Saturday, September 24, 2011

కారుచీకటిలో కాంతి రేఖవై మూగగుండెలో దివ్యవాణివై

70 వ దశకం చివర్లో ఆకాశవాణి కడప కేంద్రంలో ప్రతి ఆదివారం ఏసు ప్రభువు పాటలు పెట్టేవారు ఉదయం ఎనిమిదింటికి అనుకుంటా. అవి ఈ నాటికి నా మదిలో పదిలంగా ఉన్నాయి. అద్భుతమైన బాణీలు. అంతకు మించిన గానం సుశీల బాలు గార్లది. ఈ పాటలకు స్వరకర్త ఎవ్వరో నాకు ఇప్పటికీ తెలియలేదు. బహుశ: పాలగుమ్మి విశ్వనాథంగారేమో అని నా ఊహ. జాలం పుణ్యమా అని ’హృదయమే నీ ఆలయం క్రీస్తు’ ఆదిగా గల అన్నిపాటలు మళ్ళీ వినగలుగుతున్నాను.

ఈ క్రీస్తుపాటల సంకలనం లో నాకు అమితంగా నచ్చిన కొన్ని పాటలు.

హృదయమే నీ ఆలయం క్రీస్తూ.

ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో

శాశ్వతమా ఈ దేహం

ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం

నేనే మార్గము సత్యము జీవముని

ఈ లంకెలో పాటలు వినవచ్చు

ముఖ్యంగా ’మధుర మధుర సేవ ’ అనే పాట ఎన్నిసార్లు విన్నా తనివితీరదు. దేశ్ రాగంలోని వినసొంపుదనం. బాలుగారి అద్భుతగానం ఈ పాటకు ప్రాణం పోశాయి. ఒకే గీత సంకలనంలో ఇన్ని ఆణిముత్యాలు పొదిగిన స్వరకర్తకు పాదాభివందనం చేయాలనిపిస్తుంది.
సుశీలగారు, బాలుగారు ఈ పాటలను గొప్పగాపాడారో చెప్పటానికి మాటలు చాలవు. ఈ తరం శ్రోతలు తప్పక విని శాశ్వతంగా భద్రపరచుకోవాల్సిన పాటలు ఇవి. సాహిత్యం కొంచెం typically క్రైస్తవంగా అనిపిస్తుంది కానీ బాణీల లోని మాధుర్యం మాటలను అధిగమిస్తుంది.

తెలుగుదనం, భారతీయత ఉట్టిపడే ఈ పాటలు తప్పక ఒకసారి స్మరించుకోవటం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. కరుణామయుడైన యేసు ప్రభువు ప్రశాంత వదనం కళ్ళకు కట్టించే పాటలు ఇవి.

నేను క్రైస్తవుడిని కాను కాని ఈ పాటలు మాత్రం నేను అమితంగా అభిమానిస్తాను. స్వస్తి.

3 comments:

 1. నేను చాలా లేటుగా చూస్తున్నా! ఈ పాటలు నేను కూడా చాలా ఇష్టపడతాను. ఇవే కాకుండా బాలూ పాడిన ఇంకో పాట ఉండేది విన్నారా."కారు మొయిలు దారిలో" అని మొదలవుతుంది. అది నాకు చాలా ఇష్టం!

  70 వ దశకం చివర్లో ఏంటి, మొన్న మొన్నటి వరకూ విజయవాడ రేడియోలో వేసేవారు ఈ పాటలు. అలాగే నటరాజ మొదలియార్ అనే తమిళ గాయకుడు పాడిన కొన్ని పాటలు "నా జీవిత యాత్రలో " అనే పాటతో పాటు మరి కొన్ని పాటలు వేసేవారు. అవికూడా నేను ఇష్టంగా వినే దాన్ని!

  మీరు చెప్పినట్టు సాహిత్యం క్రైస్తవంగా అనిపించినా బాణీల్లోని మాధుర్యం అద్భుతంగా ఉండి మతాలకు అతీతంగా అభిమానుల్ని ఏర్పరిచింది ఈ పాటలకు!

  నేను చాలా లేటుగా చూస్తున్నా! ఈ పాటలు నేను కూడా చాలా ఇష్టపడతాను. ఇవే కాకుండా బాలూ పాడిన ఇంకో పాట ఉండేది విన్నారా."కారు మొయిలు దారిలో" అని మొదలవుతుంది. అది నాకు చాలా ఇష్టం!

  70 వ దశకం చివర్లో ఏంటి, మొన్న మొన్నటి వరకూ విజయవాడ రేడియోలో వేసేవారు ఈ పాటలు. అలాగే నటరాజ మొదలియార్ అనే తమిళ గాయకుడు పాడిన కొన్ని పాటలు "నా జీవిత యాత్రలో " అనే పాటతో పాటు మరి కొన్ని పాటలు వేసేవారు. అవికూడా నేను ఇష్టంగా వినే దాన్ని!

  మీరు చెప్పినట్టు సాహిత్యం క్రైస్తవంగా అనిపించినా బాణీల్లోని మాధుర్యం అద్భుతంగా ఉండి మతాలకు అతీతంగా అభిమానుల్ని ఏర్పరిచింది ఈ పాటలకు!

  ఈ లింక్ లో చాలా మంచి క్రైస్తవ భక్తి గీతాలున్నాయి


  http://www.chimatamusic.com/telugu_songs/displayNew.php?st=christ

  ReplyDelete
 2. నడిపించు నా నావాఆఆ
  నడిసంద్రమున దేవాఆఆ

  అనే పాట కూడా మీకు నచ్చివుంటుంది

  ReplyDelete
 3. నాకు కూడా చాలా ఇష్టం... కారు మోయులు దారిలో అన్న పాటలో సంగీత స్వర మాధుర్యం మాటల్లో చెప్పలేను...అలాగే దేవునికి స్తోత్రము పరిశుద్ధుడగు మా దేవునికి స్తోత్రము అన్న పాటలో కూడా సంగీత స్వర మాధుర్యం అద్భుతం !! సంగీతానికి కులమతం ఏముంది.. పాటలో ఉత్తమ సంగీత సాహిత్యాల మేళనం తో జీవం ఉప్పొంగాలే గానీ !!

  ReplyDelete