చక్రవాకం- అహిర్ భైరవ్ రాగం. an apt ragam to express pangs of separation.
This is a real gem. చక్రవాకం- అహిర్ భైరవ్ రాగం. - 'ఏనాడు విడిపోని బంధం ఇది'. పాట rhythm, lyric, music - above all the impeccable rendition of Balu. It is one of the finest pieces from the oeuvre of vamshi-raja combo.
ఈ రాగంలో చప్పున స్ఫురించే కృతి పిబరే రామరసం (చక్రవాకం- అహిర్ భైరవి) - బాలమురళి weaves magic
సదాశివబ్రహ్మేంద్ర స్వామి కృతులు - పిబరే రామరసం - మానస సంచర రే - గాయతి వనమాలి - సర్వం బ్రహ్మ మయం - ఖేలతి మమ హృదయే .. They are immortal songs composed by him in Sanskrit. Beautiful lyrics. ఈ కృతులలోని శబ్ద సౌందర్యం ఇట్టే ఆకట్టుకుంటుంది
శాస్త్రీయ సంగీతాన్ని స్పృశించే పాటలను తన చిత్రాలలో పొందుపరిచే అభిరుచి ఉన్న దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ.
అల్బేలా సజన్ యో రే ( हम दिल दे चुके सनम) ఇస్మాయిల్ దర్బార్-సుల్తాన్ ఖాన్-శంకర్ మహదేవన్-కవితా కృష్ణమూర్తి).
మహా విద్వాంసుడైన అన్నగారు ఉంటే తమ్ముడు అగస్త్య భ్రాతగా మిగిలిపోతాడు. రాజా తమ్ముడు గంగై అమరన్ కూడా ప్రతిభావంతుడైన సంగీత దర్శకుడే. a beautiful song composed by him
పూవో పొన్నో ( K J Yesu Das - S Janaki) in chakravakam.
In the recent times, an unsavoury incident took place where ilayaraja sent a legal notice to balu garu .
Legal notice to a friend who travelled with you for more than four decades. Ilayaraja's music and SPB's singing are inseparable. While raja created everlasting music, Balu and Janaki garu brought those tunes to life.
అన్నమయ్య, త్యాగయ్య, పోతన్న ... మరెందరో... Copyrighting works. No it is not an Indian concept.
Like all other fans, I fervently hope to see Raja and Balu perform together again. If friends can't forgive each other who else will?
స్వరమండల్ నుంచి వచ్చే సంగీతం వింటే..
ఒక పువ్వు విచ్చుకున్నట్టు, నెమలి పురి విప్పుకున్నట్టు, మబ్బు చాటు నిండు చందమామ మోము చూపినట్టు, horizon మీదుగా సూర్యోదయం చూసినట్టు, చెట్టు కొమ్మల్లోనుంచి పక్షులు ఒక్కసారిగా ఎగిరి పోయినట్టు, చంటిపాప ఉన్నట్టుండి నవ్వినట్టు, జలపాతపు ధారలు జలజలా రాలినట్టు అనిపిస్తుంది.
హిందుస్తానీ సంగీతంలో ఒక అపురూపమైన వాయిద్యం ఇది.
It is primarily a accompanying instrument of a vocalist usually played by him/her self. It does the work of a tanpura and more. Swarmandal is more like an icing on the cake. It complements the singer and embellishes the concert.
ఒక మధురమైన clipping ఇక్కడ . మరొకటి
తంబూర శృతి నిలపటానికి తోడ్పడితే, స్వరమండల్ వివిధరాగాలలో స్వరపరచుకునే అవకాశం ఉండటంతో ఒక సహగాయక పాత్ర పోషిస్తుంది.
సంతూర్ కూడా ఎంతో శ్రావ్యమైన వాయిద్యపరికరం. Santoor has wider scope and range and is an independent solo instrument.
సంతూర్ వాయిద్యపు ధ్వని వింటే నెమ్మదిగా నునుపైన గులకరాళ్లపై పారే సెలయేటి స్వచ్ఛమైననీటి పోలిక గాఢంగా తోస్తుంది. కళ్ళు మూసుకుని వింటే మంచుకొండల్లో విహరించినట్టు, మబ్బుల్లో తేలిపోయినట్టు అనిపిస్తుంది. పండిట్ శివకుమార్ శర్మ - This name is synonymous with Santoor.
సిరిమల్లె నీవె పాట ప్రారంభంలో స్వరమండల్ - సంతూర్ ను చక్కగా ఉపయోగించారు. శివ్ -హరి ద్వయం , ఇతర హిందీ సంగీత దర్శకులు సంతూర్ ను సినిమా పాటలలో తరచుగా ఉపయోగించారు. తెలుగులో కొంతవరకు రమేష్ నాయుడు పాటల్లో సంతూర్ వినిపించేది.
ఇళయరాజా 'నాదం నీ దీవెనే' పాటలో సంతూర్ మధురంగా వినిపిస్తుంది.
ఒక మంచి instrumental పాటతో ముగిస్తాను.
బాలమురళి గారి నిష్క్రమణతో ఏర్పడిన శూన్యత నుంచి కొంత ఉపశమనం కలిగింది. కన్యాకుమారి గారికి సంగీత కళానిధి పురస్కార ప్రదానంతో.
వారి ధన్యజీవిత విశేషాలు కొన్ని (from newspaper /internet articles/interviews)
తెలుగునాట పుట్టి శాస్త్రీయ సంగీతానికి fountainhead వంటి మద్రాసు నగరానికి తరలి వెళ్ళిపోయిన సంగీత కాందిశీకులలో వారు ఒకరు. నాలుగు దశాబ్దాలుగా మద్రాసు నగరంలో స్థిరపడి కర్ణాటక సంగీతానికి జీవితం అంకితం చేసిన విదుషీమణి.
She rose from the ranks. From being a faithful and steadfast accompanist to the legendary MLV to a soloist to innovator par excellence to a revered and beloved mentor, guru .. The journey has been one of fulfillment and accomplishment.
"She has many successful creative innovations to her credit. "Vadya Lahari" her brain child is a new combo of the violin, veena and Nadaswaram. "Tristhayi sangamam" Confluence of 3 violins playing in different octaves portraying a special dimension. "Carnatic Music Ensembles" of 25, 50, 75 and 100 violins as well as 100 instrument ensemble commemorating the millennium A music piece "100 ragamalika swarams" which exposes her dexterity in bringing out the raga swaroopam in just one avarthana each. 29 hours non stop marathon performance.".
బాలమురళి గారిని కర్ణాటక సంగీతపు 'స్వయంభువు" గా ఆమె వర్ణించారు. స్వత: ఆమె స్వయంసిద్ధ.
29/12/2016 నాటి మార్గళి ఉత్సవ కచేరి ఇక్కడ వినవచ్చు. Outstanding concert. త్రిస్థాయిల్లో వాయులీన త్రయం perform చేయడం చూడవచ్చు.
She is right up there in the league of violin maestros , viz. Lalgudi, TN Krishnan, MSG, LS.. వయోలిన్ లో వాగ్గేయకారుడి గాత్రం వినిపించాలి. సాహిత్య భావం పలకాలి. ఇది ఆమె బాణీ. She has evolved a style which is marked by brevity and minimalism. She has mastered this technique so well that only the best melodic structures are presented to the audience. She has tutored many successful students, which is her greatest contribution to carnatic music.
నాకెంతో ఇష్టమైన కళ్యాణ వసంత రాగం లో ' నాదలోలుడై' కీర్తన. Another shining star joins the galaxy of sangita kalanidhi recipients. Immensely happy about it.