Monday, July 24, 2023

భగవద్గీతా కించిదధీతా -1


భగవద్గీత కు ఎందరో మహానుభావులు వ్రాసిన అనేక తాత్పర్యాలు అనువాదాలు, వ్యాఖ్యానాలు, ప్రవచనాలు అందుబాటులో ఉన్నాయి.

శిష్ట్లా సుబ్బారావు గారు వ్రాసిన వ్యాఖ్యాన సహిత అనువాదం అనేక సంవత్సరాల క్రితం తితిదే వారు  ప్రచురించారు. ఈ పుస్తకం వ్రాసిన విధానం బాగుంది. సూటిగా స్పష్టంగా రచయితకు వివరణ ఇవ్వాలి అనిపించిన చోట మాత్రమే విస్తరిస్తూ, శ్లోకాలలో దాగిఉన్న భావాలను విశదీకరిస్తూ సాగుతుంది. లోతైన విషయాలను కూడా సులభగ్రాహ్యంగా వివరించడం జరిగింది.

ముఖ్యంగా సుబ్బారావు గారు వ్రాసిన ఉపోద్ఘాతం ఉన్నతంగా ఉంది.

భగవద్గీత కర్మ , భక్తి, జ్ఞాన మార్గాలలో ఏ మార్గాన్ని ఆచరించమంటుంది అన్న విషయాన్ని రచయిత వివరించిన తీరు సముచితంగా సమంజసంగా అనిపించింది.

భగవద్గీత లో శ్రీకృష్ణుడు అర్జునునికి ధర్మాన్ని కాపాడటం కోసం యుద్ధం చేయమని చెప్పడం వెనుక ఉన్న అంతరార్థాన్ని చక్కగా వివరించారు.

-------

A few thoughts.  As a commoner I expressed my views as per my current understanding. 

My observation is that our views get revised on knowing the higher truth. We should always be open to review and feedback. The journey continues. Or else we stop growing as a person.

-------

అహింసా పరమో ధర్మః అన్న వాక్యం సర్వసంగ పరిత్యాగులకు, సన్యాసులకు సర్వదా వర్తిస్తుంది. పాలకులకు, సామాన్య ప్రజలకు అన్ని వేళలా వర్తించదు. 

అకారణంగా జీవహింస చేయడం,ఇతరులను బాధించడం పాపం. అయితే, శత్రువుల నుండి, దుర్మార్గుల నుండి స్వీయ రక్షణార్థం, ప్రజల రక్షణ కోసం, దేశం కోసం, స్వధర్మ రక్షణ కోసం, కుటుంబ సభ్యులను కాపాడుకోవటానికి  యుద్ధం చేయడం, దుష్టులను దండించడం, నిర్జించడం తప్పుకాదు.

అధర్మ పరులను శిక్షించడం, ప్రజలను రక్షించడం అన్నది పాలకుల కర్తవ్యం. అలాగే తన స్వంత మనుషులను, కుటుంబ సభ్యులను రక్షించుకోవడం గృహస్థు ధర్మం.

మన పురాణాలు, ఇతిహాసాలు అన్నింటిలోనూ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ప్రధానమైన అంశంగా చెప్పబడింది.

Unfortunately the principle of non violence was misinterpreted during our independence movement. No doubt it is the highest ideal to be achieved. Not so while dealing with adharma. The ideal ordained for an ascetic can't be the same for rulers or householders. 

In fact Papam accrues to one who abdicates his responsibility to fight adharma. This is the essential teaching of Krishna in Bhagawad Geeta.

Krishna exhorts Arjuna to fight a dharmic battle by clearing Arjuna's misplaced sympathy and temporary delusion.

గీతను బాగా అధ్యయనం చేసిన కొంతమంది గొప్పవారు కూడా గీతాసారాన్ని గ్రహించలేక పోయారేమో అనిపిస్తుంది. 

20 వ శతాబ్దం నుంచి హిందువులను క్షాత్ర ధర్మం నుంచి దూరం చేశారు అనిపిస్తుంది.

Pacifism has been imposed on our collective psyche.

Paradox of intolerance.

"Philosopher Karl Popper described the paradox of tolerance as the seemingly counterintuitive idea that “in order to maintain a tolerant society, the society must be intolerant of intolerance.” 

అధార్మిక విశ్వాసాలను సహించడం, ఉపేక్షించడం, అధర్మ పరులను శిక్షించక  పోవడం వల్ల అంతిమంగా సమాజానికి తీరని నష్టం జరుగుతుంది.

Our constitution should have been based on Sanatana Dharma to protect our civilizational nation. Bhagawad Gita should have been our guiding text. Instead our political leaders adopted a pseudo secular approach which is the reason why Sanatana Dharma is facing existential crisis now. 

సార్వజనీన మైన, సార్వకాలీనమైన సత్యాలు, ఉపదేశాలు భగవద్గీతలో ఉన్నాయి. అందుకే దేశ,కాల, మత, ప్రాంత, వర్గ భావనలకు అతీతంగా భగవద్గీత వేల సంవత్సరాలుగా నిజమైన సత్యాన్వేషకులకు దిక్సూచిగా నిలిచింది . మార్గదర్శనం చేస్తుంది.

భగవద్గీత ఇహం, పరం రెండిటికీ ఉపయోగపడే ఉపదేశం ఇస్తుంది. వ్యక్తిగా ఎదుగుతూ సమాజ శ్రేయస్సు కోసం జీవించే విధానం చూపుతుంది.

అలాగే అద్వైత, ద్వైత, విశిష్టాద్వైత సిద్ధాంతాల మేలు కలయికగా అనిపిస్తుంది.

భగవద్గీతలో ఉన్న అనేక అమూల్యమైన సందేశాలు, వాక్యాల గురించి ఒక సామాన్యుడి దృష్టికోణంలో మరొక వ్యాసం వ్రాయాలి అన్న సంకల్పం ఉంది. 

కృష్ణం వందే జగద్గురుమ్ 🙏