Saturday, January 30, 2021

ఆధ్యాత్మిక గజస్నానం - కొన్ని అద్వైత కబుర్లు

కొంతకాలంగా కీ. శే. యల్లంరాజు శ్రీనివాస రావు  గారి '  భగవద్గీత - భాగవతం  సమన్వయము '  youtube లో ఉన్న audio లు విన్నాను. These discourses leave  a profound and lasting impact on listeners. I consider myself fortunate to have heard these lectures.

అద్వైత వేదాంత బోధకులలో వారు అగ్రగణ్యులు .  He is an authority on Advaita vedanta. ఆయన ప్రవచనం నిర్మించే తీరు, సహేతుకంగా వివరించే పధ్ధతి, ఉపనిషత్తులు, భాగవతం, భగవద్గీత , ఇతర శాస్త్రాలపై సాధికారత,   sense of humour చాలా బాగుంటాయి. 

యల్లంరాజు గారి వంటి మహా పండితులు, జ్ఞాని ఉండటం మన తెలుగు వారికి కలిగిన అదృష్టం. ఆయన ప్రవచనాలను record చేసి అందరికి అందుబాటులో ఉంచిన వారి శిష్యులు అభినందనీయులు. 

అద్వైతం సిద్ధాంత పరంగా అద్వితీయమైనప్పటికీ  ఎంతవరకు ఆచరణీయం అన్న సందేహం ఉన్నది.  కంటికి కనిపించే విశ్వం అంతా మిథ్య, కనిపించకుండా సర్వ వ్యాపకమైన బ్రహ్మమే సత్యం  అని convince అవడం సులభం కాదు .  

ఏ తత్వ సిద్ధాంతమైనా ఐదింటికి సమాధానం ఇవ్వవలసి ఉంటుంది - జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, బంధం, మోక్షం. ( ప్రేమ్ సిద్ధార్థ్ గారి ప్రవచనం నుండి) . అద్వైతం ఈ ఐదింటికి సమాధానం చెబుతుంది. 

నిజానికి అద్వైతాన్ని మించిన హేతువాదం లేదు అనిపిస్తుంది. భౌతిక శాస్త్రాలు అన్నీ matter, mind దాటి పోలేవు. Physical sciences can't go beyond matter and mind. They can't explain consciousness. Advaita is the science behind sciences. 

అద్వైత సిద్ధాంతం కర్మ యోగం , భక్తి యోగం .. దేనినీ నిరాకరించదు కానీ  అవి జ్ఞానం పొందటానికి ఉపకరించే ఉపకరణాలుగానే అంగీకరిస్తుంది. జ్ఞానాదేవ తు కైవల్యం - అంతిమంగా జ్ఞానం ద్వారా మాత్రమే మోక్షం సాధ్య పడుతుంది అని చెబుతుంది. 

ఐతే దేహధారులైన మానవులకు అద్వైత నిష్ఠ  అన్నది ఎన్నో జన్మల భక్తి, కర్మయోగ సాధనల తరువాత సాధ్యపడే అవకాశం ఉంది అని చెబుతున్నారు.

అద్వైత సిద్ధి పొందిన వారు అతికొద్ది మంది మాత్రమే ఉన్నారు. చివరికి చతుర్ముఖ బ్రహ్మ, మహర్షులు కూడా ఈ స్థితిని పొందటం కష్ట సాధ్యం. ఇలా 99. 999% మందికి సాధ్యంకాని మోక్షం గురించి ఇంత తాపత్రయం ఎందుకు అనే ప్రశ్నవస్తుంది. 

మానవుడికిమాత్రమే ఉన్న విచక్షణ వల్ల జ్ఞాన సాధనకై  ప్రయత్నం చేసే అవకాశం ఉంది. దేహ తాదాత్మ్యం తో  పుణ్యం  పాపం చేస్తూ ఉన్నంత కాలం జనన మరణ చక్రం నుంచి విముక్తి లేదు. ఎంత పుణ్యం చేసినా క్షీణే పుణ్యే మర్త్యలోకం విశన్తి అని చెప్పారు. మళ్ళీ మానవుడిగా పుట్టి సాధన చేసుకోవలసిందే. 

వివిధ ఉపాధులు, స్వరూపాల సంబంధాన్ని చూపటానికి అద్వైత ఆచార్యులు సాధారణం గా స్వీకరించే ఉదాహరణలు - సముద్రం - కెరటాలు, మట్టి - వివిధ  రకాల పాత్రలు, బంగారం - వివిధ ఆభరణాలు, అగ్ని - విస్ఫులింగాలు, ఇంద్రధనస్సులోని రంగులు- సూర్య కాంతి. 

అలాగే మిథ్య - సత్యం చూపటానికి స్వీకరించే ఉదాహరణలు - రజ్జువు - సర్పం,  నీటి చెలమ-మరీచిక ,స్వాప్నిక జగత్తు, దర్పణ దృశ్యమాన నగరి..  

శ్రవణం,  మననం,నిది ధ్యాసన - అద్వైత సాధన లో ముఖ్యమైన ఉపకరణాలుగా చెప్పారు. 

యల్లంరాజు గారు వ్రాసిన  రామాయణం - రామణీయకత, భాగవత సామ్రాజ్యం పుస్తకాలు ఉన్నాయి .  They are seminal works of a great exponent of advaita vedanta. పురాణాలు, శాస్త్రాలు అన్నీ కూడా నిత్య, శుద్ధ, బుద్ధ, ముక్త నిర్గుణ బ్రహ్మాన్నే ప్రతిపాదిస్తున్నాయి అని ఆయన తార్కికంగా సోదాహరణంగా నిరూపిస్తారు.

Everyone may not agree or choose to sail in the path of Advaita. The discourses of Shri Yallamraju garu are delightful and prompt us to think deep. 

కొంత సాధన, కొంత వేదన, ఆధ్యాత్మిక గజ స్నానం, పున : ప్రయత్నం - ఇవన్నీ తప్పవు. బహూనాం జన్మనామ్ అంతే ... We don't know where we stand in our journey. Are we going forward or backward? 

Life is comprised of two journeys - external and internal. The sooner the internal journey begins, the faster the outer journeys conclude.