Friday, March 23, 2012

పాపనాశం శివన్ + కద్రి గోపాల్ నాథ్ +’జ్ఞాన వినాయకనే’ - ఒక దివ్యానుభూతి.



ఇద్దరు మహా సంగీత విద్వాంసుల కలయికలో ఒక పరమాద్భుతమైన కీర్తన ఒక్కసారి పునశ్శ్రవణం చేసుకుంటే ఆ’నందనం’ గా ఉంటుంది అనిపించింది.


పాపనాశం  శివన్-- తమిళ త్యాగరాజు గా పేర్కాంచిన ఈ వాగ్గేయ కారుడు అద్భుత కీర్తనలను రచించి స్వరపరిచాడు. వీరు  (1890 -1973) కూర్చిన  ’జ్ఞాన వినాయకనే’  కృతిలో వేగం + మాధుర్యం + కద్రి గోపాల్ నాధ్ శాక్సోపోన్ వాదనం పామరులనైనా పరవశింపజేస్తాయి.
కద్రి గోపాల్ నాథ్ (కద్రి గోపాల్ నాథ్ జాలపుట చిరునామా) saxophone maestro అన్న విషయం సంగీత ప్రేమికులందరికీ తెలుసును. వారికి వారే సాటి.

రాగం. గంభీరనాట. కొంచెం తిలాంగ్ రాగంలా అనిపిస్తుంది. అవరోహణలో నిషాదం మార్పుతో.


duet సినిమాలో వీరు sax వాయించి చిత్ర సంగీతాన్ని అమాంతం elevate చేశారు. ఈ పాటలో అక్కడక్కడ వినవచ్చు.


మరికొన్ని అమృత పాణీలు ఇక్కడ-- పురందర దాసర కృతి ’వెంకటాచల నిలయం’
 
’కృష్ణా నీ బేగనే బారో’ -
 
ఆకాశంలో శబ్దం తన అంశ అని గీతాచార్యుని ఉవాచ. ఆ శబ్దం ఇటువంటి మహా విద్వాంసుల సంగీతమేనేమో.

4 comments:

  1. I am not a fan of Kadri Gopalnath, but like your write up.

    ReplyDelete
  2. ఇదే మొదటిసారి "వేంకటాచల నిలయం" గోపీనాద్ గారు వాయించినది sax లో వినటం. చాలా బాగుంది. థాంక్స్ ఫర్ ది పోస్టింగ్.

    ReplyDelete
  3. నారాయణ స్వామి గారు, లక్కరాజు రావు గారు; నెనర్లు.

    ReplyDelete
  4. తెలుగు అభిమాని గారూ,
    కద్రి గారి శాక్సో ఫోన్ అంటే నాకు ప్రాణమండీ! చాలా కలెక్షన్ ఉంది నా దగ్గర.

    జ్ఞాన వినాయకనే అద్భుతంగా ఉంది. వెంకటా చల నిలయం చెప్పక్కర్లేదు

    ReplyDelete