కొన్ని రాగాలు ఒక్క కీర్తన ద్వారా ఎక్కువ ప్రాచుర్యం పొందుతాయి.
సారమతి రాగం అనగానే 'మోక్షము గలదా' అన్న త్యాగరాజ స్వామి వారి కృతి అనుపాయినిగా కనిపిస్తుంది.
ఈ కృతిలో 'వీణా వాదన లోలుడౌ శివుని ' స్వామి వారు దర్శించడం విశేషం గా అనిపిస్తుంది.
ఈ రాగం ఆవేదన, ఆర్తి, సమర్పణ, భక్తి నివేదన ఇత్యాది భావాలు వ్యక్తం చేయడానికి అనువుగా ఉంటుంది.
సారమతి రాగం నటభైరవి (20 వ మేళకర్త) జన్యం.
గొప్ప గాయకుడు ఎం. డి. రామనాథన్
గారి గొంతులో విందాము. వీరు కర్ణాటక సంగీత దిగ్గజాలతో ఒకరు. ఘనమైన గాత్ర ధర్మంతో విలంబ కాల గతిలో కీర్తనలు పాడడంలో ప్రసిద్ధులు. వారి ముందుతరం విద్వాంసులైన 'టైగర్ ' వరదాచారి శిష్యులు.They were puritans and assiduous sticklers to tradition and sampradaya. They strode like colossuses in the field of Carnatic music. It is because of such stalwarts, carnatic music was preserved for generations in its purest form.
కర్ణాటక సంగీతంలో కాల ప్రమాణం (tempo of rhythm) మూడు విధాలుగా విభజించారు.
1) ద్రుత లయ (fast paced)
2) మధ్య లయ (medium paced )
3) విలంబ లయ (slow paced )
సంగీత వాగ్గేయ కారులు కీర్తన సాహిత్యం, సందర్భం, రసం , భావం, రాగాన్ని అనుసరించి దృత, మధ్య లేదా విలంబ కాలాలలో పాడటానికి అనువుగా స్వర పరిచారు.
విలంబ కాలగతి లో ఉన్న సంగీతం మనసుకు సాంత్వన చేకూర్చి , పూర్తిగా లీనమయ్యేలా ఉండి రసానుభూతిని కలిగిస్తుంది. రాగం లోని మాధుర్యం పూర్తి స్థాయిలో అనుభవం కలిగిస్తుంది.
సారమతి రాగంలో ' సారస దళ నయనే ' (ముత్తయ్య భాగవతార్ కృతి) అనన్య అశోక్ అన్న గాయని చాలా బాగా పాడింది.
కొంతకాలం క్రితం ఇంటింటా అన్నమయ్య అనే ఒక చిత్రం (విడుదల కాలేదు) లో 'కమలాసన సౌభాగ్యము' అన్న పాట ప్రాచుర్యం పొందింది. పాట బాణీ బాగుంది కానీ
ఎన్నుకున్న రాగం, tempo పాట సాహిత్యానికి తగినట్లుగా లేవు అని చెప్పవచ్చు.
సారమతి, శహన, నీలాంబరి, యదుకుల కాంభోజి .. ఈ రాగాలు విలంబ కాల గీతాలకు అనువుగా ఉంటాయి.
ఏ పాటకు ఏ రాగం కుదురుతుంది అని అలోచించి పాత తరం సంగీత దర్శకులు (రాజేశ్వర రావు, మహాదేవను, పెండ్యాల, ఘంటసాల.. ) బాణీలు కట్టేవారు. అందుకే అవి కలకాలం నిలిచి ఉన్నాయి.
పాటలో పదాల మధ్య విరామం ఇవ్వడం బాగుంటుంది. ఇటీవలి కాలంలో సినిమా పాటలన్నీ breathless mode లో express speed లో దండకం లాగా బాణీలు కట్టడం జరుగుతుంది. గాయకులు కూడా సాహిత్యాన్ని బట్టీ పట్టి అప్పజెప్పినట్లు పాడుతున్నారు.
అలాంటి పాటలు ఎక్కువకాలం నిలబడవు.