అద్వైత వేదాంత అధ్యయనం శ్రవణ, మనన, నిదిధ్యాసన ల సహాయం తో సాగుతుంది.
It is a long drawn process. Till we internalise the philosophy and live in harmony and beyond. For ordinary people like us who have some interest in vedanta philosophy, continuous study is required throughout the life.
Perseverance is needed to make progress.
Shravana -hearing the truth
Manana - contemplating the truth.
Nididhyasana - Internalising, living and breathing the truth.
Nidi dhyasana is the comprehension or understanding and realisation of the ultimate Reality after analysis of the meaning of Vedantic passages.
అద్వైత వేదాంత అధ్యయన అభిలాషులకు ఉపకరించే రెండు ప్రకరణ గ్రంథాలు -
ఆదిశంకరుల తత్వ బోధ, ఆత్మ బోధ.
అద్వైత వేదాంత పారిభాషిక పదాల పరిచయానికి, అద్వైత సిద్ధాంత ప్రాథమిక అవగాహనకు ఉపకరించే రచనలు. Both are pure Advaita texts.
అంతర్జాలం లో పై రెండు రచనలపై పుస్తకాలు, ప్రవచనాలు అందుబాటు లో ఉన్నాయి.
తత్వ బోధ - చిన్మయా మిషన్ వారి ఆంగ్ల PDF పుస్తకం (రచన - స్వరూప చైతన్య ) . - This book contains good introduction and lucid explanation.
https://namarupa.org/wp-content/uploads/2020/07/Tattva-Bodha-1997.pdf
తత్వ బోధ, ఆత్మ బోధ, వివేక చూడామణి.. ఇత్యాది రచనలు అవగాహన చేసుకుంటే - తదుపరి దశ ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మ సూత్రాలు .. అధ్యయనం సుగమం అవుతుంది.
ముందు కొంచెం dry subject లాగా అనిపిస్తుంది. అయితే కొంచెం కృషి చేస్తే ఆసక్తి పెరుగుతూ వస్తుంది.
అద్వైత వేదాంత అధ్యయనంతో పాటు నిత్యానుష్ఠానం, పూజ, జపం, ధ్యానం, కర్మ ,యోగం కూడా అవశ్యం చేయవలసి ఉంటుంది. జ్ఞాన, భక్తి, కర్మ, ధ్యాన యోగాలు విడి విడిగా ఆచరణ సాధ్యం కాదు. అన్నిటికీ ప్రత్యేక స్థానం, అవసరం ఉంది అని చెబుతారు.
ఆధ్యాత్మిక సాధన ఎంతో కొంత చేసినా ఉపయోగం ఉంటుంది.
స్వల్పమపి అస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్
తత్వ బోధ ఎరుకపరిచే విషయాలు.
సాధనా చతుష్టయం - , నిత్యానిత్య వస్తు వివేకము, ఇహాముత్ర ఫలభోగ విరాగము, శమాది షట్క సంపత్తి, ముముక్షత్వం
శమాది షట్క సంపత్తి - శమ, దమ, ఉపరతి, తితిక్ష, సమాధాన, శ్రద్ధ
పంచ కోశాలు - అన్నమయ, ప్రాణమయ, మనోమయ, బుద్ధిమయ, ఆనందమయ కోశాలు.
శరీర త్రయం - స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు
అవస్థా త్రయం - జాగ్రత్, స్వప్న, సుషుప్తి అవస్థలు
జ్ఞానేంద్రియాలు - స్పర్శ,శబ్ద,రూప,రస, గన్ధాలు
కర్మేంద్రియాలు - వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థలు
సచ్చిదానంద స్వరూపం
ఆత్మ, మాయ
పంచ భూతాలు - పృథ్వి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము
త్రివిధ ప్రకృతి గుణాలు - సత్వ రజస్తమో గుణాలు.
సృష్టి, పంచీకరణ
జీవుడు, జగత్తు,ఈశ్వరుడు
త్రివిధ కర్మలు -
బంధం, మోక్షం
-----------------------
ఆత్మ బోధ విశదపరిచే విషయాలు :
ఆత్మ బోధ లో 68 శ్లోకాలు ఉన్నాయి. A small treatise, profound in import.
కొన్ని శ్లోకాలలో అందమైన అర్థవంతమైన metaphors కనిపిస్తాయి.
The metaphors used seem to be so apt for understanding the concepts proposed.
ఆత్మ బోధ లో కనిపించే కొన్ని ఉపమానాలు .
मेघापायेंऽशुमानिव - అజ్ఞానం దూరమైనప్పుడు ఆత్మ, మేఘాలు తొలగగా సూర్యుడి వలె ప్రకాశిస్తుంది.
दृश्यतेऽभ्रेषु धावत्सु धावन्निव यथा शशी -
కదిలిపోతున్న మేఘాల నడుమ ఉన్న జాబిల్లి తానే పరుగులు తీస్తున్నట్లు అనిపిస్తుంది. అలాగే జ్ఞానేంద్రియాల వ్యవహారం ఆత్మ చేసినట్లు భ్రమ కలుగుతుంది.
शुद्धात्मा नीलवस्त्रादियोगेन स्फटिको यथा - నీల వర్ణపు వస్త్రముపై ఉంచిన శుద్ధ స్ఫటికం నీలపు రంగు సంతరించుకున్నట్లు శుద్ధ ఆత్మ పైన పంచ కోశాల గుణాలను ఆపాదించడం జరుగుతుంది.
गगने नीलतादिवत् - దేహేంద్రియాలు చేసే కర్మలు ఆత్మకు ఆపాదించడం ఆకాశం రంగు నీలం అనుకోవడం వంటిది.
कल्प्यन्तेऽम्बुगते चन्द्रे चलनादि यथाम्भसः
- కొలనులోని నీటి కదలికలు చూసి చంద్ర బింబం చలిస్తున్న భ్రాంతి కలిగినట్లు మనో వ్యాపారాలను నిశ్చల ఆత్మపై ఆరోపించడం జరుగుతుంది.
स्वकण्ठाभरणं यथा भाति - కంఠం పై ధరించిన ఆభరణం లాగా ఆత్మ సిద్ధ వస్తువు. అజ్ఞానం తొలగిన వెంటనే ఆత్మ స్వరూపం వ్యక్తమౌతుంది.
तस्मात्सर्वगतं ब्रह्म क्षीरे सर्पिरिवाखिले -
పాలల్లో అంతర్గతం గా వెన్న దాగి ఉన్నట్లు ఆత్మ అంతటా వ్యాపించి ఉంటుంది.
ब्रह्म प्रकाशते वह्निप्रतप्तायसपिण्डवत् -
అగ్నితప్తమైన ఇనుప ముద్ద వలె సకల జగత్తును బ్రహ్మ వ్యాపించి ప్రకాశింప జేస్తుంది.
अज्ञानचक्षुर्नेक्षेत भास्वन्तं भानुमन्धवत् -
సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపం జ్ఞాన చక్షువుకు మాత్రమే గోచరిస్తుంది. ఉజ్జ్వలంగా భాసిస్తున్న సూర్యబింబమయినా అంధత్వం ఉన్న కన్నులకు కనిపించదు
(Based on the writings and speeches on the above topics available in internet.)
ఆత్మ బోధ శ్లోకములు ఆంగ్ల తాత్పర్యం
🙏🙏🙏