Sunday, May 15, 2011

వేసవికాలపు వెన్నెల కాదు కదా-- తిలాంగ్ రాగం.

తిలాంగ్ రాగం. రెండు నిషాదాలతో గమ్మత్తుగా ఉంటుంది. ఇట్టే ఆకట్టుకుంటుంది.

మూడు మంచి పాటలను ఒకసారి replay చేసుకుంటాను.

1) నాకు అమితంగా నచ్చిన ఈ పాట సింగార వేలన్ చిత్రంలోనిది. ఇంత మంచి పాటలను సృష్టించిన ఇళయరాజా కు ఏమిచ్చి ఋణం తీర్చుకోగలము అనిపిస్తుంది. గానం బాలు , జానకి గారు. అద్భుతంగా పాడారు.

2) సుశీలమ్మగారు పాడిన ’మనసా కవ్వించకే’నన్నిలా పాట చాలా ఇష్టం నాకు. పండంటి కాపురం చిత్రంలోనిది. soliloquy ని పాటగా మలచిన తీరు బాగుంది. తిలాంగ్ లో ఇంకా బాగా కుదిరింది. కష్టమైన పాట అనిపిస్తుంది. పాటల పోటీలలో పాల్గొనే వారు ఈ పాట పాడాలంటే ముచ్చెమటలు పోయటం ఖాయం.

3) ఏమొకో చిగురుటధరమున -mlv గొంతులో ఇక్కడ బహుళ ప్రాచుర్యం పొందిన ఈ అన్నమయ్య పదం -- ముఖ్యంగా శోభారాజు ఇంకా బాలు గారు ఇద్దరు కూడా ఈ పాటకు ప్రాణం పోస్తారు.

నిలువుమా నిలువుమా నీలవేణి పాట కూడా చాలా మధురమైన యుగళగీతం.