Wednesday, November 2, 2011

తెలుగు లో 10 అత్యుత్తమ సంగీతభరిత చిత్రాల జాబితా--నా దృష్టిలో

తెలుగు లో 10 అత్యుత్తమ సంగీతభరిత చిత్రాల జాబితా కూర్చాలి అనిపించింది. (పదే ఎందుకు అంటే ప్రత్యేకంగా ఏమీ లేదు).
ఈ జాబితా తయారు చేయటంలో నేను పరిగణన లోకి తీసుకున్న అంశాలు 1) ఎక్కువ శాతం పాటలు మాధుర్యంతో నిండి ఉండాలి 2) సాహిత్యం అర్థవంతంగా కుదరాలి 3) గాయనీ గాయకుల అద్భుత గానం 4) ఎంతకాలం గడచినా ఇంకా వినాలి అనిపించాలి.

కొన్నేళ్ళ క్రితమైతే ఈ జాబితా వేరుగా ఉండేది. ఇప్పుడు బేరీజు వేయటం లో కొంత పరిపక్వత వచ్చిందని (really?) అనుకుంటున్నాను.

1) లవకుశ : ఘంటసాల సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి అగ్ర తాంబూలం. ఎవ్వరూ ఎన్నటికీ అధిగమించలేని divine music. లీల,పి సుశీల, ఘంటసాల గార్ల సంగీత యాత్రకు పరమపదం గా చెప్పవచ్చు. ఈ సంగీతం న భూతో న భవిష్యతి

2) మల్లీశ్వరి : ఈ చిత్రంలోని పాటలు ఇప్పుడు కొద్దిగా jaded గా అనిపించవచ్చు. కానీ puritan ల దృష్టిలో ఇవి అజరామరమైన పాటలు. దేవులపల్లి, రాజేశ్వరరావు,ఘంటసాల, భానుమతి గారు. "ఊరు చేరాలి", మనసున మల్లెల మాలలూగెనే, ఆకాశవీధిలో.. పాటలు ఎన్నటికీ మరువలేము. దేవులపల్లి సంస్కృతంలో పండితులై ఉండి అచ్చతెనుగులో వ్రాయటం గొప్పవిషయం.

3) మాయాబజార్: అన్నిపాటలు ఆణి ముత్యాలే. రాజేశ్వరరావు, ఘంటసాల స్వరరచన. నాకు ప్రత్యేకించి ’చూపులు కలసిన శుభవేళ’ పాట చాలా ఇష్టం. అలాగే లాహిరిలాహిరి, వివాహ భోజనంబు అన్నీ super duper hits.

4) గుండమ్మకథ: చిత్రంలోని అన్ని పాటలు haunting మెలొడీలే. ఎప్పటికీ నిలిచిఉండే జనరంజకమైన బాణీలను కట్టడంలో ఘంటసాల గారికి అగ్రాసనం. my favourite : కనులు తెరచినా నీవాయె.

5)అక్బర్ సలీం అనార్కలి: ఈ చిత్రం ఒక గొప్ప musical అని నా అభిప్రాయం. సినారె సాహిత్యం, సుశీల, రఫి గానం, సి రామచన్ద్ర సంగీతం అన్నీ అద్భుతంగా కుదిరాయి. తానే మేలి ముసుగుతీసి ఒక జవ్వని, తారలెంతగా మెరిసేనో, రేయి ఆగిపోని, సిపాయీ సిపాయీ.. ఎంత గొప్ప పాటలవి.

6) అన్నమయ్య : నేదునూరి గారు, మల్లిక్, రాళ్ళపల్లి గారు, బాలకృష్ణప్రసాద్ వంటి పండితులు కట్టిన బాణీలనే అన్నమయ్య చిత్రంలో దాదాపుగా వాడినా అవి ఎన్నటికీ వాడిపోని పూలలాంటివి గనుక శాశ్వతంగా నిలిచిపోయాయి. pick of the album : అంతర్యామి పాట.

7) మేఘసందేశం: దాసరి నారాయణరావు తీసిన అత్యుత్తమ చిత్రం ఇదే. నాగేశ్వరరావు గారు, జయప్రద, జయసుధ, జగ్గయ్య.. అందరూ దిగ్గజాలే. రమేశ్ నాయుడు సంగీతం. తెలుగుదనం ఉట్టిపడే లలిత సంగీతం. మాధురీ లహరి. ఆకులో ఆకునై,పాడనా వాణి కళ్యాణిగా, సిగలో అవి విరులో, ముందు తెలిసెనా ప్రభూ, నిన్నటిదాకా శిలనైనా, ప్రియే చారుశీలే, శీత వేళ రానీయకు అన్ని మంచిపాటలు ఒకే చిత్రంలోనే. జేసుదాస్, సుశీల గారు. simply the best.

8) శ్రీ షిర్ది సాయిబాబా మహత్యం : విజయచందర్ సాయిబాబా పాత్రలో జీవించిన ఈ చిత్రంలో అన్ని పాటలూ హిట్సే. ఇళయరాజా సంగీతం, ఆత్రేయ సాహిత్యం పడుగు పేక లాగా కలిసిపోయి చక్కటి పాటలు వెలిశాయి. మా పాపాల తొలగించు, నువ్వు లేక అనాథలం,సాయి శరణమ్, బాబా సాయిబాబా,దైవం మానవ రూపంలో అన్నీ మేలిమి వజ్రాలే. ప్రత్యేకించి : బాలు పాడిన బాబా సాయిబాబా పాట.

9) శ్రీ సాయి మహిమ: అంతగా వెలుగులోకి రాని ఈ చిత్రం లోని పాటలకు నేను పెద్ద పీటే వేస్తాను. అత్య్తుత్తమ సంగీతం అనటంలో ఏమాత్రం సందేహం లేదు. సంగీతం అనూరాధ పౌడ్వాల్ కుమారుడైన ఆదిత్య పౌడ్ వాల్. అంత చిన్న కుర్రవాడు ఈ స్థాయి సంగీతం అందించాడంటే నేను ఇప్పటికీ నమ్మలేను. సినారె సాహిత్యం అత్యుత్తమంగా ఉంది. బాలు, జానకి, అనురాధ గార్లు అన్నిపాటలకు ప్రాణం పోశారు.
నిజం చెప్పాలంటే ఈ గీతమాలికలోని అన్నిపాటలు నాకు చాలా ఇష్టం. సాయిదివ్యరూపం, నిన్ను గని శరణమని, సాయి దేవా, ఎంతెంత దయనీది ఓ సాయి. divine music.

10) శంకరాభరణం: విశ్వనాధ్ గారి చిత్రం లేకుండా ఈ జాబితా పూర్తి చేయటం పెద్ద తప్పు అవుతుంది. అన్నీ గొప్ప బాణీలు అని చెప్పలేను కానీ పవిత్రత, నిబద్ధత కలిగిన సంగీతం. ముఖ్యంగా సామజవరగమన పాటమధ్యలో చరణాలు కల్పించటం చాలా చక్కగా కుదిరింది. దొరకునా ఇటువంటి సేవ పాట అత్యుత్తమం. కానీ రెండు అసంతృప్తులు ఉన్నాయి. సుశీలగారికి ఈ చిత్రంలో పాట లేక పోవటం. అలాగే ఓంకారనాదానుసంధానమౌ, రాగం తానం పల్లవి ఈ రెండు పాటల బదులు సంప్రదాయ గీతాలు పెట్టి ఉంటే బాగుండేది అనిపించింది.

almost there : భక్త ప్రహ్లాద, మహాకవి కాళిదాసు.

అమ్మయ్య. ఎప్పటినుంచో వ్రాయాలి అనుకున్న ఈ టపా ఇప్పటికి నెరవేరింది. ఈ జాబితా నా personal choice మాత్రమే. సంగీత ప్రేమికుల జాబితాలో తప్పక ఇతర చిత్రాలు ఉండటం perfectly possible and okay.

12 comments:

 1. మీతో చాలా వరకూ ఏకీభవిస్తున్నాను. ఇంకా చెప్పాలంటే ద్వివీభవిస్తున్నాను. లవకుశ,గుండమ్మ కథ,షిర్డీ సాయిబాబా మహత్మ్యం,సాయి మహిమ,అక్బర్ సలీం అనార్కలి,మల్లీశ్వరి,----విషయంలో! మేఘ సందేశం,శంకరాభరణం, సినిమాల సంగీతం నాకెందుకో ఇంకా ఇంకా మెరుగ్గా ఉండొచ్చు అనిపిస్తుంది. శాస్త్రీయ సంగీతం బాగా సాహన చేసిన వారిచేత ఓంకార నాదాను సంధానమౌ పాట పాడిస్తే బాగుండేదని ఇప్పటికీ అనిపిస్తుంది. ఆ పాట స్వరాల్లో చివర్లో బాలూకి అపశ్రుతి పడిందని నా విశ్వాసం. మేఘ సందేశం పాటలు డ్రై గా అనిపిస్తాయెంచేతో!

  అన్నమయ్య విషయంలో విభేదిస్తున్నాను. చెప్పుకోగదగ్గ పాటలేమీ అందులో లేవని నా అభిప్రాయం.

  భక్త ప్రహ్లాద పాటలు చాలా బాగుంటాయి. చెప్పుకుంటూ పోతే బోల్డు సినిమాలు గుర్తొస్తాయేమో కదండీ! శ్రుతి లయలు మాట ఎత్తలేదే మీరు? మీరన్నటు ఎవరి ఛాయిస్ వాళ్ళకున్నా, మనతో ఏకీభవించే వారు కనిపిస్తే సంతోషంగా ఉంటుంది.

  సాయి మహిమలో పాటలు నాకు బాగా నచ్చుతాయి. "షిరిడీలోని దైవము నేనే" పాట బాగుంటుంది. అలాగే షిర్డీ సాయి బాబా సినిమాలో "మా పాపాల తొలగించు" పాట (ఏ రాగం ఇది?) చాలా టచింగ్ గా ఉంటుంది.

  ReplyDelete
 2. మీ ఎంపిక చాలావరకూ బాగుంది. అయితే ‘టాప్ టెన్’ అనే పరిమితి లేకుండా ఉంటే ఇంకా కొన్ని సినిమాలకు చోటు దక్కేది! మీరు వదిలేసిన చిత్రాల గురించి ఆలోచిస్తే విశ్వనాథ్ సినిమాలే ‘స్వాతి కిరణం’, ‘సిరివెన్నెల’, ‘స్వర్ణ కమలం’ చప్పున గుర్తొస్తున్నాయి. రమేశ్ నాయుడు పాటలున్న మరికొన్ని సినిమాలు కూడా!

  ReplyDelete
 3. సుజాత గారు: మీ స్పందనకు నెనర్లు. మీరు అన్నట్లు మరికొన్ని మంచి సంగీత భరిత చిత్రాలు ఉన్నాయి. ఎంచుకోవటం కష్టమే. రమేశ్ నాయుడు సంగీతం pure raga based గా ఉండదు. అందువల్లేనేమో dry గా అనిపిస్తూనే వినసొంపుగా ఉంటాయి. it sort of grows on the ears.

  'మా పాపాల తొలగించు’ పాట మాయా మాళవ గౌళ / బౌళి రాగం. చాలా మంచిపాట. శిరిడిలోపలి దైవము నేనే పాట చాలా బాగుంది.

  వేణుగారు: నెనర్లు. స్వాతికిరణం, సిరివెన్నెల,స్వర్ణకమలం, స్వాతిముత్యం, సాగరసంగమం, సీతాకోక చిలుక, శుభోదయం,సిరిసిరి మువ్వ..it is really difficult to leave them out. మీరు చెప్పినట్టు పరిమితి లేకుండా చూస్తే ఇవన్నీ ఆణిముత్యాలే. రమేశ్ నాయుడుగారి సంగీతంలో ఆనందభైరవి, ముద్దమందారం శివరంజని,తూర్పు పడమర లాంటి గొప్ప చిత్రాలు ఉన్నాయి.
  -తెలుగు అభిమాని

  ReplyDelete
 4. డా:చక్రవర్తి,నర్తనశాల,వెలుగునీడలు లాంటి చాలా సినిమాలు మీ లిస్టులో చోటు సంపాదించలేదే!

  ReplyDelete
 5. నా కెందుకో భూకైలాస్ మరియు దేవదాసు సంగీతం ఆత్యద్భుతం అనిపిస్తుంది

  ReplyDelete
 6. తారకం గారు: డా:చక్రవర్తి,నర్తనశాల,వెలుగునీడలు.. మంచి సంగీతభరిత చిత్రాలే. సందేహంలేదు.
  అరవింద గారు: భూకైలాస్, దేవదాసు. సంగీతం అత్యద్భుతం. agree with you.

  ReplyDelete
 7. ఏమండీ
  నా దగ్గర కొన్ని పాటలున్నాయి, పాడినది పేరున్నవారే ఐనప్పటికీ వాటిని ఎవరూ విని ఉండలేదు ఇప్పటిదాకా, మీరు విని వాటిగురించి కాస్త రాస్తారా? మీకు ఆ సీడీలు అందజేయగల ఉపాయం తెలియచెప్తారా??

  ReplyDelete
 8. సంగీత సాహిత్య పరంగా మీరు చెప్పినవన్నీ నిస్సందేహంగా మంచి చిత్రాలే.
  ఒక చిన్నమాట చెప్పాలనిపిస్తోంది. మన సినీ సంగీతంలో రెండు పాటలున్నాయి, ఒకటి తెలుగులోనూ, మరోటి హిందీలోనూ. ఇవి అద్వితీయం, నిరుపమానమూనూ.
  పెళ్ళీ అంటే శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి అనే పాటకు మరో ప్రత్యామ్నాయం ఉందా?? మహానుభావుడు శ్రీ గాలిపెంచెల నరసిమ్హారావుగారి సృష్టి

  అలాగే పాము అంటే తన్ డోలే మెర మన్ డోలే పాటనే చెప్పుకోవాలి.
  వీటికి దీటైన పాటలు ఎవరైనా ఇప్పటివరకూ చేసేరంటారా??

  ReplyDelete
 9. కామేశ్వర శర్మ గారు: మీ వ్యాఖ్యకు నెనర్లు. మీరు చెప్పింది నిండునిజం. శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి పాట సంగీత మేరు పర్వత శిఖరాన ఎప్పటికీ ఉంటుంది. మీ దగ్గర ఉన్న వెలుగులోనికి రాని పాటలు వినాలని నాకు అనిపిస్తుంది. నేను బోధన్ లో ఉంటున్నాను. హైదరాబాదు లో మిమ్ములను కలిసే అవకాశముంటే మీ దగ్గర ఉన్న పాటలు వింటాను. లేదా మీరే వీలుంటె మీ బ్లాగులో వ్రాయండి.

  ReplyDelete
 10. సాయి, అక్బర్ సలీం పాటలు ఈ లిస్ట్‌లో చేర్చడం సరి కాదు.

  ReplyDelete
 11. తెలుగు అభిమాని గారూ,
  ధన్యోహం.
  నేను ఇండియాలో ఉండను కనుక హైదరాబాద్ లో మనం కలువలేము.మీ చిరునామా నాకు పంపితే ఆ సీడీలు మీకు పంపగలను. నా ఈ మెయిల్ ఐడీలు ఇవీ
  sarmaji@eim.ae
  sk.sarma@adssc.ae


  ఆ సీడీలు నా స్వంతం, ఒక ఆల్బం కు సంగీత సాహిత్యాలు నేను చేసేను, బాలూ శైలజగార్లు పాడగా బాపుగారు ముఖచిత్రం వేసి ఇచ్చేరు. రెండవ ఆల్బం కు సాహిత్యం నాది కాగా శ్రీ మాధవపెద్ది సురేష్ గారు స్వరపరచగా నేటి తరం గాయకులు కారుణ్యా, మాళవికా, ప్రణవీ తదితరులు పాడేరు. ఈ పాటలు కేవలం నా ఇంటి నాలుగు గోడలమధ్యనే ఉన్నాయి. కొద్ది మంది మిత్రులకు సీడీలు ఇవ్వడం జరిగింది

  ReplyDelete
 12. అన్నట్టు చెప్పడం మరచేను, నాకంటూ బ్లాగు లేదండీ.

  ReplyDelete