ఎప్పటినుంచో ఈ పాట పైన ఒక టపా వ్రాదాము అనుకుంటున్నాను.
శ్రీ రామదాసు సినిమాలోని ’ఏ మూర్తి’పాట ఒక masterpiece అని అనుకుంటాను.
శంకర్ మహదేవన్ గొంతులో నాకు నచ్చిన సుగుణాలు 1) శ్రుతి. 2) శ్రావ్యత 3) స్పష్టత. కొడితే కొట్టాలిరా సిక్సు కొట్టాలి ఒకప్పుడైతే బాలు గారు పాడాలి. ఇప్పుడు శంకర్ పాడాడు. మరొకరి గొంతులో బాగుండదు.
ఇంకా కీరవాణి ఈ పాటను రేవతి లో స్వరపరచటం నాకు బాగా నచ్చింది. పాట సాహిత్యం కూడా చాలా గంభీరంగా విలక్షణంగా ఉంది. పాట బాణీ 'un-keeravani-esque' గా ఉంది. రామదాసు సినిమాకే తలమానికం వంటి పాట ఏమూర్తి పాట.
రేవతి మంచి vibrant రాగం. ఒక healing touch ఉన్న రాగం. ఎప్పటినుంచో ఒక పూర్ణకుంభం లాంటి పాటకోసం ఎదురుచూశాను. ఈ పాటతో ఆ కోరిక తీరింది.
ఈ రాగంలో నాకు నచ్చిన కొన్ని పాటలు :
’మానసవీణ మధుగీతం’- పంతులమ్మ (పాట పల్లవి, మొదటి చరణం వరకు రేవతి)
’నానాటి బతుకు నాటకము’
ఇంకా ఝుమ్మందినాదం సై అంది పాదం, ఓ బంగరు రంగుల చిలకా పలకవే, అభినవ శశిరేఖవో,ఉదయకిరణ రేఖలో etc.. ఉన్నాయి .

రేవతి రాగం చాలా ఆర్దృంగా ఉంటుందండి! అందువల్ల మన వాళ్లు దాన్ని దుఃఖాన్ని సూచించే పాటలకు కూడా చక్కగా వాడేస్తుంటారు. దేవదాసు మళ్ళీ పుట్టాడు సినిమాలో ఎవరికి ఎవరూ పాట చూడండి!
ReplyDeleteశ్రీరామదాసు లో ఏ మూర్తి పాట నాకూ చాలా ఇష్టం! శంకర్ మహదేవన్ కాకుండా ఇంకెవరైనా అయితే..అంత ఆర్దృత,అందం వచ్చేదా..ఏమో చెప్పలేను. పూర్ణకుంభం లాంటి ఫీలింగ్ కలిగిందంటే అది శంకర్ మహదేవన్ వల్లే అనుకుంటాను.శాస్త్రీయం,ఫ్యూజన్,రాక్, హిందీ ఏదైనా పాడగల సమర్థుడు శంకర్ మహదేవన్. ఒక పోస్టే ఆయన గురించి రాయాలి ఎప్పుడో!
ఈ రెండు పాటలూ..(.ఏ మూర్తి, ఎవరికి ఎవరు...) రేవతి కి రెండు extremes అనిపిస్తుంది !
నిజం సుజాత గారు. రేవతిలో ఆర్ద్రత ధ్వనిస్తుంది. ఒక విషయం మరచి పోయాను. తిరుమలలో అంతటా ’శ్రీనివాసా గోవిందా’ అని వినిపించే గోవిందనామాలు రేవతిలో పాడినారు పారుపల్లి రంగనాధ్
ReplyDelete