Friday, November 25, 2011

ఇళయరాజాకు కీరవాణి అంటేనే ఎందుకో అంత ఇష్టం..కొన్ని సంగీత కబుర్లు.

శ్రీరామ రాజ్యం చిత్రంలోని ఈ పాట further proof of that.

పంచభూతాలు అచ్చ తెలుగులో నింగి,నేల,నీరు,నిప్పు, గాలి (ఈ ఒక్క పదం నకారంతో దొరికితే బాగుంటుంది). గాలి నింగి నీరు, నేల నిప్పు మీరు. పాట బాగుంది. ఎన్ని పాటలు కీరవాణిలో స్వరపరిచాడో ఇళయరాజా.

జగదానందకారక పాట చాలా బాగుంది.(శుద్ధ ధన్యాసి). పాట సాహిత్యం,బాణీ, సంగీతం, చిత్రీకరణ ఉత్కృష్టంగా ఉన్నాయి. బాలు చక్కగా పాడితే. శ్రేయ గోశాల్ క్రూనింది.

అలాగే వసంత రాగంలోని శ్రీరామ లేరా పాటను కూడా ఇద్దరూ (రాము, శ్రేయ) స్పష్టతలేకుండా గొణిగేశారు.

ఈ చిత్రంలో నాకు ముఖ్యంగా జొన్నవిత్తుల సాహిత్యం బాగా నచ్చింది. ఆత్రేయలా, సినారెలా వ్రాశాడు ఆయన. వేటూరిలా వింత పోకడలు పోకుండా, సిరివెన్నెలలా నారికేళపాకాలు కాకుండా బాగున్నాయి. (వేటూరి, సిరివెన్నెల కు నేను కూడా అభిమానినే కానీ.. వేటూరి చక్రవర్తి కలిపి వండి వార్చిన కుంభీపాకాలు చప్పున గుర్తుకు వస్తాయి.)


కానీ కీరవాణికి కీరవాణి అంటే పెద్దగా నచ్చదేమో. నే విన్నంతలో వెతికితే ఈ ఒక్క పాటే దొరికింది. ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని.(అనుకోకుండా ఒక రోజు). పాట ఎత్తుగడ, సాహిత్యం బాగుంది (సిరివెన్నెల) స్మిత చక్కగా పాడింది. song would have been better if it were a tad slow paced.తన voice culture బాగుంటుంది. కానీ ఎందుకో తను సినిమాలలో పాడదు.

8 comments:

 1. కీరవాణిలో ఇళయరాజా స్వరపరిచిన ఇతర గీతాలను కూడా ఓసారి గుర్తు చేయండి (ఇలాగే లింకులిస్తూ). మీ టపాలో రాసిన ‘క్రూనింది’అంటే ఏమిటో అర్థం కాలేదు!

  ReplyDelete
 2. వేణు గారు: నెనర్లు. శిర్ది సాయిబాబా మహాత్మ్యం లోని ’బాబా సాయిబాబా’ పాట, అన్వేషణ లోని కీరవాణి పాడలేదు, చంటి లోని ఎన్నెన్నో రాగాలు, వారసుడు లో నీ గీతం నా గీత గోవిందం, లేడీస్ టైలర్ లోని గోపీలోల, ఇంకా చాలా తమిళ గీతాలు కీరవాణి రాగంలో ఉన్నాయి. ఈ పాటలకు లింకులు కూడా ఇస్తాను.

  శ్రేయా గోశాల్ గొంతులో మంచి మాధుర్యం ఉంది. కొంచెం తెలుగు ఉచ్చారణ ఇబ్బంది పెడుతుంది. ఇంకా open voice తొ పాడితే బాగుంటుంది అనిపించింది.. కొంచెం crooning లాగా అనిపించినా చక్కగా పాడింది ఆమె.

  ReplyDelete
 3. ఏమనుకొంటావురా నిన్ను నీవు?
  నువ్వే పెద్ద సంగీత స్రష్టవా? సాహిత్యంలో పెద్ద దిట్టవా?
  ఎవరిని పడితే వాళ్ళను ఏకి పారేస్తావు?
  ఏ కళాకారునికైనా తనదంటూ ఒక శైలి ఉంటుంది. అదీ గాక సమయం, సందర్భాన్ని బట్టి కొన్నిసార్లు కొన్ని రకాల సృజన చేయాల్సి ఉంటుంది.
  అది తెలుసుకొని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యాఖ్యలు చెయ్.

  ReplyDelete
 4. 'క్రూనింది' అనే పదప్రయోగం చక్కగా కుదిరింది. :))

  ReplyDelete
 5. anonymous : అంతలా అనేసావేంటి బాస్. నా బ్లాగు రాతలను నేనే అంత serious గా తీసుకోను. light తీస్కో. అయినా నా రాతలలో విమర్శలకంటే ప్రశంసలే ఎక్కువగా ఉంటాయే. మరీ ’రా’ ’బే’ లాంటి మాటలతో అంత ఆప్యాయత చూపితే నేను తట్టుకోలేకపోతున్నా.కొద్దిగా tone down చేస్తే బాగుంటుందేమో

  snkr ji : thank you.

  ReplyDelete
 6. నాదో సందేహం.
  శ్రీరామరాజ్యం లోని రామ, రామ, రామ అనే రాజమందిరం పాట మర్యాదరామన్న లోని రాయె, రాయె రాయె సలోని అన్న పాట బాణీ ఒకలాగే అనిపిస్తాయి. మీ అభిప్రాయం?

  ReplyDelete
 7. bonagiri garu :

  welcome to my blog. sorry for the belated reply. hmmm. may be yes. there is similarity in rhythm.

  ReplyDelete
 8. వారసుడు సంగీతం కీరవాణి (రాగం కాదు - మనిషి :) ) అనుకుంటానండి.
  మీ విశ్లేషణ బాగుంది. బ్లాగు ఈ రోజే చూసాను. అన్ని పోస్టులు చదువుతాను.

  ReplyDelete