Thursday, March 11, 2010

గౌరి మనోహరి-కొన్ని మంచిపాటలు

నేను అమితంగా అభిమానించే ఒక రాగం గౌరి మనోహరి. ఎన్నో మంచి సినీ గీతాలు ఉన్నాయి ఈ రాగంలో. పంచదార తియ్యగా ఉంది. తేనె మధురంగా ఉంది అని చెప్పడము కంటే కొంత నోటిలో వేసుకుంటే తెలిసిపోతుంది.

రాజేశ్వర రావు గారు స్వరపరచిన ఈ రెండు పాటలు.

1) కన్నుల దాగిన అనురాగం - రంగుల రాట్నం -- పి.సుశీల, పి.బి. శ్రీనివాస్ గారు  గానం.
2) నీ జిలుగు పైటనీడలోన నిలువనీ -పూలరంగడు - సుశీల, ఘంటసాల గానం

msv సంగీతం కూర్చిన పెళ్ళీడు పిల్లలు చిత్రంలోని ’ పరువపు వలపుల సంగీతం’ పాట వింటే సుశీలగారి గానమాధుర్యం అవగతమవుతుంది. 

సుశీలగారే పాడిన ’ఎవరో రావాలీ’ పాట మామ సంగీతంలో ప్రేమ నగర్ చిత్రంలో. ఇది కొంచెం కష్టమైన పాట.

ఇంకా సితార చిత్రం లోని ’వెన్నెల్లో గోదారి అందం’ ఇదే రాగంలోని మరొక ప్రసిద్ధమైన పాట.

ఇలా ఒకే రాగంలోని పాటలు వరుసగా వింటే మెలకువగా ఉంటూనే ఒకవిధమైన నిద్రలోకి జారుకోవటం జరుగవచ్చు. ఒక కొంచెం సేపు అన్నీ మరిచిపోవచ్చు.

ఈ రాగానికి దగ్గరగా ఉండే మరొక మేళకర్త రాగమైన ’ధర్మావతి’ లో పాటల గురించి మరొకసారి వ్రాయాలని ఉంది.

3 comments:

  1. I like your Blog. thanks for posting the songs in that particular ragam. that way becomes easy to remember and identify that raga.

    Abhijnana

    ReplyDelete
  2. మంచి పాటలను గుర్తు చేశారండీ. అభినందనలు! ‘పరువపు వలపుల సంగీతం’ రచన శ్రీశ్రీ. మీరన్నట్టు సుశీల గారు చాలా బాగా పాడారు. ‘సం-గీతం’ అని పాడేచోట మెరుపు విరుపు ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది.

    ReplyDelete
  3. అభిజ్ఞాన గారు: నెనర్లు.

    వేణు గారు: thanks. నిజమే శ్రీశ్రీ గారి పాట. ఆయన శైలిలోనే సూటిగా. సుత్తి లేకుండా.

    ReplyDelete