Dear బాలు,
ఈ పాట నువ్వు పాడలేదు. నీకోసం అభిమానులంతా ముందే పాడించుకున్నాము.
నీలి మేఘాలలో గాలి కెరటాలలో
నీవు పాడే పాటా వినిపించునే వేళా
నీవు పాడే పాటా వినిపించునే వేళా
ఏ పూర్వ పుణ్యమో నీ పొందుగా మారీ
ఏ పూర్వ పుణ్యమో నీ పొందుగా మారీ
ఏ పూర్వ పుణ్యమో నీ పొందుగా మారీ
అపురూపమై నిలచే నా అంతరంగాన
నీలి మేఘాలలో ..
నీ చెలిమి లో నున్న నెత్తావి మాధురులూ
నా హృదయ భారమునే మరపింపజేయు
నీలి మేఘాలలో ..
అందుకో జాలని ఆనందమే నీవు
అందుకో జాలని ఆనందమే నీవు
ఎందుకో చేరువై దూరమైనావు.
నీలి మేఘాలలో ..
నీ చెలిమి లో నున్న నెత్తావి మాధురులూ
నా హృదయ భారమునే మరపింపజేయు
నీలి మేఘాలలో ..
అందుకో జాలని ఆనందమే నీవు
అందుకో జాలని ఆనందమే నీవు
ఎందుకో చేరువై దూరమైనావు.
నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాటా వినిపించునే వేళ
Dear బాలు.
దూరమైన కొలది పెరుగును అనురాగం అని, చూపుల కన్నా ఎదురు చూపులే తియ్యన అని నువ్వే పాడావు.
ఎక్కడో దూరాన కూర్చున్నావు. తమాష చూస్తున్నావు కదా.
Dear బాలు.
ఆనాటి ఆ స్నేహమానందగీతం
ఆ జ్ఞాపకాలన్ని మధురాతి మధురం
ఈనాడు ఆ హాయి లేదేల నేస్తం
ఆరోజులు మునుముందిక రావేమిరా.. అని పాడావు.
నీ పాట విన్నంత సేపు ఆ హాయి నీవు లేని వెలితి నిలిచే ఉన్నాయి.
Dear బాలు.
మెరుపులా మెరిశావు ... వలపులా కలిశావు...
కన్ను తెరిచి చూసేలోగా.నిన్నలలో నిలిచావు.
నిన్నలలో నిలిచావు...
కన్ను తెరిచి చూసేలోగా.నిన్నలలో నిలిచావు.
నిన్నలలో నిలిచావు...
Dear బాలు.
నీలాలు కారేనా, కాలాలు మారేనా
నీ జాలి నే పంచుకోనా, నీ లాలి నే పాడలేనా?
జాజి పూసే వేళ, జాబిల్లి వేళ
పూలడోల నేను కానా||
నీ జాలి నే పంచుకోనా, నీ లాలి నే పాడలేనా?
జాజి పూసే వేళ, జాబిల్లి వేళ
పూలడోల నేను కానా||
ఆ తారతో తేలి తళతళ మెరిసి పోతున్నావు. నీలాలు కారినా, కాలాలు మారినా సరే..
Dear బాలు.
పాడానంటే రాళ్ళే కరగాలి..ఆ రాళ్ళకు నోళ్ళొచ్చి కథలే చెప్పాలి.
అవును. తనివి తీరా చెప్పుకుంటాము.
Dear బాలు.
నా పాట పంచామృతం నా పాట పంచామృతం
నా గానాన గీర్వాణి స్నానాలు సాగించ
నా గానాన గీర్వాణి స్నానాలు సాగించ
గళము కొలను కాగా
ప్రతి పాట పద్మమేగా
పదము వెల్లివిరిసి రాదా
విధిసతి పాదపీఠి కాగా
శృతిలయలు మంగళహారతులై
స్వరసరళి స్వాగత గీతికలై
ప్రతిక్షణం సుమార్చనం
సరస్వతీ సమర్పణం
గగనము గెలువగ
ప్రతి పాట పద్మమేగా
పదము వెల్లివిరిసి రాదా
విధిసతి పాదపీఠి కాగా
శృతిలయలు మంగళహారతులై
స్వరసరళి స్వాగత గీతికలై
ప్రతిక్షణం సుమార్చనం
సరస్వతీ సమర్పణం
గగనము గెలువగ
గమకగతులు సాగ
పశువుల శిశువుల ఫణుల శిరసులూగ...
నా పాట పంచామృతం
పశువుల శిశువుల ఫణుల శిరసులూగ...
నా పాట పంచామృతం
అని గగనము గెలువగా వెళ్ళిపోయావు.
Dear బాలు.
అంతర్యామి అలసితి సొలసితి అంటూ వెళ్లి పోయావు.
రా దిగిరా దివినుంచి భువికి దిగిరా
తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో
అని అడగటం మాకూ వచ్చు.
Love you and miss you sir. Fortunate to be born in your times. 🙏