చంద్రజ్యోతి రాగం ఒక అరుదైన రాగం. త్యాగరాజ స్వామి రెండు కీర్తనలు మాత్రమే ఈ రాగంలో కూర్చారు.
1) బాగాయనయ్యా ( బాలమురళి ) 2) శశివదనా భక్త జనావన శంకర (os అరుణ్).
అరుణ్ ప్రముఖ కర్ణాటక /భజన సంగీత విద్వాంసుడు. పాటను ఎంతో అనుభవిస్తూ, లీనమై పాడుతూ, ఆంగిక అభినయంతో, విచిత్రమైన ముఖ కవళికలతో కచ్చేరీని రక్తి కట్టిస్తాడు. there is never a dull moment when arun performs.
90-91 లో శ్రీ ఏడుకొండలస్వామి అనే చిత్రం వచ్చింది. అందులో సప్త శైల విశాల పన్నగ అనే ఆణిముత్యం లాంటి పాట ఉంది. జన్యరాగం చంద్రజ్యోతిలో ఉందా లేక జనకరాగం పావనిలో ఉందా అని కొంచెం సందేహం. SPB గొంతులోని పరిణితి, పాడిన విధానం గొప్పగా ఉన్నాయి. సంస్కృత పద భూయిష్టమైన ఈ పాటలో బాలు ఉచ్చారణ impeccable గా ఉంది.
భక్తులు జప తప ధ్యానాలు చేసుకునే సమయంలో కొండొకపరి అవాంఛిత ఆలోచనలు కలగటము, మనసు పాదరసంలా జారిపోవటము కద్దు. త్యాగరాజ స్వామి సామాన్యులు ఎదుర్కొనే ఈ పరిస్థితిని ఊహించి శశివదనా భక్త జనావన కృతిలో తెచ్చిన పోలిక : - మునుల యాగాలను అపవిత్ర ద్రవ్యాలతో భంగపరచిన మారీచుని అణచిన భంగి , పూజా సమయంలో నా మనసున పుట్టే దుష్ట చింతనలను అణచివేయమంటున్నాడు.
బాగుందయ్యా , లోకమంతా గారడీ చేసి ఆనందిస్తూ మళ్ళా నాకేమీ తెలియదంటావు. స్వబాంధవులను చంపనని మారాం చేసిన అర్జునునికి, నీకూ నాకూ ఏమీ అంటుకోదయ్యా అని బురిడీ కొట్టించావు. బ్రహ్మకైనా అర్థం గాదయ్యా. బాగాయనయ్య నీ మాయలెంతో.
No comments:
Post a Comment