Wednesday, September 20, 2023

యమునా కళ్యాణిలో - హంసవాహనముపై



తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నప్పుడు నేపథ్యంలో మధురమైన భక్తి గీతాలు ఆయా వాహన సేవలకు అనుగుణంగా  వినిపిస్తాయి.

అందులో హంస వాహన సేవపై వచ్చిన ఈ గీతం బాగుంది.


చక్కటి సాహిత్యం సంగీతం. గాయని సంగీత పరంగా చక్కగా పాడింది. Talented singer. Still there is a tinge of harshness in the voice. అలాగే సాహిత్యం ఉచ్చారణ లో మరింత స్పష్టత ఉండాలి అనిపించింది. నాలుగైదు సార్లు శ్రద్ధగా  విన్న తరువాత పాట లిరిక్స్ వ్రాయ గలిగాను.


ఈ బ్రహ్మోత్సవ వాహన సేవ గీతాల album ఎవరు చేశారో తెలియదు కానీ మంచి సాహిత్యం, సంగీతం కుదిరాయి.


-----------

హంస వాహనముపై హరి మీరు చూడరో 

వీణాపాణియై వేయి రాగాలతో


అందరి గుండెలోన అమృతము కురియగా

అతివ సింగారములు అలవోకగ  నొలికించుచు 


భవ్య వేదధామ భవభంజన రామ

గగన మేఘశ్యామ జగన్మోహన సోమ

రవి సోముల జడదాల్చి

రసగానము ఎద దాల్చి


అతివ సింగారములు అలవోకగ  నొలికించుచు - హంస వాహనము పై..


నిగమాగమ సీమ సుగుణ సార్వభౌమ

హంసయాన కామ అసురాధిప భీమ

పాలు నీరు వేర్పరుచు పావన యోగీంద్రుడు

సారపు విజ్ఞానమిడే శారదమూర్తియై


హంస వాహనముపై...


-------------


పాట యమన్ కళ్యాణ్ రాగం ఆధారం గా స్వరపరిచారు. Half the job is done once Kalyani or Yaman Kalyan ragam is chosen to compose a song.


అలవోకగ నొలికించుచు అన్న పదం దగ్గర stamp of యమునా కళ్యాణిని గుర్తించ వచ్చు.


కళ్యాణి రాగానికి ఉన్న శక్తి అది. సరైన రీతిలో సాహిత్యం, సంగీతం, గానం కుదిరితే కళ్యాణి రాగ దేవత ఎదురుగా వచ్చిన భావన కలుగుతుంది.


యమన్ కళ్యాణి రాగంలో ఉన్న అమృత తుల్య గీతాలు కృష్ణా నీ బేగనే బారో, భావయామి గోపాల బాలం, నగవులు నిజమని, హరిదాసులు వెడలే ... గీతాలు. కళ్యాణి రాగం తరగని బంగారు గని వంటిది. అక్షయపాత్ర వంటిది. ఎంత తీసుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది.


తంబురా perfect గా శృతి చేసి మీటితే సప్త స్వరాలు పలుకుతాయి వినిపిస్తాయి అని చెబుతారు. ఆ తంబుర నాదంలోనుంచి వ్యక్తమైన సప్త స్వరాలు రాగాలుగా, గీతాలుగా, వివిధ గాత్రముల, వాయిద్యాల రూపంలో విస్తరిస్తాయి. పరబ్రహ్మ నుంచి చరాచర సృష్టి వ్యక్తమైన తీరుగా.


నాదం శివస్వరూపం, సంగీతం శక్తి స్వరూపం.


వందే పార్వతీ పరమేశ్వరౌ 🙏🙏



 





3 comments:

  1. రాగాలని గుర్తుపట్టగలగడమన్నది పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. శృతి లయ బద్ధంగా పాడగలగడం అదృష్టానికి పరాకాష్టగా తలుస్తాను.
    సంగీత మార్గము భక్తివినా సన్మార్గము కలదే! మనసా!! స్వామివారి కృతి అనుకుంటా.
    సంగీతం పేరుజెప్పి సాహిత్యాన్ని మింగెయ్యడం దురదృష్టం.
    పాడలేకపోయినా,రాగాలని గుర్తించలేకపోయినా, విని ఆనందించగల
    రసహృదయం కావాలి. పశుర్వేత్తి,శిశుర్వేత్తి,గానరసం ఫణిః

    ReplyDelete
    Replies

    1. మన్నించాలి పొరబడ్డాను. సంగీత జ్ఞానము భక్తివినా..

      Delete