తెలుగులో యుగళగీతాలకు పరిపూర్ణత తెచ్చినవారు ఘంటసాల సుశీల. వారు పాడిన వందల పాటలలో పది అత్యుత్తమమైనవి అని నాకు అనిపించినవి ఒక జాబితా.
ఇవి మనతెలుగువారి అపురూప సంపద.
పదే ఎందుకు ? ఈ జాబితా అవసరమా ? అంటే ఏమీ లేదు. ఉబుసుపోక అంతే.
ఈ పాటల ఎంపికలో నేను పాటించిన ప్రాథమ్యాలు 1) మాధుర్యం 2) పాట బాణీ 3) ఎన్నిమార్లు విన్నా హాయిగా ఉండటం 4) సాహిత్యం.
1) మనసు పరిమళించెనే - శ్రీ కృష్ణార్జున యుద్ధంలోని ఈ పాట లో అణువణువునా మాధుర్యం తొణికిసలాడుతుంది. సంగీతం పెండ్యాల . పాట వింటే చాలు పదిమాటలేల. నా మొదటి వోటు ఈ పాటకే
2) కొండగాలి తిరిగింది. గుండె ఊసులాడింది. : చిత్రం ఉయ్యాల జంపాల. సంగీతం పెండ్యాల పాటను మలయా మారుతంలో చక్కగా స్వరపరిచాడు. ఆరుద్ర మలయమారుతాన్ని అచ్చతెనుగులో కొండగాలిగా మార్చాడు.
ఆరుద్ర ఈ పాటలో విశ్వరూపం చూపాడు. 'పట్టపగలు సిరివెన్నెల భరతనాట్యమాడింది'; 'మొగలిపూల వాసనతో జగతి మురిసిపోయింది'; 'ప్రాప్తమున్న తీరానికి పడవ సాగి పోయింది'...
3) మోహనరాగమహా మూర్తిమంతమాయే : చిత్రం మహామంత్రి తిమ్మరుసు. సంగీతం పెండ్యాల రచన పింగళీ. ఈ పాటలో ఘంటసాల సుశీల ఆలాపనలు విని పరవశించిపోవచ్చు. పెండ్యాల గీతాలలో ఆలాపనలకు తప్పక చోటు ఉంటుంది. ఆయన trademark అని చెప్పవచ్చు.
4) ఎంతహాయి ఈ రేయి : చిత్రం గుండమ్మ కథ. సంగీతం ఘంటసాల. రచన పింగళి. insominiac లకు చక్కటి మందు ఈ పాట. పింగళి మార్కు brevity కి ఒక మచ్చుతునక.
5) ప్రేయసీ మనోహరి వరించి చేరవే: చిత్రం వారసత్వం సంగీతం ఘంటసాల. ఘంటసాల ఎంతగొప్ప గాయకుడో అంతకుతగ్గ సంగీతకర్తకూడా. పాటను జనరంజకంగా బాణి కట్టడం ఆయనకున్న ప్రత్యేకత.
6) నన్ను వదలి నీవు పోలేవులే : చిత్రం మంచి మనసులు. సంగీతం కె.వి. మహదేవన్. హిందోళం లో స్వరపరచిన ఐ పాట ఒక classic.
7) ఆకాశ వీధిలో అందాల జాబిలి : చిత్రం మాంగల్య బలం. సంగీతం మాస్టర్ వేణు. రచన శ్రీ శ్రీ పాటలో ఒక simplicity, innocence ఉన్నాయి.
8) నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని: చిత్రం గులేబకావళి కథ , రచన సినారె, సంగీతం విజయ కృష్ణ మూర్తి. సినారె తొలిపాట. పాటనిండా అందమైన పదబంధాల గుంఫనం పొందుపరిచాడు. కర్పూరం గంధం గుబాళింపు అనుభూతినిస్తుంది ఈపాట
9) మాధవా మాధవా నన్ను లాలించరా : చిత్రం శ్రీరామకథ (?) సంగీతం s p కోదండపాణి. ఇది ఒక విలక్షణమైన పాట. రాగం కళ్యాణ వాసంతం .
10) సంగమం సంగమం : చిత్రం కోడెనాగు. సంగీతం పెండ్యాల. last but not the least. ఈ పాట ఒక చక్కని యుగళగీతం. ఘంటసాల గొంతు అప్పటికే పాడయింది. కానీ సుశీల గారు తన గాన మాధుర్యంతో more than compensate చేసింది. it is one of my personal favourites.
almost there: ఐనదేమో అయినది , నీ జిలుగుపైట నీడలోన నిలువనీ, పాడవేల రాధిక, ఆడుతు పాడుతు పనిచేస్తుంటే.. the list continues..
అమ్మయ్య. ఎప్పటినుంచో ఘంటసాల సుశీల గార్ల పాటలను ఆత్మీయంగా గుర్తు చేసుకుంటూ ఒక టపా వ్రాయాలి అనుకున్నాను. ఆ కోరిక తీరింది.