Saturday, April 16, 2011

వేణువై తాను భువనానికి వచ్చి గాలిలా గగనంలో కలిసిపోయిన చిన్నారి.



చిత్రగారు. మధుర గాయని. స్వచ్చమైన నవ్వుతో చూడగానే పవిత్రభావం కలిగే ముఖం ఆమెది. ఆమె తెలుగు ఉచ్చారణ ఎంత బాగా ఉంటుంది! పెను విషాదం. వివాహమైన పదిహేనేళ్ళకు పుట్టిన అమ్మాయి తొమ్మిదేళ్ళ చిన్నారి మరణం ఆమె అభిమానుల హృదయాలను తీవ్రంగా కలచివేస్తోంది.

చిన్నారి నందన. అందరికీ అమృతం పంచిన మీ అమ్మ ను ఎలా ఓదార్చ గలమమ్మా?

చిత్రగారు ఎన్నో వందల పాటలు పాడారు. ఆమె కర్ణాటక సంగీతం క్షుణ్ణంగా నేర్చుకున్నవారు. అందుకే ఆమె గొంతులో శ్రుతి, శ్రావ్యత ఉత్తమ స్థాయిలో ఉంటాయి.

రెండు మంచి పాటలు గుర్తు చేసుకుంటాను.

ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో-- ఈ పాటకు తప్పకుండా జాతీయ బహుమతి ఇవ్వవలసిన పాట. చిత్రగారు తప్ప ఇంకెవ్వరూ ఈ పాట పాడలేరు.

వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి. శుభపంతువరాళి లోని విషాదం చిత్రగారిని కమ్ముకుంది. ఆమె దు:ఖం ఎవరూ తీర్చలేనిది.

4 comments:

  1. అవునండీ! ఆ విషాద వార్త తెల్సిన తర్వాత చిత్ర గారిని ఓదార్చగలిగే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉంటే బాగుండనిపించింది. ఇంకా _______ఇంకా మర్చిపోలేకపోతున్నాను. వివాహం తర్వాత పదిహేనేళ్ళ తర్వాత వడి చేరిన పాప ఇంత త్వరగా వీడిపోవడం ఆమెకు ఎప్పటికీ తీరని దుఃఖమే! గుర్తొచ్చినపుడల్లా గుండె ఝల్లుమంటోంది!

    వేణువై వచ్చి కొన్నాళ్ళు మురిపించి గాలై గగనంలో కల్సి పోయింది ఆ పాప!

    ఇహ ఈ జన్మకు చిత్ర గారి మనోవేదన ఎవరూ తీర్చలేనిదే!

    ReplyDelete
  2. పాపకోసం సినిమా అవకాశాలని వదులుకుంటున్నాను, ముఖ్యమైతే తప్ప పాడడం లేదు అని ఆవిడ చాలాసార్లు చెప్పారండి. పాపం ఎలా భరిస్తున్నారో ఆ బాధని. దేవుడు ఆమెకి త్వరగా కోలుకోగలిగే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను.

    ReplyDelete
  3. నేను ఆసియానెట్ వారి 'స్టార్ సింగర్' చూడటం నాకు ఇష్టమైన సాయంకాలపు కాలక్షేపం. ఆ కార్యక్రమములోనే చిత్రగారిని చూడటం. అంతకుముందు పాటలు విన్నా పెద్దగా పట్టిచ్చుకున్నది లేదు. మలయాళములో ఆమె పాడె భక్తిగీతాలు చాలాబాగుంటాయి. శిశిరగారు చెప్పినట్టు పుట్టుకతో డౌన్సుసిండ్రోమ్ బాధితురాలైన పాపకోసమే చాలా అవకాశాలు వదులుకుంటున్నాని అనేక ముఖాముఖిల్లో స్పష్టం చేశారు. అలాంటిది ఆ పాపనే దూరం చేయటం విధి వైచిత్రి.

    ReplyDelete
  4. idhi chala vishadhakaramaina sanghatana...god almighty must not have done like this....

    ReplyDelete