Friday, August 12, 2011

కళ్ళెత్తితే చాలు- కనకాభిషేకాలు

ఈ బంగారు నగల షాపువాళ్ళ ad లు ఎవరు తీస్తున్నారోగానీ చాలా సృజనాత్మకంగా lively గా ఉంటున్నాయి.

ఉద్యమం వార్తలు , పచ్చ మీడియా systematic గా చేసే character assassination కథనాలు, ఓదార్పు, వై యస్ బొమ్మల వార్తలు, ఇతర దరిద్రగొట్టు కార్యక్రమాల నుంచి చాలా relief గా అనిపించాయి (yeah. I took care to be politically correct) .

నాగార్జున కళ్యాణ్ జువెలర్స్ ad బాగుంది.


నేపథ్యంలో వచ్చే వేణువు చాలా నచ్చింది నాకు. లఘుచిత్రంలోనే ఒక చిన్నకథను చెప్పినట్టుగా చాలా బాగా తీశారు.


జూ ఎన్టీఆర్ మలబార్ గోల్డు
కూడా బానే ఉంది. తను మంచి సహజనటుడు. కానీ తను నటించే సినిమాలన్నింటిలోనూ నేలవిడిచి సాము చేసే పాత్రలే. ఆ సినిమాల్లో లేని సహజత్వం ఈ adలలో నాకు కనిపించింది. కొంచెం swagger తగ్గించుకుంటే ఇంకా బాగుండేది.




ఈ తనిష్క్ వారి glamgold ad భలేగా ఉంది. ముఖ్యంగా leading lady ఎంతో graceful గా ఉంది

కొంచెం గాయని సునీత పోలికలు ఉన్నాయి ఆమెలో.

నాకు ఈ ప్రచారచిత్రాలు నచ్చాయి. అంతే కానీ బంగారం కూడబెట్టే ఉద్దేశ్యమేవీ లేదు.

p.s. టపా శీర్షిక కొంచెం class ఎక్కువైనట్టుగా ఉంది.

3 comments:

  1. టపా శీర్షికలో నిజంగానే class ఎక్కువైంది. ‘కళ్ళెత్తితే చాలు- కనకాకర్షణలు’ అంటే సరి! :)

    ReplyDelete
  2. ఈ మధ్య ఇదే టాపిక్ మీద నేనో బజ్జు (గూగుల్ బజ్) రాశానండీ! ఈ పోకడ ఈ మధ్యనే మొదలైంది. ఒకసారి ఈ లింక్ చూడండి


    https://plus.google.com/113352906292796986132/posts/9xSkzuGinQ8

    ReplyDelete
  3. వేణుగారు! బాగుంది. నెనర్లు. మీ బ్లాగు స్ఫూర్తి తోనే కొంచెం బొమ్మలు అవీ పెట్టాను.

    సుజాతగారు! మీరు వ్రాసిన buzz ఇప్పుడే చూచాను. బాగుందండి. నేను buzz లో లేను. new technologyకి adapt అవటంలో కొంచెం వీక్ కావటంతో నాకు buzz అర్థం కాలేదు. anyways blogging is ok for my pace. --తెలుగు అభిమాని.

    ReplyDelete