Tuesday, October 19, 2010

నది గొంతులో అలపాట

మండుటెండలో చలివేందర కనిపించి దాహం తీరితే కలిగే ఆనందం. ’ఒకమనసుతో ఒక మనసుకి ముడి ఎట్టా వేస్తావు’. ఈ పాట వింటే కలుగుతుంది .

ఒక్కోసారి మంచి పాటలు చెవినపడటం ’serendipity' అనుకుంటాను.

రాగం కళ్యాణి. రాగలోకానికి మకుటం ఉన్న మహారాణి. పూర్ణమద: పూర్ణమిదం. అన్నట్టుగా పరిపూర్ణమైన రాగం.

కీరవాణి, గంగ పాడారు. ఈ అబ్బాయి చాలా మంచోడు అనే ఒక రవితేజ సినిమాలోది. కీరవాణి పాడితే నాకు నచ్చదు కానీ ఈ పాట అతను బాగానే పాడాడు అనిపించింది.

పాట సాహిత్యం హృదయంగమంగా ఉన్నది. కవితాత్మకత ఉట్టి పడుతోంది. సాధారణంగా పాట సాహిత్యంలో సంక్లిష్టత, అస్పష్టత కొంచెం ఎక్కువైనా నా mind blank అవుతుంది. పాటలోని కొన్ని మాటలు ఇలా ఉన్నాయి.

’పసిపాపలో ముసినవ్వులా కపటాలు లేని ప్రేమ
మునిమాపులో మరుమల్లెలా మలినాలు లేని ప్రేమ’

’అరచేతిలో నెలవంకలా తెరచాటులేని ప్రేమ
నదిగొంతులో అలపాటలా తడబాటు లేని ప్రేమ’

thanks కీరవాణి & చంద్రబోస్.

2 comments:

  1. ఇంత శ్రావ్యమైన పాటను ఎలా మిస్సయ్యానో కదా... థాంక్యూ!

    ‘మలినాలు లేని’. ‘తడబాటు లేని’ అనే చోట్ల విరుపు అందంగా ఉంది. ‘నది గొంతులో అలపాట’ అనే వ్యక్తీకరణ చక్కగా ఉంది. ఇలాంటి పాటల సాహిత్యాన్ని కొంచెం ఓపిక చేసుకుని, టపాలో పూర్తిగా ఇస్తే బావుంటుంది కదండీ!

    ReplyDelete
  2. వేణు గారు! బాగా నచ్చిన రెండు పాదాలు మాత్రమే వ్రాశాను. అంతే. నెనర్లు.

    ReplyDelete