Tuesday, March 28, 2023

పరుగు ఆపడం ఒక కళ (ల) - random thoughts

శోభన్ బాబు గారి మీద ' పరుగు ఆపడం ఒక కళ ' అనే మంచి శీర్షికతో ఒక పుస్తకం అప్పట్లో వచ్చింది. 

నిజమే. ఏదో ఒక దశలో ఇంక చాలు ఇక తప్పుకుంటాను అనుకోవడం మంచి నిర్ణయమే. ఉద్యోగం, వృత్తి, వ్యాపారం, నటన, క్రీడలు, ఇతర వృత్తులు, వ్యాపకాలలో తగిన సమయం లో చూసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. 

To firm up one's mind to call it a day is often not so easy for many.

Many a time  we deliberately fail to read the writing on the wall. People try to hang on well past their sell by date.

They will be either gradually ignored or gracefully shown the door or even  unceremoniously dumped.

ఈ పేచీలు లేకుండా చాలామంది ఉద్యోగులకు 60 - 65 ఏళ్లకు పదవీ విరమణ ఉంటుంది.

మరికొంతమందికి కంపెనీలు ' స్వచ్ఛంద ' పదవీ విరమణ లు ప్రకటిస్తాయి.

ఒకప్పుడు ఉద్యోగం వస్తే job for life అనుకునే వారు. ఇప్పుడు పరిస్థితులు వేరు. Voluntary retirements and layoffs seems to be the new normal.

ముఖ్యంగా రాజకీయ నాయకులు, సినిమా హీరోలకు retire అవ్వడం tire అవ్వడం ఇష్టం ఉండదు. వారికి అభిమానులు, అనుచరులు అంతగా అలవాటు అయిపోయి ఉంటారు. Lime light, prominenence, power,  influence లేని జీవితాన్ని ఇష్టపడరు అనిపిస్తుంది. అందుకే ఏదో ఒక విధంగా కొనసాగాలని అనుకుంటారు. Some actors and politicians are quite successful in prolonging their careers.

కొందరు సినిమా హీరోలు తమ చరిస్మా బలం తో రాజకీయరంగం ప్రవేశం చేస్తారు. అయితే the two professions need different sets of skills. Politics need a different  methodology. 

సినీ పరిశ్రమలో రాజకీయం, అలాగే రాజకీయ రంగంలో నటన  కూడా ఉంటుంది.

విరమణ అనేది  హీరోలు, రాజకీయ నాయకులకే కాక గాయకులు, సంగీత దర్శకులు, రచయితలు, కవులు, ఇంకా అనేక ఇతర రంగాలకు సంబంధించిన విషయం.

మన భారతీయ జీవన విధానం లో ఒక వయస్సు వచ్చాక తమ సంతానానికి బాధ్యతలు అప్పజెప్పి వానప్రస్థం స్వీకరించమని చెప్పారు. 

సరైన సమయంలో మలితరానికి పెద్దరికం అప్పజెప్పి తప్పుకోక పోతే తదుపరి జీవితంలో కుదుపులు తప్పవు.

Especially in respect of performing arts, one should definitely make a smooth transition from being a performer to a mentor.

వృత్తి విద్యా నిపుణులు, వైద్యులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, పాత్రికేయులు.. తమకు ఆసక్తి, ఓపిక, శక్తి ఉన్నంత కాలం పని చేస్తుంటారు. 

ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నవారు తమ తరువాతి తరానికి తమ skillsets అందించే ప్రయత్నం, మార్గదర్శకులు గా వ్యవహరించడం బాగుంటుంది. 

Inertia of motion is as powerful as inertia of rest.


Sunday, March 19, 2023

Vintage Ilayaraja music -సంగీత విభావరి - కొన్ని సంగీత కబుర్లు

ఇటీవల గచ్చిబౌలి లో జరిగిన సంగీత విభావరి లో మేస్ట్రో ఇళయరాజా ఇలా అన్నారు.

శ్రోతలు ఒక పాట విని ఆనందిస్తున్నారు. వినకముందు ఆ పాట ఎక్కడ నుంచి వచ్చింది? విన్న తరువాత ఏమైపోయింది ? అరె ఏమైందీ? ఈ మాటలు విన్నప్పుడు,

ఎందుకో గానీ పాట లాగే  జగత్తు కూడా  సృష్టికి పూర్వం లయకు పశ్చాత్ ఎక్కడ ఉంటుంది అనిపించింది. The time scales may differ but a song or the universe are similar in terms of ephemerality.

ఈ కార్యక్రమం లో కొన్ని మంచి పాటలు వినిపించారు. ముఖ్యంగా విభావరి జోషి అనే గాయని ఇంకా శ్వేత మోహన్ కార్తీక్ బాగా పాడారు అని నాకు అనిపించింది.

Even though we heard the songs many times, the freshness, melody, interludes and the fabulous singing have a lasting appeal for Ilayaraja music. 

1980-90 was the period he was in peaks. In later years he could not create the same kind of magic. Post 2000, his tunes were not so popular. 

అన్వేషణ చిత్రం లోని కీరవాణి చిలకలా కలకలా పాడలేదు పాట ఒక masterpiece. కీరవాణి రాగం లో ఉన్న సినిమా పాటల్లో అగ్ర తాంబూలం ఈ పాటకు చెందుతుంది.  కష్టమైన పాట. విభావరి జోషి బాగా పాడింది.

ఇళయరాజా ఓ ప్రియా ప్రియా పాట BGM compose చేసిన విధానం వివరించిన తీరు ఆకట్టుకుంది. కోరస్, వివిధ వాయిద్యాలు విడివిడిగా పలికించి ఆ తరువాత కలిపి ఒక్కటిగా వినిపించి నప్పుడు కలిగే అనుభూతి బాగుంది. 

Composing and synthesising different musical instruments is a complex job. If the final effect is pleasant it becomes a melody or else ends up as cacophony.

ఆస్కార్ అవార్డు పొందటానికి మాటే మంత్రము వంటి పాటను మించిన పాట ఉంటుందా .

Probably the Song of the century. 

ఏమైనా కార్యక్రమం లో SP బాలు గారు లేని లోటు కనిపించింది.

DSP ఇళయరాజా పై తనకు ఉన్న అభిమానాన్ని  చక్కగా చెప్పాడు.

It seems young people too came in sizeable numbers to view the show.

కొన్ని దశాబ్దాలుగా ఒక ఇళయరాజా అభిమానిగా కొన్ని observations 

1) పి సుశీల గారి తో ఎక్కువ పాటలు పాడించ లేదు అన్న అసంతృప్తి.

2) స్వయంగా తమిళం లో ఎన్నో పాటలు పాడారు. I don't think his voice is very pleasant. కొన్ని రకాల పాటలకు ఓకే. హీరోలకు సూట్ కాదు. అవే పాటలు బాలు లేదా జేసుదాసు గార్లు పాడి ఉంటే బాగుండేది.

3) he over used trumpet in many songs which is not a great instrument. Instead saxophone 🎷 would be better.

4) Due to overwork his music became repetitive and quality suffered in a few movies.

5) he could not adapt his music with modern trends. In this aspect I think Keeravani did well by reinventing his music.

Yes. We love Ilayaraja's vintage songs.  Probably the finest composer of Indian film music. A living legend 🙏




Tuesday, March 14, 2023

ఆధ్యాత్మిక అసహనం అసంతృప్తి - కొన్ని ఆలోచనలు


కొంతమంది ఆధ్యాత్మిక గురువులకు 

కోపం -తమ మార్గం వీడి వెళ్లిన వారిని చూచి.

ఉక్రోషం -తమను పట్టించు కోవడం లేదని

చులకన - శక్త్యానుసారం, స్వీయ  అభిరుచి ప్రకారం తమ తమ పంథాల్లో సాగే వారిని చూచి.

అహంకారం -తమదే నిజమైన మార్గం అన్న భావన వల్ల

నిస్సహాయత -తాము సామాన్య జనాలను మార్చలేక పోతున్నందుకు.

జాలి -అయ్యో ఇలా ఉన్నారేమిటి వీళ్లంతా అనుకుంటూ.

నిజానికి లోకం ఎప్పుడూ తన ధోరణి లో తాను నడుస్తుంది. ప్రకృతి తనదైన పద్ధతిలో సృష్టిని నడిపిస్తుంది. ఆరాటం, ఉబలాటం, ఆవేశం, అసంతృప్తి పెంచుకుంటే నిరాశ నిస్పృహ తప్పదు. 

గురువు మార్గం నచ్చి వారి వెంట నడిచే వారు ఉన్నారా ? మంచిదే. నచ్చకో, వీలుపడకో, శక్తి చాలకో, ఇంకొక మార్గం ఆకర్షించో తప్పుకున్నవారున్నారా ? అదీ మంచిదే.  శాపనార్థాలు, తిరస్కార భావం, దూషణలు అవసరం లేదు.

సాధనా బలం తో ఒక స్థాయి చేరుకున్నారు. అది ఎవరికి అందాలో వారికి తప్పక అందుతుంది. ఆరాటం దేనికి ? ఎవరి మార్గం లో వారు సాధన చేసుకుంటూ సాగిపోవడం ఉత్తమం. 

ఎన్నో జన్మలు కొనసాగే సాధన కొఱకు వేచి ఉండే ఓపిక సహనం లోకులకే కాదు గురువులకు కూడా ఉండాలి అనిపిస్తుంది. 

లౌకిక జీవనం లో తలమునకలు అవుతూ కొంత ఉపశమనం కోసం లేదా ఇతర కారణాలతో గుళ్ళు గోపురాలు దర్శిస్తూ పూజలు పునస్కారాలు చేసుకునే వారు అనేకమంది ఉండగా ముముక్షువులు, సాధకులు కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఇది సహజమైన విషయం. ఈ విషయం లో గురువులకు స్పష్టత ఉంటే బాగుంటుంది. 

Some gurus expect the austerity and serious approach of a mumukshu from normal householders. This will not succeed.

ఎన్నో జన్మల సాధన తరువాత గురుస్థానం చేరుకున్న వారు తొలి దశలలో ఉన్నవారిని నిందించడం తగదు. వారికి మార్గ దర్శనం చేయడం బాగుంటుంది.

కేజీ నుంచి పీజీ దాకా చదవడం కోసం సమయం పడుతుంది. అందరూ డాక్టరేటు చేయలేరు అన్నది నిండు నిజం.

కొన్ని కెరటాలు ఎక్కువగా ఎగసి పడుతున్నాయి. కొన్ని తీరం చేరకుండానే అగిపోతున్నాయి. పేచీ లేదు.

గసాభా -  కసాగు లకు అంతరం ఉంటుంది.

ఉపదేశం మంచిదే. కానీ అధికారి భేదం గుర్తించి చేయడం మంచిది. బుద్ధిభేదం న జనయేత్ అన్న సూచన ఉంది. 

ఆధ్యాత్మిక జ్ఞానం చేసే మేలు కంటే ఆధ్యాత్మిక అసహనం చేసే కీడు ఎక్కువ కాకూడదు. శృతి మించిన విమర్శ చేయడం సరికాదు. 

ఇదివరకు తాను కూడా ఎన్నో తప్పులు చేశాను. ఎంతో ప్రయత్నం చేసిన తరువాతే గురుస్థానం లోకి వచ్చాను. ఇప్పటికీ కొన్ని సందర్భాలలో తడబడుతుంటాను అని నిజాయితీ గా చెప్పగలిగే గురువులు  అరుదు. 

అలాగే honest feedback స్వీకరించే లక్షణం స్వీయ లోపాలు అంగీకరించే గుణం ఎన్నడూ వదులుకోకూడదు.  అంతరాత్మ ను మించిన అద్దం లేదు. అయితే దృష్టి సారించగలగాలి.

గురువులు ఒక్కోసారి కోపగించినా వారు వందనీయులే. 

నిజానికి ఒక్కోసారి అనిపిస్తుంది.  సామాన్యులతో పాటు గురువులలో కూడా మార్పు అవసరమే.

Random thoughts and general observations. Not intended to find fault with any one 🙏