
ఒకపరి శిష్టాన్నములు ఒకపరి దుష్టాన్నములు కోరుతుంది.
మంచి సంగీతం వినటం మనసును higher plane లో ఉంచుతుంది.
(preachy preachy అవుతోంది. lemme shift gears )
GBK గారు అన్నమయ్య పదాలను జనరంజకంగా బాణీలు కట్టడంలో ఎంతో కృషి చేశారు వారు హిందోళంలో కట్టిన ఈ పాట వింటే మైమరచి పోవటం ఖాయం.' నారాయణ నీ నామమే గతి ఇక '..
ఒక శ్రోత ఇలా వ్యాఖ్యానించారు ' ప్రాణం పోయినా పరవాలేదు ఈ పాట విన్నాక' . అని.
అంత గొప్పగా ఉంది ఈపాట బాణీ , ప్రసాద్ గారు పాడిన తీరు.
పాటలో అట్టే ఆకట్టుకునే మాటలు 'పైపై ముందట భవజలధి దాపు వెనుక చింతా జలధి చాపలము నడుమ సంసార జలధి'
హిందోళమే అమృతతుల్యంగా ఉంటుంది. ఎన్నో గొప్ప పాటలు ఉన్నాయి.
సముద్రపు అలలు, నిండు చందమామ , చంటిపిల్లల నవ్వులు, ఎంత చూసినా తనివితీరదు, విసుగు పుట్టదు.
ఈ పాట కూడా ఆ కోవ లోనిదే.
అలాగే 'మునుల తపమునదె మూలభూతి యదె' పాట కూడా చాలా బాగుంది. ముఖ్యంగా చరణాల ప్రారంభంలో ఉన్న మాధుర్యం మనసుకు హత్తుకుంటుంది.
మనసు మాట వినదు కాని పాట వింటుంది. మనసు గతి ఇంతే.
అధునా