మేధావి. సినీ సంగీతానికి ఎంతమేరకు అవసరమో అంతవరకే శాస్త్రీయ సంగీతాన్ని వాడటం తెలిసిన వారు. విభిన్న శైలులను adapt చేసుకోవటంలో ఆయన దిట్ట.
పసుపు, సున్నం కలయికతో కుంకుమ వర్ణం ఏర్పడినట్టు కొంచెం కర్నాటకం కొంచెం హిందుస్తానీ , కొంత లలిత శాస్త్రీయం కలిపి సినీ సంగీతానికి సరిపడే ఒక హాయైన శైలిని సృష్టించాడు.
SRR - PS కలయికలో వచ్చిన వీణ పాటలు అజరామరాలు. ఆయన బాణీలు వింటుంటే music made simple అనిపిస్తాయి. కానీ పాడినవాళ్ళకు తెలుస్తుంది అవి అంత వీజీ కాదని. .
ఉదా: 1) 'పాడెద నీ నామమే గోపాల ' (అమాయకురాలు-పి.సుశీల). పాట ఎత్తుగడలోనే srr ముద్ర ప్రబలంగా వినిపిస్తుంది.
2) మదిలో వీణలు మ్రోగే. (ఆత్మీయులు- పి.సుశీల)
చంద్రలేఖ, మల్లీశ్వరి, మిస్సమ్మ, మాయాబజార్, భక్త ప్రహ్లాద, భక్త జయదేవ, భీష్మ, పూజా ఫలం -- SRR గొప్ప సంగీతం అందించిన చిత్రాలలోకొన్ని. భీమ్ పలాస్ , మోహన కళ్యాణి రాగాలు ఆయనకు ఇష్టమని పిస్తుంది. పాటలో రెండు చరణాలు ఉంటే విభిన్నంగా బాణీలు కట్టడం ఆయన శైలి.
పూలరంగడు చిత్రంలోని 'చిగురులు వేసిన కలలన్నీ' పాట నాకు ఎంటో ఇష్టమైన పాట.
మిస్సమ్మ లోని ఆరభి రాగంలోని 'బృందావనమది అందరిదీ' పాట ఎన్నటికీ మరువలేము.
పూజాఫలం లోని 'నిన్నలేని అందమేదో', ' పగలే వెన్నెల' పాటలు తెలుగువారికి వారు ఇచ్చిన ఎన్నడూ ఇంకిపోని మంచినీటి చెలమలు.

వారి ప్రవేటు గీతాలు కూడా ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఆయన nasal voice తో పాడటం విలక్షణంగా ఉంటుంది.
SRR , పెండ్యాల , సుశీల , ఘంటసాల - అది ఒక స్వర్ణ యుగం. వారి సంగీతం తెలుగువారి అమూల్యమైన సంపద.
పాతవన్నీ మంచివి. కొత్తవన్నీ చెత్తవి అన్నది నా ఉద్దేశ్యం కాదుకానీ DSP & taman లు ఇచ్చే సంగీతపు కొరడాదెబ్బలకు SRR గంధం పూతలు అవసరమే.