Thursday, August 18, 2016

ఖరహరప్రియ లో 'స్వామి' 'పక్కల నిలబడి' పాడిన పాట .


 కర్ణాటక సంగీత ప్రపంచంలో కె.వి. నారాయణస్వామి (1923-2002) గారిది సమున్నత స్థానం .


melody+ pure tradition+ mastery+classicism+ manodharmam అన్నిటి మేలుకలయికే వారి గానం. 'నెరవల్' నారాయణస్వామి అని వారిని అభిమానంతో పిలుచుకుంటారు. నెరవులు (singing a phrase in the charanam in kaliedoscopic melodic structures bringing out the essence of the ragam)   వైవిధ్యభరితంగా పాడటం వారి ప్రత్యేకత. 
పాలఘాట్ మట్టిలో , నీటిలో, గాలిలో  ఏమి మహత్తు ఉందొ కానీ కర్ణాటక సంగీతానికి fountainhead గా నిలిచింది. 

 kvn పాడిన  'పక్కల నిలబడి'  ( ఖరహర ప్రియ- త్యాగరాజ స్వామి) కీర్తనలో నెరవుల మెరుపులు విరుపులు (మనసున తలచి) వినవచ్చు. 
----------------------------------
పక్కల నిలబడి కొలిచే ముచ్చట
బాగా తెల్ప రాదా


చుక్కల రాయని కేరు మోము గల
సు-దతి సీతమ్మ సౌమిత్రి రామునికిరు (పక్కల)


తనువుచే వందనమొనరించుచున్నారా
చనువున నామ కీర్తన సేయుచున్నారా
మనసున తలచి మై మరచియున్నారా
నెనరుంచి త్యాగరాజునితో హరి హరి మీరిరు (పక్కల)
----------------------------------------------------------

20 వ శతాబ్దపు ప్రథమార్ధం - అరియకుడి, సెమ్మంగుడి, GNB , చెంబై  - ద్వితీయార్థం ఎమ్మెస్, బాలమురళి, kvn, నేదునూరి.. సుసంపన్నం చేశారు.

 ఖరహరప్రియ రాగంలో 
ఒకపరి కొకపరి వయ్యారమై  (అన్నమయ్య - ఉన్ని కృష్ణన్)
సంగీత సాహిత్య సమలంకృతే (స్వాతికిరణం-SPB -సినారె-kvm) - అత్యుత్తమమైన సాహిత్యం, సంగీతం, బాలు అద్భుత గానం. 
బాలనురా మదనా (మిస్సమ్మ, సుశీల, SRR , పింగళి). 
ఇళయరాజా సంగీతం లో  'ఆనందం పొంగిడ'  (KJY - సునంద ) అనే అద్భుతమైన పాట ఉంది. ముఖ్యంగా ఈ పాటలో interludes చాలా బాగుంటాయి. 


2 comments:

  1. మీ పోస్టు ద్వారా ఖరహర ప్రియ రాగం గురించి కొత్త సంగతులు తెలిశాయి. ‘మనసున తలచి ...’ దగ్గర కేవీ నారాయణస్వామిగారి నెరవులు బాగున్నాయి. ‘ఆనందం పొంగిడ’ వినటం ఇదే మొదటిసారి. ఈ పాటా, మీరు చెప్పినట్టు ఇంటర్ లూడ్స్ శ్రావ్యంగా ఉన్నాయి!

    ReplyDelete