గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు (76) 9-3-2025 తేదీన తిరుపతిలో ఉన్న తమ స్వగృహంలో పరమపదించారు. 🙏🏻
అన్నమాచార్య సంకీర్తనలు ఈనాడు తెలుగు ప్రజలకు బాగా చేరువ కావడానికి ప్రధాన కారణం గాయకులు, స్వరకర్త శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారు.
తొలుత రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ, మల్లిక్, బాలసుబ్రహ్మణ్య శర్మ గారు, వోలేటి, బాలమురళి గారు కొన్ని సంకీర్తనలకు బాణీ కూర్చి తెలుగు శ్రోతలకు అన్నమయ్య గీతాల రుచి చూపించారు.
తొలి రోజులలో బ్రహ్మ కడిగిన పాదము, అదివో అల్లదివో, కొండలలో నెలకొన్న వంటి కొన్ని కీర్తనలు బాగా వినిపించేవి. తరువాత బాలమురళి గారి గొంతులో ఇందరికి అభయంబు లిచ్చు చేయి, నారాయణ తే నమో, ఎక్కడి మానుష జన్మము వంటి గీతాలు శ్రోతలకు తెలిశాయి.
శ్రీరంగం గోపాలరత్నం గారు నల్లని మేని, సకలం హే సఖి, నమో నారాయణ, ఇద్దరి తమకము ... గీతాలు అద్భుతంగా స్వరపరచి పాడారు.
టిటిడి వారు అన్నమయ్య ప్రాజెక్టు చేపట్టిన తరువాత అన్నమాచార్య గీతాలకు ఎనలేని ప్రాచుర్యం వచ్చింది.
నేదునూరి గారు స్వరపరచిన ఏమొకో, ముద్దుగారే యశోద, పలుకు తేనెల తల్లి, కంటి శుక్ర వారము, భావము లోన వంటి గీతాలు బహుళ ప్రజాదరణ పొందాయి.
నేదునూరి గారు స్వరపరచగా భారత రత్న ఎమ్ ఎస్ సుబ్బలక్ష్మి గారు అద్భుతంగా పాడిన అన్నమయ్య గీతాలు ఎనలేని ప్రాచుర్యం పొందాయి.
భావయామి గోపాల బాలం, శ్రీమన్నారాయణ, దేవదేవం భజే, నానాటి బ్రతుకు, మనుజుడై పుట్టి, జో అచ్యుతానంద... గీతాలు ఈనాటికీ శ్రోతలకు ఆనందం కలిగిస్తున్నాయి.
80s 90s నుంచి నేదునూరి శిష్యులు బాలకృష్ణ ప్రసాద్ గారు, శోభారాజు గారు అన్నమాచార్య సంకీర్తనల వైభవం విస్తరింపజేశారు.
We can observe a nasal tinge in the voice of Balakrishna Prasad garu.
గాయకుడిగా అంతకుమించి స్వరకర్తగా ఆయన గొప్ప కృషి చేసి దాదాపు వెయ్యి సంకీర్తనలను స్వరపరిచారు. భక్తి భావం , సాత్విక గుణాలు ఆయనకు సహజ లక్షణాలు. అందువల్ల ఆయన స్వరపరచి గానం చేసిన అన్నమయ్య కీర్తనలు మరింతగా ఇనుమడించాయి.
తెలుగు వారు శుద్ధ శాస్త్రీయ సంగీతం కన్నా semi classical, devotional music ఎక్కువగా ఇష్టపడతారు.
Prasad Garu may have limitations as a singer but as a composer he excelled. He rightly identified his strengths and composed semi classical and devotional music in a delightful manner full of devotion.
అన్నమయ్య కీర్తనలకు సముచితంగా స్వరం కూర్చడంలో ఆయన నిష్ణాతులైనారు. అన్నమయ్య సాహిత్యం అర్థం చేసుకుని భావం శ్రోతలకు చేరువయ్యేలా బాణీ కూర్చడంలో ఆయన ఒక benchmark set చేశారు.
శోభా రాజు, నాగేశ్వర నాయుడు, ఆనంద భట్టర్ గారు కూడా కొన్ని అన్నమయ్య కీర్తనలకు మంచి బాణీలు సమకూర్చి పాడారు.
ఇటీవలి కాలం లో మరికొంత మంది స్వరకర్తలు అన్నమయ్య గీతాలకు బాణీలు కడుతున్నారు. అయితే బాలకృష్ణ గారి స్వర రచనల లాగా అందులో అధిక భాగం నిలిచేవి కావు.
అన్నమయ్య ఆధ్యాత్మిక, శృంగార, జానపద, సంస్కృత భక్తి గీతాలు రచించాడు. ఆ రచనల వైవిధ్యాన్ని, నేపథ్యాన్ని, సాహిత్యాన్ని అవగాహన చేసుకుని స్వరాలు సమకూర్చడం ముఖ్యమైన విషయం.
అన్నమయ్య సాహిత్యం ఆకళింపు చేసుకుని పద విభజన, విరామం, సంగతులు తగు విధంగా ఉండేలా చూసుకుంటూ కీర్తనకు సరిపోయే రాగం ఎంపిక చేసుకుని స్వరాలు కూర్చడంలో బాలకృష్ణ ప్రసాద్ గారిది అగ్రస్థానం. ఈ విషయం లో ప్రస్తుత స్వరకర్తలు ఆయన గీతాలను క్షుణ్ణంగా పరిశీలించి నేర్చుకుంటే బాగుంటుంది.
ముఖ్యంగా హిందోళం, మోహన రాగాలను ఆయన కీర్తనలలో విస్తారంగా ఉపయోగించారు. హిందోళ రాగంలో ఉన్న వైవిధ్యాన్ని, range ను ఆయన లా explore చేసిన వారు మరొకరు లేరు అనే చెప్పాలి.
నారాయణా నీ నామమే గతి ఇక,
వచ్చెను అలమేలు మంగా,
అంతయు నీవే హరి పుండరీకాక్ష
సేవింపరో జనులాల
ఇటువంటి అద్భుత గీతాలు హిందోళం లో
మోహన రాగంలో గరిమెళ్ళ గారు స్వరపరిచిన
జగన్మోహనాకార,
పొడగంటిమయ్యా
నారాయణుడీతడు
పరమ పురుషుడు
వంటి మధుర కీర్తనలు
తెలుగు ప్రజల మనసుల్లో శాశ్వతం గా చేరిపోయాయి.
వినరో భాగ్యము విష్ణుకథ, జయలక్ష్మీ వరలక్ష్మీ, చూడరమ్మ సతులాల, పిడికిట తలంబ్రాల, అన్నిమంత్రములు, ఓ పవనాత్మజ, మాధవా కేశవా, మెరుగు వంటిది, కొలువై ఉన్నాడు వీడే, హరినామమే కడు .. ఇలా ఎన్నో అజరామర గీతాలు అందించారు.
ఇటీవలి కాలంలో బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు రచించిన శివ పదం గీతాలకు స్వరాలు సమకూరుస్తున్నారు.
గణపతి కీర్తనలను స్వయంగా రచించి స్వరపరిచారు.
ఆవిధంగా బాలకృష్ణ ప్రసాద్ గారు హరి హరుల ఇరు దైవముల సంగీతార్చనలో జీవితం ధన్యం చేసుకున్నారు.
బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరచిన అన్నమయ్య గీతాలలో నేను ప్రత్యేకంగా అభిమానించే కొన్ని గీతాలు:
' నారాయణా నీ నామమే గతి ఇక ' గీతం ఒక magnum opus అని అనిపిస్తుంది. ఈ గీతం స్వరం, గానం అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. నాదోపాసనకు ప్రతీక గా నిలచింది ఈ గీతం.
ఈ గీతం లో ని పదాలు - క్రింది లోకములు కీడు నరకములు అన్న చోట మంద్ర స్థాయిలో - అండనే స్వర్గాలవే మీదా అన్న చోట పై స్థాయిలో స్వరం కూర్చడం - బాలకృష్ణ ప్రసాద్ గారి ప్రతిభకు తార్కాణంగా కనిపిస్తుంది.
విన్న ప్రతిసారి దివ్యానుభూతి కలిగిస్తుంది ఈ అద్భుతమైన గీతం. Outstanding composition full of devotion.
పాపపు రాశి అన్న చోట పాడిన తీరు ఒక అలౌకిక ఆనందం కలిగిస్తుంది.
అలాగే దేవా నమో దేవా అన్న గీతం హంసధ్వని రాగం లో అద్భుతం గా స్వరపరిచారు.
This song is one of the best compositions in Hamsa Dhwani. He has lent a different flavour and explored the beauty of Hamsa dhwani. A brilliant composition indeed.
బుల్లెమ్మ గారితో కలిసి పాడిన ఎంత మహిమో నీది అన్న గీతం చాలా బాగుంది. (రతి పతి ప్రియ రాగం)
జయలక్ష్మీ వరలక్ష్మీ. లలిత రాగం లో ఉన్న ఒక అద్భుత గీతం.
వచ్చెను అలమేలు మంగా అన్న గీతం సంగీత, సాహిత్య పరంగా ఒక masterpiece అని చెప్పవచ్చు.
మెరుగు వంటిది అలమేలు మంగ - ఖమాస్ రాగంలో ఉన్న ఈ కీర్తన కర్ణపేయం. అరి మురి నవ్వీని అన్న చోట ప్రసాద్ గారి ప్రతిభ తెలుస్తుంది. It bears the stamp of unique musical idiom of Telugu. Beautiful indeed.
జగన్మోహనాకార - మోహన రాగం లో ఉన్న ఒక మధుర గీతం. ఈ పాట వింటూ ఉంటే స్వామి ఎదుట నిలుచుని అన్నమయ్య పాడుతున్న భావం కలుగుతుంది. ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేము.
బాలకృష్ణ ప్రసాద్ గారి కుమారుడు అనిల్ కుమార్ తో పాటు వారి శిష్యులు ఆయన స్వరపరచిన గీతాలు పాడుతూ ఆయన సంగీత వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.
ఎందరో సంగీత కళాకారులకు గరిమెళ్ళ గారి అన్నమయ్య గీతాల ద్వారా ఒక career ఏర్పడింది అనడం అతిశయోక్తి కాదు. వారు అందించిన భక్తి సంగీత వాహిని నిరంతరంగా ప్రవహించాలి.
వారికి పద్మ అవార్డు వచ్చి ఉంటే బాగుండేది. కనీసం posthumous గా అయినా పద్మ భూషణ్ అవార్డు ఇవ్వాలి అని ఆశిస్తున్నాను.
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🏻🙏🏻
ఓం నమో వేంకటేశాయ 🙏🏻