Maybe he is the last of the great play back singers. ఆయన తరువాత నేపథ్య గాయకులు లేరని కాదు. ఎందరో పాడు తున్నారు కానీ ఆనాటి పాటల ఆ గాయకుల స్థాయి ఇప్పుడు లేదు అన్నది సత్యం.
ఘంటసాల, కిశోర్ కుమార్, రఫీ, లతా మంగేష్కర్, ఆశా భోస్లే, ముఖేశ్ , జేసుదాసు, సుశీల, జానకి. ఈ మహా నేపథ్య గాయకుల వరుస లో చివరి తరం వ్యక్తి S P బాలసుబ్రహ్మణ్యం . ఈ స్థాయి మరెవరూ అందుకోలేరు. ఆ సినీ సంగీత వైభవం పొందే గాయకులూ, ఆ పరిస్థితులు ఇప్పుడు లేవు.
SPB గొప్ప స్థానం చేరుకోవడానికి కొన్ని అంశాలు.
- 1) జన్మత : ఉన్న ప్రతిభ.
- 2) లక్ష్య సాధన కోసం తీవ్రంగా శ్రమించే గుణం
- 3) తనను తాను మెరుగు పరచుకునే తత్త్వం
- 4) అవకాశం అంది పుచ్చుకునే గుణం
- 5) మంచి మానవ సంబంధాలు నెరపడం
- 6) స్నేహ పూర్వక నడవడిక
- 7) సినీ రంగం లో 1970 - 2010 వరకు ఉన్న పరిస్థితులు
- 8) తమిళ, తెలుగు, కన్నడం, మళయాళ సినీ పరిశ్రమ మద్రాసు లో ఉండడం
- 9) తనకు వెన్నంటి నిలిచిన సంగీత దర్శకులు, నటులు, దర్శక నిర్మాతలు
- 10) సినీ రంగం తో పాటు టీవీ రంగం లోకి సరైన వేదిక ద్వారా ప్రవేశం
- 11) కొంత chutzpah
- 12) అన్నిటితో పాటు 'దైవ బలం'.
He was destined to achieve great success.
చిరకాల మిత్రుడు ఇళయరాజా తో 2019 లో విభేదాలు రావడం ఆయనను బాధ పెట్టింది. అయితే ఈ ఏడాది ఆ మనస్పర్థలు తొలగి పోయి ఇద్దరు మరల కలిసి పోవడంతో అభిమానులు సంతోషించారు.
అవి అలాగే ఈ నాటికి కొనసాగి ఉంటే ఇళయరాజా ను అది జీవితాంతం కలచి వేసేది.
career ఆరంభం లో పీల గా ఉన్న గొంతును మృదుత్వం , గాంభీర్యం ల మేలు కలయిక గా ఆయన మలచుకున్న తీరు అనితర సాధ్యం. అన్ని వేల పాటలు పాడటం అనేది ప్రపంచ చరిత్ర లోనే ఒక మహా అద్భుతం.
SPB Sir, P Susheelamma, S. Janaki Amma - They are true legends. We are indeed fortunate to have born in their era.
బాలు గారు 'భారత రత్న' పురస్కారానికి పూర్తి అర్హత ఉన్న వ్యక్తి. ఈ విషయం లో వెంకయ్య నాయుడు గారు చొరవ చూపించి బాలు గారికి ఈ సంవత్సరం 'భారత రత్న' అవార్డు తో గౌరవించాలి.
ఒక రెండు పాటలను గుర్తు చేసుకుంటాను. అవి ఎన్ని సార్లయినా వినవచ్చు.
1) ' నలివ గులాబి హూవె ' - పాట (Kannada movie auto raja 1980)
2) ' పాటల పల్లకి వై ఊరేగే చిరుగాలి ' - పాట ( నువ్వు వస్తావని చిత్రం 2000)
SPB Sir, You are inseparable part in the lives of millions of fans. . You are forever Sir. ఆ స్వచ్ఛమైన నగుమోము ఎన్నటికీ మరచి పోలేము నీకూ మరణం ఉన్నదని చెబితే ఎలా నమ్మేది. అనుకొని ఎలా బ్రతికేది. 🙏🙏🙏