చిత్రగారు. మధుర గాయని. స్వచ్చమైన నవ్వుతో చూడగానే పవిత్రభావం కలిగే ముఖం ఆమెది. ఆమె తెలుగు ఉచ్చారణ ఎంత బాగా ఉంటుంది! పెను విషాదం. వివాహమైన పదిహేనేళ్ళకు పుట్టిన అమ్మాయి తొమ్మిదేళ్ళ చిన్నారి మరణం ఆమె అభిమానుల హృదయాలను తీవ్రంగా కలచివేస్తోంది.
చిన్నారి నందన. అందరికీ అమృతం పంచిన మీ అమ్మ ను ఎలా ఓదార్చ గలమమ్మా?
చిత్రగారు ఎన్నో వందల పాటలు పాడారు. ఆమె కర్ణాటక సంగీతం క్షుణ్ణంగా నేర్చుకున్నవారు. అందుకే ఆమె గొంతులో శ్రుతి, శ్రావ్యత ఉత్తమ స్థాయిలో ఉంటాయి.
రెండు మంచి పాటలు గుర్తు చేసుకుంటాను.
ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో-- ఈ పాటకు తప్పకుండా జాతీయ బహుమతి ఇవ్వవలసిన పాట. చిత్రగారు తప్ప ఇంకెవ్వరూ ఈ పాట పాడలేరు.
వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి. శుభపంతువరాళి లోని విషాదం చిత్రగారిని కమ్ముకుంది. ఆమె దు:ఖం ఎవరూ తీర్చలేనిది.