Wednesday, March 30, 2011

బిలహరీ అని పిలువకుంటే బాగుండదు.

స్వధర్మే నిధనం శ్రేయ: అనుపల్లవిలో కొన్ని సంగీతకబుర్లు చెప్పుకుంటేనే బ్లాగుంటుంది అనిపించింది.

బిలహరి. పెద్దగా నన్ను ఆకట్టుకోదు ఈ రాగం. వినగా వినగా.. sort of grows on ears.

ఆరోహణలో మోహనం +అవరోహణ శంకరాభరణం= బిలహరి.

ఈ రాగంలో ఓ రెండు పాటలను పొగిడి ఒక పాటను తిడితే ఒక టపాయిపోతుంది.

ఒకమంచిపాట-- ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మని రెమ్మ రెమ్మకూ.-దేవులపల్లి వారి రచన. పాట ఎత్తుగడ ఎంతో బాగుంది. ఎంతో హాయిగా సుశీలమ్మ గారు పాడారు.

ఇళయరాజా బిలహరిలో ఇచ్చిన రెండుపాటలు ఇలా ఉన్నాయి

1) రుద్రవీణలో ’నీతోనే ఆగేనా సంగీతం’- నాకు నచ్చని పాటలలో ఇది ఒకటి. తన తండ్రి పరిస్థితిని పాట రూపంలో కచ్చేరీలో పాడటం చాలా కృతకంగా అనిపిస్తుంది. అలాగే పాట బాణీ కూడా కృత్రిమంగా ఉంది. ఈ చిత్రంలోనే ’లలిత ప్రియ కమలం విరిసినది’ అనే పాట కూడా నాకు నచ్చదు. (మరీ రివర్సు లో సమీక్షిస్తున్నానేమో తెలియదు)

2) బాలనాగమ్మ అనే తమిళ చిత్రంలోని ’కూందళిలే మేగం’ అనే పాట బానే ఉంటుంది బిలహరిలో.

సంగీత సామ్రాట్ ( anr, జయప్రద, రమేశ్ నాయుడు, సుశీలగారు.)చిత్రంలోని ఎంతసొగసు గాడే పాట బాగుంది.

బాగా ప్రసిద్ధమైన సంప్రదాయ గీతం ’రార వేణు గోపబాల రాజిత సద్గుణ జయశీల’

2 comments:

 1. అయ్యో మీకు బిలహరి నచ్చదా? నాకు ఒకటో అరో తప్ప అన్ని రాగాలూ బాగానే నచ్చేస్తాయండీ! బిలహరిలో కొన్ని సినిమా పాటలు ఇట్టే ఆకట్టుకుంటాయి. రుద్రవీణ లో పాట సోసోగా అనిపిస్తూనే మరో పక్క బాగుందనిపిస్తుంది.:-))

  ప్రముఖ నాటక కారులు వ్యాఖ్యాత శ్రీ అక్కిరాజు సుందర రామ కృష్ణ గారు ఆ రాగం మీది అభిమానంతో వారి అబ్బాయికి "బిలహరి" అని పేరు పెట్టుకున్నారు!

  ఇంతకీ లలిత ప్రియ కమలం పాట మీకు ఎందుకు నచ్చదో తెలుసుకోవాలని ఉంది. అది నా అభిమాన గీతాల్లో ఒకటి! పాట స్వర రచన నచ్చదా లేక సందర్భం నచ్చలేదా?

  ReplyDelete
 2. సుజాతగారు: బిలహరి నచ్చదు అనికాదండి. ఆరభి,కళ్యాణి,హంసధ్వని.. వంటి రాగాలతో పోలిస్తే కొంచెం తక్కువ ఇష్టం. రాగాలన్నీ గొప్పవే. ఏదో పామరత్వంతో అలా వ్రాశాను. అంతే.

  లలిత ప్రియకమలం మీకిష్టమైన గీతమా. సారీ అండి. 1988 లో రుద్రవీణ వచ్చినప్పుడు నాకూ ఆ పాట బాగా ఇష్టంగా ఉండేది. ఇప్పుడు నేను పాటలను ఇష్టపడే దృష్టిమారింది. 1) పాటలో మాధుర్యం పాలు తక్కువ అనిపిస్తుంది. 2) ఈ పాటలో సీతారామశాస్త్రి గారి సాహిత్యం beyond common man's reach అనిపించింది. 3) ఇళయరాజా సంగీతం కూడా సహజత్వం లోపించింది.
  ఇవి నాకు తోచిన భావంగా మాత్రమే భావించగలరు. it is perfectly possible and okay that you may like this song.

  ఈ retro effect మీద ఒక టపా వ్రాయాలనిపిస్తోంది.

  ReplyDelete