారుడు భూప్రపంచములో మరొకరు లేరు.  వారి నగుమోము, మృదు సంభాషణ, సున్నిత హాస్యభరిత ధోరణి, అన్నిటినీ మించి వారి గాత్రమాధుర్యం అభిమానులకు మిగిలిన జ్ఞాపకాలు. 

వారు ఠీవిగా నడిచివచ్చి 'భారత రత్న' పురస్కారం అందుకుంటుంటే చూడాలని ఎంతో ఆశ పడ్డాము. మనకిక ఆ అదృష్టం లేదు. భారత రత్న గౌరవానికి ఆయనకు మించిన అర్హులు లేనేలేరు. కనీసం మరణానంతరమైనా ప్రకటించి భారత ప్రభుత్వం ప్రాయశ్చిత్తం చేసుకుంటుందని ఆశిస్తాను. 

3 octaves range మాధుర్య, శ్రుతి లోపం లేకుండా సాధించిన ఏకైక గాయకుడు అంటే అతిశయోక్తి కాదు. 

నగుమోము, ఎందరో మహానుభావులు, త్యాగరాజ పంచరత్న కీర్తనలు , రామదాసు కీర్తనలు, తత్వాలు, తిల్లానాలు, రాగం తానం పల్లవి ...  ఆయన పాడితే వచ్చే నిండుతనం మరెవరికీ సాధ్యం కాదు.  

ఎందరో గొప్ప గాయకులు ఉన్నారు. Some have melody. Some have range. Some have immaculate sruthi. Some have good pronunciation. Some know how to regale audiences.  Some have creativity. Some bring out the essence of sahitya. Some sing with manodharma. Very few become trendsetters. Fewer artistes set benchmarks. Balamurali is the combination of all these qualities. He has the magical voice to mesmerise audiences.

 Another likeable trait is his openmindedness to all kinds of music genres. His classic jugal bandis with Pt. Bhim sen joshi are legendary.  He embraced and elevated film music as well. His voice was not fully utilized by the film industry. 

శంకరాభరణం, త్యాగయ్య, అన్నమయ్య వంటి చిత్రాలలో ఆయన పాడి ఉంటే ఎంతో బాగుండేది. It would have lent authenticity to the music. That was not to be. Maybe the film folks were diffident to approach a towering personality like him. 

During later stages of his career he wanted to be known as vaggekayara. He invented ragas and composed kritis. In my opinion they serve as new syllabus for advanced performers. 

ఆయన ఎన్ని కొత్త కీర్తనలు పాడినా రసికులు ' నగుమోము' లేదా 'ఎందరో మహానుబావులు' లేదా ' ఏమి చేతురా లింగా', 'పలుకే బంగారమాయెనా' కావాలని అడిగి పాడించుకుంటారు.  
బాలమురళి స్వరపరచిన 'తిల్లానా' లు 'thrillana ' లుగా పేరుపొందాయి. 

This youtube video has a rare gem of the concert he gave at Bombay to the accompaniment of the legendary performers Lalgudi and Umayalpuram in 1962. 
నగుమోము గలవానికి  నివాళిగా వారే వెలిగించిన అఖండజ్యోతి. 

mandolin శ్రీనివాస్, పినాకపాణి, నేదునూరి, బాలమురళి. . తెలుగునాట కర్ణాటక సంగీతానికి మరి దిక్కెవ్వరు?