అన్ని రాగాలకు సప్త స్వరాలు building blocks గా ఉన్నాయి.
The seven basic notes with a few variants of ri, ga, ma, da, ni give rise to 12 or 16 working swarams.
అయితే ఈ 7/12/16 స్వరాల వివిధ కలయికలో వివిధ రాగాలు పుట్టుకొచ్చాయి. రాగం అంటే కేవలం కొన్ని స్వరాల అమరిక కాదు. ప్రతి రాగానికి ప్రాణ స్వరాలు, పడికట్టు సంగతులు, గమకాలు, ఆలాపన సంప్రదాయాలు కొన్ని వందల సంవత్సరాలుగా కొనసాగి , స్థిరపడి ఉన్నాయి.
సింధు భైరవి, తోడి రాగాలకు స్వరాలు ఒకటే అయినా రాగ స్వరూపంలో ఎంతో భేదం ఉన్నది.
రసాయన శాస్త్రం లో మూలకాల లాగా రాగాలకు ఒక నిర్దుష్ట స్వరూపం ఉన్నది. Each ragam has a distinct identity.
ఇటీవల svbc లో ఒక సంగీత కార్యక్రమం లో శుద్ధ సారంగ రాగం ఆధారిత గీతాల గురించి శ్రీ సాయి కృష్ణ యాచేంద్ర గారు ప్రస్తావించారు.
శుద్ధ సారంగ రాగం హిందుస్తానీ సంగీత సంప్రదాయం కు చెందినది. కర్ణాటక సంగీతం లో హంసనాదం రాగానికి దగ్గరగా ఉన్నట్టు తెలుస్తుంది.
ఈ రాగం ఆధారం గా స్వరపరచ బడిన కొన్ని మధుర గీతాలు ఉన్నాయి.
1) కర్ణ చిత్రం లోని ' నీవు నేను వలచితిమి ' చాలా ప్రసిద్ధమైన పాట ( విశ్వనాథన్ - రామ మూర్తి, -సినారె -బాలమురళి - పి సుశీల గార్లు ) . తమిళంలో TM సుందర రాజన్ - P సుశీల గారు పాడారు.
ఈ పాటలో బిస్మిల్లా ఖాన్ గారు షెహనాయి వాయించినట్లుగా తెలుస్తున్నది.
2) శ్రీ వేంకటేశ్వర మాహాత్మ్యం చిత్రం లోని ' ఎవరో అతడెవరో ఆ నవమోహనుఁడెవరో ' పాట (పెండ్యాల - ఆత్రేయ- ఘంటసాల- సుశీల గార్లు)
3) మహాకవి కాళిదాసు చిత్రం లో 'జయ జయ జయ శారదా నవ కళా విశారదా ' గీతం ( పెండ్యాల - పింగళి- సుశీల గార్లు)
హిందుస్థానీ శైలిలో విదుషి శ్రీమతి కౌశికి చక్రబర్తి పాడిన శుద్ధ సారంగ రాగంలోని ఒక ఖయాల్
కౌశికీ చక్రబర్తి ప్రముఖ హిందుస్థానీ గాయని గా రాణిస్తున్నారు. ఆమె ప్రఖ్యాత గాయకులు పద్మ భూషణ్ పండిట్ అజయ్ చక్రబర్తి గారి కుమార్తె. తండ్రికి తగ్గ తనయ.
There is a meditative quality about Hindustani music. వారికి శ్రుతి చాలా ప్రధానం. ఖయాల్ ఆలాపనలో సాహిత్యం తక్కువగా వుండి రాగం విస్తరణకు ఎక్కువగా ప్రాముఖ్యం ఉంటుంది. రెండు భాగాలు గా ఉండి ముందు విలంబితం (నెమ్మది) గా సాగి తదుపరి ద్రుత ( వేగం) గా ముగుస్తుంది. ఖయాల్ బాగా ప్రాచుర్యం పొందినది. ధ్రుపద్ సంగీతం మరింత విస్తారంగా నాలుగు భాగాలు గా సాగుతుంది. ప్రస్తుతం ధ్రుపద్ కంటే ఖయాల్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
గొప్ప సంగీత కారులు సృష్టించే నాదం లో లీనమైనప్పుడు మనస్సులో ఆలోచనలు పూర్తిగా శమించి ఆత్మ లో లయమౌతుంది. అది ఒక చక్కని ధ్యానం అవుతుంది.
The ultimate effect of any art form may be the dissolution of mind in the inner consciousness.
అయితే ఈ మనసు లయం కావడం ఎప్పుడో కానీ జరగదు. It depends on both the performer and the listener. Many times the desultory mind swims in shallow waters. The experience stops at the level of superficial pleasure. Sometimes it goes deeper.
On rare occasions a flash of real bliss happens. శాస్త్రీయ సంగీతం అర్థం చేసుకోవడం, తరచుగా వినడం వలన ఉద్వేగం తగ్గి మనసు సాంత్వన పడుతుంది. The mind delves deeper. The lyrics, the singer, the ambience, the listener everything disappear in the ocean of nadam.
No comments:
Post a Comment