ముందు ’ఈ పాట’ (తెండ్రల్ వందు - జేసుదాసు, జానకి ) తదుపరి ’ఇదీ’ (సొర్గమే ఎండ్రాలుమ్ - ఇళయరాజా-జానకి-1990) వినండి. చిత్రీకరణను పట్టించుకోవద్దు.
హంసనాదం రాగాన్ని ఇళయరాజా చాలా చక్కగా ఉపయోగించుకున్నాడు. ముఖ్యంగా రాజా సంగీతంలో percussion instruments కు ఒక విశిష్టత కనిపిస్తుంది. ఎన్నిరకాల beats సృష్టించాడో. పైరెండు పాటలలో beat ను గమనించండి. హంసనాదంలో నాకు తెలిసి ’నీవు నేను వలచితిమీ’ అన్న బాలమురళి-సుశీల గార్లు పాడిన పాట కర్ణ సినిమాలో ఉంది. ఎమ్మెస్వీ సంగీతంలో. చాలా హృద్యమైన రాగం. బంటురీతి కొలువియ్యవయ్యరామ ప్రసిద్ధ కీర్తన.
ఒక చిన్నమాట:అంతగా హిట్టవ్వని ఒక చిరంజీవి సినిమాలో కూడా రాజా హంసనాదంలో ఒకగీతం స్వరపరిచాడు. tune బాగుంటుందికానీ వేటూరి మసాలా లిరిక్కులు బాగుండవు .

బావుందండీ! ఇంతకు ముందు టపాలో నేను "నీవు నేను వలచితిమీ" పాటను ప్రస్తావించాక ఈ రోజు ఊరికే ఈ రాగంలో లో సినిమా పాటలేమున్నాయా అని ఆలోచిస్తూ కూడలి తెరిస్తే మీ టపా కనపడింది.
ReplyDeletepercussionist లను ఆయన ఎలా సెలెక్ట్ చేసుకుంటారో! కొన్ని పాటలు తాళానికి రావనిపిస్తుంది ఆ బీట్ వింటుంటే!
Ex;అంతఃపురం సినిమాలో "అసలేం గుర్తుకు రాదు" పాట స్టేజ్ మీద పాడటం ఎంతో కష్టమని బాలూ ఒక ప్రోగ్రామ్‌లో చెప్పారు ఈ మధ్య!
మహాకవి కాళిదాసులో పాట ఒకటి గుర్తు రావడం లేదూ ఈ రాగంలో?
చిరంజీవి సినిమా ఏమిటో తట్టడం లేదు.
సుజాతగారు ! మీ స్పందనకు నెనర్లు. మహాకవి కాళిదాసు సినిమాలో పాటలు అన్నీ నేను వినలేదు. తప్పకుండా వింటాను. చిరంజీవి స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ అనే సినిమాలో ’జిందాబాద్’ అనేపాట హంసనాదంలో ఉంది. కానీ సాహిత్యం భరించే స్థాయిలో లేదు. మీరుచెప్పింది నిజమే. వినటానికి సింపుల్ గా ఉన్నా పాడటం సులువుకాదు అసలేం గుర్తుకురాదు పాట
ReplyDelete