Wednesday, October 17, 2012

when ప్రాచ్యం meets పశ్చిమం on violin horizon

carnatic music lends itself to fusion music. ఈ genre ఇష్టపడేవారికి VS నరసింహన్ పేరు తెలిసే ఉంటుంది. ఈయన ఒక వాయులీన virtuoso అని చెప్పవచ్చు. ఇళయరాజా స్వరపరచిన ’how to name it' 'nothing but wind' సంపుటాలలో solo bits వాయించారు.

నరసింహన్ ’string quartet' అనే బృందంగా ఏర్పడి విశేష కృషి చేశాడు. ఈ బృందం web site ఇక్కడ- string temple. ఇందులో మచ్చుకి వింటానికి ఇచ్చిన bits వింటే చాలు వీరి ప్రతిభను అంచనా వేయటానికి.

దేశ్ రాగంలో లాల్గూడి జయరామన్ గారి తిల్లానా ను VSN fusion చేసిన తీరు ఈ దృశ్యకం లో వినవచ్చు.

స్వంతంగా కూడా కొన్ని చిత్రాలకు సంగీతం సమకూర్చారు (బాలచందర్ చిత్రం అచ్చమిల్లై అచ్చమిల్లై vs తొలి చిత్రం)
ఆవారం పూవు పాట.

చాన్నాళ్ళ క్రితమే ఈ  భద్రాచల రామదాసు కీర్తనలు  (దశరథ రామా గోవింద ) కొత్తశైలిలో విన్నాను. స్వరకర్త ఎవరో ఇన్నాళ్ళకి కాని తెలిసింది కాదు. ఈ పాటలు నరసింహన్ స్వరపరిచాడని తెలియటం ఓ pleasant surprise. ఈ పాటలు పాడినది పి. అరుణ అనే గాయని. ఈమె గొంతుక విలక్షణంగా మాధుర్యంతో కూడి ఉన్నది. ఆమె వివరాలు తెలియటం లేదు. ముఖ్యంగా దశరథ రామ గోవింద పాట నేను ప్రాణంగా ప్రేమించే  శుద్ధ సావేరి లో ఎంతో బాగుంది.

ఈ రామదాసు కీర్తనలలో వినిపించిన వీణ, వయొలిన్ల సమ్మేళనం సమ్మోహనంగా ఉన్నది.
నరసింహన్  ఒక పరిపూర్ణమైన విద్వాంసుడు అనటం సముచితం. ఇప్పుడు అంత active గా ఉన్నట్టు లేదు.
go explore the website to have a glimpse of the master.

vsn గురించి మరింత info ఇక్కడ


 

Thursday, September 13, 2012

అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు - ఆ పాటంటేఒకేసారి ముగ్గురు అభిమాన సంగీత దర్శకులను తలచుకునే అవకాశం వచ్చింది ఇప్పుడు నాకు.

s.d.బర్మన్ సంగీతం ప్రభావం gk వెంకటేశ్ పైన , ఇంకా ఆయనవద్ద సహాయకుడుగా పనిచేసిన ఇళయరాజా మీద ఉంది. వాయిద్యాల కూర్పులో సొగసు, brevity in interludes, ఒక theme continue అవుతుండగానే మరొక వాయిద్యం కర్ణపేయంగా చొరబడటం, percussion లో myriad permutations--ఇవి ఈ ముగ్గురికీ కల సారూప్యాలు.

sdb కూర్చిన ’ఏ దిల్ దీవానా హై’  (రఫి, లతల గొంతులు divine) పాట నుంచి దాదాపుగా స్ఫూర్తి పొంది gkv ’నీ బందు నింతాగ’ అనే ఈ పాట స్వరపరిచాడు. it is even better than the original. pb శ్రీనివాస్, పి సుశీల గార్లు పాడిన ఈ పాట ఒక all time classic.


gkv and ilayaraja duo seem not to have enough of the original song. IR మళ్ళీ దేవర్ మగన్ చిత్రంలో ’ఇంజి ఈడు పzhaగి’ పాట కట్టాడు. పాటలోని interlude ఎంతో బాగుంటుంది. అరవంలో కమల్ హాసన్ చక్కగా పాడాడు అని నా ఉద్దేశ్యం. to tell you the truth, కమల్ the actor కంటే కమల్ the intellectual, కమల్ the singer గానే నాకు ఇష్టం. as an actor he overacts  and goes overboard mostly. కానీ అతనితో interview లు చూస్తే తను ఎంత గొప్ప మేధావో అర్థమౌతుంది.

ఇలా మంచిపాటలను ప్రేరణగా తీసుకుని కొంచెం స్వీయ సంతకంతో కొత్త పాటలు కట్టటం తప్పేమీకాదు. అది original స్వరకర్తకు tribute గా భావించవచ్చు.

Sunday, August 26, 2012

సాయి ఈ జగమే నీ ద్వారకా మాయి.- నాగార్జున సాయి పాటలు

 నాగార్జున శిరిడి సాయి పాటల గురించి చెప్పాల్సి ఉంది. నాగ్ first look లో చాలా బాగున్నాడు అనిపించింది. కానీ తెచ్చిపెట్టుకున్నట్టు లేకుండా , unwanted gait లేకుండా హాయిగా సహజంగా నటిస్తే ఇంకా బాగుంటుంది.

కీరవాణి stable నుంచి వచ్చిన ఈ album బాగుంది అని చెప్పవచ్చు. నాకు ముఖ్యంగా నాలుగు పాటలు నచ్చాయి.

1) నీ పదముల ప్రభవించిన గంగా యమున : చిలుక పలుకుల composer chose to sing the best song of the album. కీరవాణికి ఈ ’పాడు’ గుణం ఎప్పటికి పోతుందో. పాట ఎత్తుగడ పీలగా అందుకోవటం బాగాలేదు. ఈ పాట బాలు పాడితే గొప్పగా ఉండేది. సునీత మంచి గాయని కానీ గొంతులో పీచు మిఠాయి లేదా నెమలి ఈక పెట్టుకుని పాడినట్టు ఉంటుంది. స్పష్టత తక్కువ. కొంతమంది perform చేస్తే బాగుంటుంది. మరికొందరు mentors లేదా tutors గా ఉంటేనే నయం. కళాకారులు ఈ విషయం గుర్తెరగాలి. అయితే ఒకటి. నలుగురి ముందు ప్రదర్శన ఇచ్చి మెప్పుపొందాలనుకోవటం అత్యంత సహజమైన విషయం. అయితే ఇప్పుడు సునీత గారికి ఉన్న matured voice మరొకరికి లేదు.

పాటలో మనసును తాకే రెండు పదాలు:" నీవులేని చోటు లేదు సాయి. ఈ జగమే నీ ద్వారకా మాయి". రచన రామ జోగయ్య. పాటలో ’ముక్కోటి దైవాలు ఒక్కటైన నీవు ఏకమనేకమ్ముగా విస్తరించినావు’ అన్న చోట ఎంతో హృద్యంగా కళ్యాణి రాగం వినిపించింది.

2) వస్తున్నా బాబా వస్తున్నా: పాటలో pathos పలకాలంటే శుభపంతువరాళి సరైన రాగం. భక్తులను సాయి అనునయిస్తూ, అభయమిస్తూ పాడటం బాగుంది. నానావళికి (?) మాత్రం కీరవాణి గొంతు బాగానే నప్పింది.

3) ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి : పాట బాగుంది. మధు బాలకృష్ణ గొంతు హాయిగా ఉంటుంది. కానీ శ్రుతి కొంచెం sine wave లా ఉంటుంది. తిన్నగా సరళరేఖలా ఉంటే ఇంకా బాగుంటుంది. పాట మధ్యలో శహన లో సునీత గొంతు కలపటం బాగుంది.

4) మానవసేవే మాధవసేవని : విన్నవెంటనే ఆకట్టుకునే గుణం ఉన్న పాట ఇది. దీపు, అదితి పాల్ . బాగానే పాడారు కానీ పదాల ఉచ్చారణ leaves a lot to be desired. సత్వమూర్తి అన్న పదం స్పష్టంగా పలకొద్దూ. for once the composer chose not sing this song and wrote the lyrics instead. ఈ పాట వింటూ హాయిగా నిద్దురలోకి జారుకోవచ్చు.

బాలు సునీత పాడిన సాయి అంటే తల్లి పాట కూడా బాగుంది. సాయి పాదం పాట సాహిత్యం అత్యుత్తమంగా (వేద వ్యాస) ఉంది. పాట ఎత్తుగడ మాండ్ రాగంలో బాగుంది. కానీ ఎందుకో మాండ్ రాగాన్ని bits and pieces లోనే ఎప్పుడూ వాడుతున్నారు.

తక్కిన పాటలు కథాగమనానికి తోడ్పడేలా ఉన్నాయి. చూస్తూ వింటేనే బాగుంటాయి. శంకర్ మహదేవన్ పాడిన పాట అంతగా ఆకట్టుకోలేదు. తనకు ఇంకా మంచి బలమైన పాట ఉండాలి.

ముక్తాయింపు: కీరవాణి మంచి సంగీతం కూర్చాడు. ఇళయరాజా, ఆదిత్య పౌడ్వాల్ బాణీలు కట్టిన సాయిబాబా చిత్రాలపాటలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఈ పాటలు కూడా  వింటే బాగున్నాయి.   cinema లో రాఘవేన్ద్రరావు మార్కు crudeness లేకుండా ఉంటే బాగుంటుంది అని ఆశిస్తున్నాను.

Wednesday, July 18, 2012

షణ్ముఖప్రియ- చెంబై-చౌడయ్య- కుంచెం confusion

now something divine :

మహాగాయకుడు చెంబై (వైద్యనాథ భాగవతారు),  మహా వయొలిన్ విద్వన్మణి మైసూరు చౌడయ్య  కలయిక లో ఒక కీర్తన షణ్ముఖప్రియలో ఇక్కడ చూసి వినవచ్చు. చెంబై గొంతులోని timbre నాదపుష్టి అనుపమానంగా ఉంటుంది.

ఇద్దరు శాస్త్రవేత్తలు కలిసి god's particle  కనుగొనటమంటే ఇదేనేమో.  (God's particle అన్న పదం scientist లే coin చేసే సరికి హేతువాదులకు పొలమారింది)

జేసుదాసు చెంబై గారి ప్రముఖ శిష్యుడు.

now , the mundane :

మంచి గీతం విన్నతరువాత ఇది వింటే కుంచెం నడ్డి మీద ఛంపేసినట్టున్నా పాట బానే ఉంటుంది.

summer in bethleham అనే మళయాళ చిత్రంలో(1998) విద్యాసాగర్ బాణీ కట్టిన ’confusion  తీర్కణమే’ పాట ఇక్కడ

తెలుగులో ’తిరువేంకటాధీశ జగదీశ’ (ఘంటసాల), తకిట తధిమి తందాన (సాగర సంగమం) ప్రాచుర్యం పొందినవి.
అణురేణు పరిపూర్ణమైన, అణిమాది సిరివంటిది షణ్ముఖ ప్రియ.

Friday, March 23, 2012

పాపనాశం శివన్ + కద్రి గోపాల్ నాథ్ +’జ్ఞాన వినాయకనే’ - ఒక దివ్యానుభూతి.ఇద్దరు మహా సంగీత విద్వాంసుల కలయికలో ఒక పరమాద్భుతమైన కీర్తన ఒక్కసారి పునశ్శ్రవణం చేసుకుంటే ఆ’నందనం’ గా ఉంటుంది అనిపించింది.


పాపనాశం  శివన్-- తమిళ త్యాగరాజు గా పేర్కాంచిన ఈ వాగ్గేయ కారుడు అద్భుత కీర్తనలను రచించి స్వరపరిచాడు. వీరు  (1890 -1973) కూర్చిన  ’జ్ఞాన వినాయకనే’  కృతిలో వేగం + మాధుర్యం + కద్రి గోపాల్ నాధ్ శాక్సోపోన్ వాదనం పామరులనైనా పరవశింపజేస్తాయి.
కద్రి గోపాల్ నాథ్ (కద్రి గోపాల్ నాథ్ జాలపుట చిరునామా) saxophone maestro అన్న విషయం సంగీత ప్రేమికులందరికీ తెలుసును. వారికి వారే సాటి.

రాగం. గంభీరనాట. కొంచెం తిలాంగ్ రాగంలా అనిపిస్తుంది. అవరోహణలో నిషాదం మార్పుతో.


duet సినిమాలో వీరు sax వాయించి చిత్ర సంగీతాన్ని అమాంతం elevate చేశారు. ఈ పాటలో అక్కడక్కడ వినవచ్చు.


మరికొన్ని అమృత పాణీలు ఇక్కడ-- పురందర దాసర కృతి ’వెంకటాచల నిలయం’
 
’కృష్ణా నీ బేగనే బారో’ -
 
ఆకాశంలో శబ్దం తన అంశ అని గీతాచార్యుని ఉవాచ. ఆ శబ్దం ఇటువంటి మహా విద్వాంసుల సంగీతమేనేమో.