Tuesday, December 21, 2021

మరుమల్లెల చిరునవ్వుల సిరివెన్నెల



సీతారామ శాస్త్రి గారు తాను వెళ్లిపోయిన తరువాత తెలుగు ప్రజలు తనపై  కురిపించిన అభిమానం గౌరవం చూసి ఆనందంగా సాగిపోయి ఉంటాడు అని అనిపిస్తుంది.

సినిమా పాటలకు  పరిమితులు ఉన్నా  ఆయన  మంచి పాటలు వ్రాశాడు.  అశ్లీల అసభ్య గీతాలు దాదాపుగా వ్రాయలేదు. పదుల సంఖ్యలో ఆలోచింపచేసే పాటలు, మరికొన్ని రసానందం కలిగించే పాటలు వ్రాశాడు అని చాలామంది అభిప్రాయం. 

శ్రీ శ్రీ పాటల లోని శబ్ద సౌందర్యం, సినారె పాటలోని ప్రశ్న సమాధానం పద్ధతి, వేటూరి పాటల్లోని అర్థ వైచిత్రి సిరివెన్నెల పాటలలో కనిపిస్తాయి అని నా అభిప్రాయం. 

దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి భావ సౌందర్యం, సౌకుమార్యం  ఎప్పుడైనా కనిపిస్తుంది.

సిరివెన్నెల తరువాత ఎవరు? 

రామ జోగయ్య శాస్త్రి, చంద్రబోస్ వీరిద్దరూ మంచి పాటలు వ్రాస్తున్నారు. మన తెలుగు సినిమా పాట కు మరి కొన్నేళ్లు తిరుగు లేదు.

చంద్ర బోస్ రంగ స్థలం, పుష్ప సినిమాలలో వ్రాసిన పాటల్లో కొత్త భావాలు, పద చిత్రాలు ఉన్నాయి. 

'తెల్లారింది లెగండో ' పాట లో కవితాత్మకత

పాములాటి రాతిరి పడగ దించి పోయింది

ఎక్కిరించు రేయిని చూసి  ఎర్రబడ్డ ఆకాశం

ఎక్కుపెట్టి యిసిరిందా సూరీడి చూపులబాణం

కాలం గట్టిన గంతలు తీసి కాంతుల వెల్లువ గంతులు వేసి


శాస్త్రి గారు wrote many such memorable lines.

ఆయన వ్రాసిన పాటల్లో నాకు అమితంగా నచ్చిన పాట ఇది.

--------------------------------

నా చెలియ పాదాలు హంసలకు పాఠాలు

తాను పలికితె చాలు తేనె జలపాతాలు


ఓ నవ్వు చాలు ఎన్నెన్నొ వలలు వేస్తూ అల్లుకుంటుంది

ముత్యాల జల్లు మృదువైన ముల్లు మదిలో గుచ్చుకుంటుంది


ఆ సోగ కళ్ళ ఓ సైగ చాలు మనసే ఆగనంటుంది

చెక్కిళ్ళలోని నొక్కుల్లో చేరి మళ్ళీ తిరిగి రానంది


పట్టపగలెవరైనా రాతిరిని చూస్తారా

తన కురులు చూపిస్తా అవుననక ఛస్తారా


గుండెల్లో భోగి మంటలా ఎండల్లో లేత వెన్నెల

కొండల్లో ఏటి పరుగులా దూకుతున్న లయలో


గుమ్మంలో సందె వెలుగులా కొమ్మల్లో కొత్త చిగురులా

మబ్బుల్లో వెండి మెరుపులా ఆమెకెన్ని హొయలో


అలా నడిచి వస్తూంటే పూవుల వనం

శిలైపోని మనిషుంటే మనిషే అనం


గాలుల్లో ఆమె పరిమళం ఊపిరిలో నిండి ప్రతి క్షణం

ఎటు ఉన్నా నన్ను వదలదే ఎలా తప్పుకోను


గుర్తొస్తే ఆమె పరిచయం కవ్వించే పడుచు పసిదనం

రెప్పల్లో కైపు కలవరం ఎలా దాచుకోను


కలో కాదో నాకే నిజం తేలక

ఎలా చెప్పడం తాను నాకెవ్వరో

అదిరి పడకయ్యా ఇది ఆమె మాయ

ఇది కవిత కాదబ్బా మన్మధుడి దెబ్బ

------------------------------

ముఖ్యంగా ఈ పాదం మరీ బాగుంది.

అలా నడిచి వస్తూంటే పూవుల వనం

శిలైపోని మనిషుంటే మనిషే అనం 


గో రే గో గో రే అన్న పాట లో హీరోయిన్ మానసిక స్థితి ని పట్టిచ్చేలా ఉంటూనే, పదాలతో magic చేశాడు సిరివెన్నెల.

-------------------------------

తెగ ఉరుముతు కలకాలం

తెరమరుగున తన భారం

మోసుకుంటూ తిరగదు మేఘం

నీలా దాచుకొదుగా అనురాగం 

వెంటపడుతుంటే వెర్రి కోపం

నువ్వు కంటపడకుంటే పిచ్చి తాపం

మండిపడుతుందే హృదయం

మరిచే మంత్రమైనా చెప్పవే సమయం 

నీతో నీకే నిత్యం యుద్దం

ఎందుకు చెప్పవె సత్యభామ

ఏం సాధిస్తుందే నీ పంతం

ఒప్పుకుంటే తప్పులేదే ఉన్న ప్రేమ

-----------------------------

సిరివెన్నెల విశ్వనాథ్ గారి సినిమాలకు అందించిన సాహిత్యం అత్యుత్తమం. అజరామరం. ఆయనకు కనీసం ఐదు జాతీయ అవార్డు లు ఇవ్వాలి. అయితే పద్మశ్రీ అవార్డును ఇచ్చారు.  సంతోషమే.

శ్యాం సింగ రాయ్  చిత్రం లో చివరి పాటలో

నెలరాజు కి ఇల రాణికి  అన్న మాటలు - genius

Maybe he is the last literary legend of Telugu cinema. Thank you సిరివెన్నెల సీతారామశాస్త్రి Sir. 🙏🙏🙏