Thursday, August 25, 2011

మోహనరాగమహా -మూర్తిమంతమాయే

మోహనరాగం. ఈ రాగం లోని పాటలు వింటే మనసు ఎంతో ఆహ్లాదకరంగా, సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా మారిపోతుంది. హాయిగా అనిపిస్తుంది. ఇట్టే ఆకట్టుకుంటుంది. గోవిందుడు అందరివాడేలే అన్నట్టుగా మోహనరాగం అందరికీ ఇష్టమైనదే. ఒకసారి కొత్తపాళీ గారి బ్లాగులో మోహనరాగాన్ని వంకాయకూరతో పోలికతెచ్చి ఎంతో బాగా వ్రాశారు.

సినీ గీతాలవరకూ చూస్తే మోహనం హిందోళం మమ్మీ డాడీ రాగాలు.

ఎన్నో వందలపాటలు స్వరపరచబడ్డాయి మోహనంలో.



అందరికీ తెలిసిన పాటలు కాకుండా రెండు కన్నడ పాటలు పరిచయం చేయాలనిపించింది నాకు. రెంటికీ స్వరకర్తలు రాజన్ నాగేంద్ర. వీరు జనరంజకంగా పాటలు కట్టడంలో సిద్ధహస్తులు.

’నన్న ఆశె హణ్ణాగి’అనే ఈ పాట ఒక చక్కని యుగళగీతం. బాలు గారి గొంతు ఎంతబాగుంటుందో మాటల్లో చెప్పలేను. ఈ పాట తరువాత తెలుగులో, తమిళంలో కూడా వచ్చింది. (విశేషమేమంటే బాలు కన్నడంలో జానకిగారితో, తెలుగులో సుశీలగారితో,అరవంలో వాణీ జయరాం గారితో ఈ పాట పాడారు. ఈ పాటలో నటించిన శంకర్ నాగ్ (అనంతనాగ్ తమ్ముడు) తరువాతి కాలంలో కారు ప్రమాదంలో చనిపోయాడు.). మూడు భాషలలోనూ, కన్నడపాటే ఉత్తమంగా ఉంది. బాలు గొంతుకోసమే ఈ పాట నేను చాలాసార్లు విన్నాను.

యుగళగీతం చివర్లో గాయనీ గాయకులు ఇద్దరినీ తప్పకుండా కలిపి పాడించటం రాజన్ నాగేంద్ర ప్రత్యేకత.

’జేనిన హొళెయో హాలిన మళెయో’ఈ పాట కన్నడ కంఠీరవ డా. రాజకుమార్ పాడినది. కన్నడ దేశపు ఔన్నత్యాన్ని తెలిపే ఈ పాటకూడా చాలా బాగుంటుంది.
రానా స్వరపరచిన పంతులమ్మ గీతాలు ఎంత బాగుంటాయో అందరికీ తెలుసును. ’సిరిమల్లె నీవె’ పాట చరణాల్లో కొన్ని అన్య స్వరాలు వచ్చినా మోహనరాగం ఆధారితమే.

పాటలు విన్నతరువాత మోహనమీ ప్రకృతి. మోహనమీ జగతి. అనిపిస్తుంది.

Friday, August 12, 2011

కళ్ళెత్తితే చాలు- కనకాభిషేకాలు

ఈ బంగారు నగల షాపువాళ్ళ ad లు ఎవరు తీస్తున్నారోగానీ చాలా సృజనాత్మకంగా lively గా ఉంటున్నాయి.

ఉద్యమం వార్తలు , పచ్చ మీడియా systematic గా చేసే character assassination కథనాలు, ఓదార్పు, వై యస్ బొమ్మల వార్తలు, ఇతర దరిద్రగొట్టు కార్యక్రమాల నుంచి చాలా relief గా అనిపించాయి (yeah. I took care to be politically correct) .

నాగార్జున కళ్యాణ్ జువెలర్స్ ad బాగుంది.


నేపథ్యంలో వచ్చే వేణువు చాలా నచ్చింది నాకు. లఘుచిత్రంలోనే ఒక చిన్నకథను చెప్పినట్టుగా చాలా బాగా తీశారు.


జూ ఎన్టీఆర్ మలబార్ గోల్డు
కూడా బానే ఉంది. తను మంచి సహజనటుడు. కానీ తను నటించే సినిమాలన్నింటిలోనూ నేలవిడిచి సాము చేసే పాత్రలే. ఆ సినిమాల్లో లేని సహజత్వం ఈ adలలో నాకు కనిపించింది. కొంచెం swagger తగ్గించుకుంటే ఇంకా బాగుండేది.




ఈ తనిష్క్ వారి glamgold ad భలేగా ఉంది. ముఖ్యంగా leading lady ఎంతో graceful గా ఉంది

కొంచెం గాయని సునీత పోలికలు ఉన్నాయి ఆమెలో.

నాకు ఈ ప్రచారచిత్రాలు నచ్చాయి. అంతే కానీ బంగారం కూడబెట్టే ఉద్దేశ్యమేవీ లేదు.

p.s. టపా శీర్షిక కొంచెం class ఎక్కువైనట్టుగా ఉంది.