తిలాంగ్ రాగం. రెండు నిషాదాలతో గమ్మత్తుగా ఉంటుంది. ఇట్టే ఆకట్టుకుంటుంది.
మూడు మంచి పాటలను ఒకసారి replay చేసుకుంటాను.
1) నాకు అమితంగా నచ్చిన ఈ పాట సింగార వేలన్ చిత్రంలోనిది. ఇంత మంచి పాటలను సృష్టించిన ఇళయరాజా కు ఏమిచ్చి ఋణం తీర్చుకోగలము అనిపిస్తుంది. గానం బాలు , జానకి గారు. అద్భుతంగా పాడారు.
2) సుశీలమ్మగారు పాడిన ’మనసా కవ్వించకే’నన్నిలా పాట చాలా ఇష్టం నాకు. పండంటి కాపురం చిత్రంలోనిది. soliloquy ని పాటగా మలచిన తీరు బాగుంది. తిలాంగ్ లో ఇంకా బాగా కుదిరింది. కష్టమైన పాట అనిపిస్తుంది. పాటల పోటీలలో పాల్గొనే వారు ఈ పాట పాడాలంటే ముచ్చెమటలు పోయటం ఖాయం.
3) ఏమొకో చిగురుటధరమున -mlv గొంతులో ఇక్కడ బహుళ ప్రాచుర్యం పొందిన ఈ అన్నమయ్య పదం -- ముఖ్యంగా శోభారాజు ఇంకా బాలు గారు ఇద్దరు కూడా ఈ పాటకు ప్రాణం పోస్తారు.
నిలువుమా నిలువుమా నీలవేణి పాట కూడా చాలా మధురమైన యుగళగీతం.
మూడూ మూడు తరహా పాటలు! ‘సింగారవేలన్’ పాట ఇప్పుడే వినటం! ఇళయరాజా ముద్రతో శ్రావ్యంగా ఉంది. ‘మనసా కవ్వించకే’- వెంటాడే కోదండపాణి బాణీ. ఇక ‘ఏమొకో చిగురుటధరమున’ సంగతికొస్తే.. అన్నమయ్యలోని కీరవాణి బాణీయే నాకు బాగుంది.:)
ReplyDeleteకిరణ్ గారూ! వీడియో, ఆడియో రెండూ ఉన్నపుడు ఆడియో లింక్ ఇవ్వటానికే ప్రాధాన్యం ఇవ్వండి. యూ ట్యూబ్ బఫరింగ్ కాలయాపన. మరో విషయం- మీరిలా క్లుప్తంగా కాకుండా ఒక్కో పాటలోని అందాలను మీ కోణంలో వివరంగా విశ్లేషిస్తే బాగుంటుంది! ఏమంటారు?
వేణు గారు. నెనర్లు. నాకే ఆసక్తి కరంగా అనిపించలేదు ఈ టపా. మరో సారి ప్రయత్నిస్తాను.
ReplyDeleteమొన్న సూపర్ సింగర్ లో గోపిక పూర్ణిమ పాడింది.తను ఒరిజినల్ పాటలో సగం కూడ పాడలేదు.I was surprised being a professional singer how come she could nt sing this song properly.
ReplyDelete