నేను ప్రాణంగా ప్రేమించే రాగం పైన రాస్తున్నఈ టపాతో నా కల నెరవేరింది. కొండను కొంచెం అద్దంలో పట్టుకుంటాను.
ఆరభి, సామ ,శుద్ధ సావేరి రాగాలు ఒకే నదిలోని మూడు పాయలుగా అనిపిస్తాయి నాకు. ముఖ్యంగా శుద్ధ సావేరి
సమ్మోహన శక్తి ఉన్న రాగం. ఈ రాగాలలో ఉన్న మాధుర్యం చెప్పనలవి కాదు.
బృందావనమది అందరిది తో మొదలైన ఆ ఇష్టం పాడనా తెనుగు పాట తో అమాంతం పెరిగిపోయి జానకి కలగనలేదు పాటతో సంపూర్ణమైంది.
జానకి కలగనలేదు పాటకు all time ఇళయరాజా favourites లో రెండవ స్థానం ఇస్తాను. (first spot is a no brainer. మాటే మంత్రము పాటకు చెందుతుంది.) ఎంత గొప్పపాట. కొన్ని వందలసార్లు విన్నా మళ్ళీ వినాలనిపిస్తుంది. they marred the picturization of this song with comical steps. ఆత్రేయ సాహిత్యం,సుశీల, బాలు యుగళం--తెలుగు సినిమా పాటలకే తలమానికం వంటి పాట ఇది.
అసలు ఈ పాటకు బీజం పాడనా తెనుగు పాట (అమెరికా అమ్మాయి) తో పడింది అనుకుంటున్నాను. ఎందుకంటే స్వరకర్త g k వెంకటేశ్ కు అప్పుడు ఇళయరాజా సహాయకుడు గా ఉన్నాడు. ఈ పాట సాహిత్యం దేవుల పల్లి. ఆ పేరే చాలు. ఈ పాటలో వీణ, వయొలిన్లు చాలా చక్కగా western style ను కర్ణాటక శైలి లో fusion చేసిన విధానం అపురూపం. సుశీలగారు మాధుర్యానికి care of address అని చెప్పటం లో పునరుక్తి దోషం ఒక్కనాటికీ ఉండదు.
ఆరభి రాగానికి బైబిల్ వంటి కీర్తన ’సాధించెనే’. త్యాగరాజ స్వామి వారి పంచరత్న కృతి. ముఖ్యంగా బాలమురళి ఈ కీర్తన ను అనితర సాధ్యంగా పాడారు. త్యాగరాజ స్వామి వారి పంచరత్న కృతుల సాహితీ, సంగీత మాధుర్యాన్ని ఆస్వాదించటానికి ఒక జీవితకాలం సరిపోదు.
రెండు మెచ్చు తునకలు- ’సమయానికి తగు మాటలాడెనే’, ’వెత కలిగిన తాళుకొమ్మనెనే’.

తీయని పాటలు గుర్తు చేశారు. ‘కొండను కొంచెం అద్దంలో’ కాకుండా కాస్త పెద్ద అద్దంలో పట్టొచ్చు మీరు! (టపాల్లో సంగీత విశేషాలను ఇంకా వివరంగా ఇవ్వమని...)
ReplyDelete‘పాడనా తెనుగుపాట’ లో ప్రస్ఫుటంగా వినిపించే మధుర వాద్యసంగీతం ఇళయరాజానే స్వయంగా అందించాడని ఓ రేడియో ఇంటర్ వ్యూలో గొల్లపూడి చెప్పారు.
మీరు ఇలాంటి పాటలకు వీడియో కాకుండా ఆడియో లింకులు అందిస్తేనే వినటం సౌకర్యంగా ఉంటుందని నా సూచన.
వేణు గారు! నెనర్లు.
ReplyDelete